అన్వేషించండి

Pawan Kalyan Telangana Controversy 2026: పవన్ కల్యాణ్‌కు ‘వ్యతిరేకతే’ వరమైందా? తెలంగాణ పార్టీల అటాక్.. జనసేనకు లభించిన వ్యూహాత్మక మైలేజ్!

Pawan Kalyan: పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక శక్తిగా ఎదిగారు. మూడు రోజుల పాటు ఆయన చుట్టూనే రాజకీయాలు తిరిగాయి. ఈ మైలేజ్‌ను ఆయన గట్టిగా వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

JanaSena Telangana:  రాజకీయాల్లో ‘నెగెటివ్ పబ్లిసిటీ’ అనేది కొన్నిసార్లు ఒక నాయకుడికి ఎంతటి మైలేజీని ఇస్తుందో చెప్పడానికి ప్రస్తుత తెలంగాణ రాజకీయాలే తాజా ఉదాహరణ. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన  ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’* చుట్టూ జరిగిన పరిణామాలు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో 'సెంటర్ ఆఫ్ అట్రాక్షన్'గా మార్చాయి. గతంలో ఓట్లు, సీట్లు సాధించలేకపోయిన పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు   ప్రాధాన్యత ఇస్తున్నాయి. 

గత ఓటములు వేరు - ప్రస్తుత హోదా వేరు 

గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు జనసేనకు తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాలేదన్నది వాస్తవం. డిపాజిట్లు కూడా రాలేదు . కానీ నాటి పవన్ కల్యాణ్‌కు, నేటి పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఘనవిజయంలో కీలక పాత్ర పోషించి, ఒక పక్కా  పొలిటికల్ విన్నర్ గా, ఏపీ డిప్యూటీ సీఎంగా పవర్‌ఫుల్ హోదాలో ఉన్నారు. ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పక్క రాష్ట్రంలో సభ పెట్టాలనుకున్నప్పుడు ఉండే పొలిటికల్ వెయిట్ వేరుగా ఉంటుంది. ఈ మార్పును గమనించే ఇక్కడి పార్టీలు ఆయనను సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించాయి.

కవిత అటాక్ - కోల్పోయిన స్పేస్ కోసం ఆరాటం 

 ల్వకుంట్ల కవిత  తెలంగాణ రక్షణ సేన  వేదికపై పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ‘పళ్లు రాలగొడతాం’, ‘విగ్రహాలు పార్సిల్ చేస్తాం’ అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక ఒక స్పష్టమైన వ్యూహం ఉంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటముల తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌పై పట్టు కోల్పోయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను ఒక ‘ఆంధ్రా నేత’గా ప్రొజెక్ట్ చేసి, ఆయనపై దాడి చేయడం ద్వారా మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి బీఆర్ఎస్ ఓటు బ్యాంకును..సానుభూతిపరుల అభిమాన్ని పొందాలని కవిత ప్లాన్ చేసుకున్నారు.  

 కాంగ్రెస్ మంత్రి పొన్నం వ్యూహం - సెంటిమెంట్ చేజారకుండా 

కవిత టీఆర్ఎస్ మాత్రమే కాకుండా, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  తెలంగాణ ఏర్పడినప్పుడు ఏడ్చిన వ్యక్తికి ఇక్కడ నవనిర్మాణం గురించి మాట్లాడే హక్కు లేదు, ముందు క్షమాపణ చెప్పాలి  అంటూ ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ మా అయ్య జారీకే అని ప్రకటించుకున్నారు.  కవిత  మాత్రమే తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకోకుండా, అధికారంలో ఉన్న తాము కూడా ఇక్కడి ఆత్మగౌరవాన్ని కాపాడగలమని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ఈ క్రమంలో రెండు ప్రధాన పార్టీలు పవన్‌ను టార్గెట్ చేయడం ఆయన పొలిటికల్ గ్రాఫ్‌ను మరింత పెంచింది.

పవన్‌కు లభించిన  విక్టిమ్ కార్డ్ 

గచ్చిబౌలి సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడం జనసేనకు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది. శాంతిభద్రతల సమస్యలు, ట్రాఫిక్ సాకులు చెప్పి సభను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం పవన్‌ను ఒక ‘బాధిత నేత’గా మార్చేసింది. పవన్ కల్యాణ్ కూడా ఏమాత్రం తగ్గకుండా మంగళవారం సాయంత్రం తన నివాసంలో ప్రెస్‌మీట్ పెట్టి.. ఇచ్చిన కౌంటర్ నేషనల్ లెవెల్లో హైలైట్ అయింది. ఒక సాధారణ సభ జరిగి ఉంటే ఆయన తన క్యాడర్‌కు దిశా నిర్దేశం చేసి వెళ్ళిపోయేవారు. కానీ ఈ నిషేధం వల్ల ఆయన తెలంగాణలో ఒక బలమైన 'ప్రత్యామ్నాయ శక్తి'గా ప్రొజెక్ట్ అయ్యారు.

 అత్యుత్సాహమా? వ్యూహాత్మక తప్పిదమా? 

ఈ మొత్తం ఎపిసోడ్‌లో తెలంగాణ నేతలు చేసినది వ్యూహాత్మక తప్పిదం  అనే చెప్పాలి. పవన్ కల్యాణ్‌ను పొలిటికల్ గా తొక్కేయాలనే అత్యుత్సాహంతో వారు చేసిన కామెంట్లు, తీసుకున్న నిర్ణయాలు చివరికి జనసేనకే మేలు చేశాయి. రాజకీయాల్లో విమర్శలు ఎంత తీవ్రంగా ఉంటే, సదరు నాయకుడి వైపు అంతగా ఫోకస్ పెరుగుతుంది. తెలంగాణలో ఉన్న లక్షలాది మంది జనసేన అభిమానులు, సెట్లర్లు మరియు తటస్థ ఓటర్లు ఇప్పుడు పవన్ కల్యాణ్ వైపు మరింత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఈ వివాదం దోహదపడింది. తెలంగాణ పార్టీలు పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా బలహీనపరచాలని చూశాయి, కానీ ఫలితం మాత్రం రివర్స్ అయింది. జనసేనను తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఒక బలమైన శక్తిగా నిలబెట్టడంలో ఇక్కడి నేతల విమర్శలు, పోలీసుల ఆంక్షలే ప్రధాన పాత్ర పోషించాయి.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget