CBN Letter To DGP : జంగిల్ రాజ్‌లో ప్రజలకు రక్షణ కరవు - లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలని డీజీపీకి చంద్రబాబు లేఖ
ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందని.. తక్షణం దృష్టి పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖలు రాశారు. అనేక నేరాల్లో వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రమేయం ఉన్నా చర్యలు చేపట్టకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌ో తక్షణం లా అండ్ ఆర్డర్ పై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటలు.. వాటి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు తన లేఖలో తప్పు పట్టారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైం రేట్ పై వివరాలను చంద్రబాబు తన లేఖలో వివరించారు. నేరాలను అదుపు చెయ్యడంలో పోలీసుల వైఫల్యం చెందాలని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, ఇతర వీడియోల వివరాలను చంద్రబాబు లేఖకు జత చేశారు
రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ విచ్చిన్నంఅయి జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని.. పెట్రేగుతున్న వైఎస్ఆర్‌సీపీ గూండాలను అదుపు చెయ్యడంలో పోలీసు శాఖ విఫలం అయిందన్నారు. జి కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు కారణం అని స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పిందని అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శ్రీకాళ హస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలం అయ్యారని.. లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో దారుణం జరిగేది కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణం అవుతున్నాయని గుర్తు చేశారు. గంజాయి సరఫరాలో వైసిపి నేతల ప్రమేయం కనిపిస్తున్నా....పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అనంతపురంలో పెన్షన్ అడిగిన పాపానికి పోలీసు అధికారి టిడిపి కార్యకర్తపై దాడి చెయ్యడం డిపార్ట్మెంట్ లో పరిస్థితికి అద్దం పడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్ తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగిందన్నాకుయ ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎపి పోలీసులు స్పంచకున్నా....కర్నాటక పోలీసులు వైసిపి ఎంపిటిసి ని అరెస్టు చేశారని.. తాజాగా ఎపి నుంచి అస్ట్రేలియాకు డగ్స్ వెళ్లిన కేసు లో దర్యాప్తు సంస్థలు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాయన్నారు. నేరాల్లో నిందుతుల పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు...లా అండ్ ఆర్డర్ అమలు పై పోలీసు శాఖ దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించారు.
ఏపీలో వరుసగా నేరాలు జరుగుతున్నప్పటికీ నిందితులపై తీసుకుంటున్న చర్యల విషయంలో పోలీసులు సీరియస్‌గా లేరన్న ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ నేతలకు సంబందించిన వారయితే ఓ రకంగా... ఇతరులు అయితే మరో రకంగా పోలీసులు స్పందిస్తున్నారని టీడీపీ నేతలు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. అదే్ తరహాలో ఇప్పుడు టీడీపీ అదినేత కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిలయిందని నేరుగా డీజీపీ లేఖ రాసి.. అదే విషయాన్ని నేరుగా చెప్పారు.
ం