అన్వేషించండి

Pawan Kalyan Press Meet:"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్

Pawan Kalyan Press Meet:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హైదరాబాద్‌లో సంచనల ప్రెస్‌మీట్ పెట్టారు. తెలంగాణలో గత కొద్ది రోజులుగా జనసేన, పవన్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించారు.

Pawan Kalyan Press Meet: తెలంగాణలో పార్టీ బలోపేతం, వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీతోపాటు ఈ మధ్య కాలంలో తనపై తెలంగాణలో జరుగుతున్న దాడిపై పవన్ సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు. "ప్రతిసారీ తెలంగాణ గురించి మాట్లాడుతుంటే విమర్శిస్తున్నారు. అలాంటి వ్యక్తులకు నా విజ్ఞప్తి, జనసేన తెలంగాణ నడిబొడ్డులో పెట్టాం. ఇవాళ తెలంగాణపై ప్రేమ, ఇష్టం రాజకీయాలకు అతీతమైంది. 2007 నుంచి నాతో ఉన్న నాయకులు వీరంతా. ఇవాళ్టి ఇవాళ్టికి తెలంగాణపై తెచ్చుకున్న ప్రేమ కాదు. విభజన తర్వాత వచ్చిన ప్రేమ కాదు. "

"ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష రాక ముందే ఇక్కడి సంస్కృతి, పోరాటాలను స్ఫూర్తిగా తీసుకున్నాను. విమర్శించే నాయకులంతా కూడా 2007లో ఎవరూ లేరు. తెలంగాణ నలుమూలల తిరిగిన వాడిని, వెళ్లిన వాడిని, గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని డివిజన్స్‌లో జాతీయ జెండా ఎగరేశాం. మీరు ఒకప్పుడు నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే నాయకులు ఎవరూ తిరగలేదు. గెలుస్తామో లేదో తెలియకుండానే తండాల్లో బోర్లు వేయించాం. ఎందుకంటే తెలంగాణ అంటే నాకు ఇష్టం. "

"తెలంగాణ విభజన తీరుకు నేను వ్యతిరేకం, తెలంగాణ విభజనకు కాదు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ, ఆంధ్రాను విభజించిన తీరును తప్పు అని చెప్పాను. నాకు నిలబడింది కష్టాల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వారాహికి అనుమతి ఇవ్వలేదు. తెలంగాణలో అనుమతి ఇచ్చారు. ఆంధ్రాలో అడుగు పెట్టనివ్వబోను అని నాడు వైసీపీ ప్రభుత్వం అంటే నాకు అండగా నిలబడింది తెలంగాణ యువత." 

తెలంగాణ అధికారం కోరుకోను, మార్పు తప్ప. సమస్యలపై పోరాడమని తెలంగాణ నాయకులకు చెప్పాను. తెలంగాణ ప్రజలకు ఆంధ్రాపై విధ్వేషం లేదు. తెలంగాణ నాయకులందరికీ లేదు. నిజంగానే విధ్వేషం చూపించి ఉంటే ఒక్క ఆంధ్ర వ్యక్తి ఇక్కడ ఉండేవారు కాదు. ఇది తెలంగాణ ప్రజల ప్రేమ. అలాంటిది హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావ్‌, ఇక్కడేం పని అని అడుగుతున్నారు. మీరెవరు నన్ను బెదిరించడానికి, మీ అయ్య జాగీరా తెలంగాణ? తెలంగాణ బెదిరింపుల కంటే ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. అక్కడ తల తీసేయమంటారు. నేను ఓడిపోయినప్పుడు తెలంగాణ నాయకులు ఒకటే చెప్పారు. ఇక్కడ అలాంటి పరిస్థితి రానిచ్చేవాళ్లం కాదన్నారు. తెలంగాణ కొత్తగా బావుకునేది లేదు. నా  ఇంటి అడ్రెస్ చెప్పేందుకే ఇక్కడ ప్రెస్‌మీట్ పెట్టాను. ఎవరైనా దాడి చేసుకోవచ్చు. భయపడే వాడిని కాదు. "

" ఇప్పటి వరకు తెలంగాణ నాయకుడిని ఒక్కడిపై కూడా మాటల దాడి చేయలేదు. ప్రజలు కోరుకున్నప్పుడు వస్తాను. నాయకులకు అదే చెప్పాను. ముందు ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పాను. "

"నా గుండెల్లో తెలంగాణ ఉంది. మీరెవరు నన్ను అడ్డుకోవడానికి, వైసీపీ గ్యాంగ్స్, క్రిమినల్స్ గ్యాంగ్స్ బెదిరించారు భయపడలేదు. ఇదంతా ఒక విశ్లేషకుడు చేసిన కామెంట్స్‌తో ఈ వివాదం మొదలైంది. ఆయన అమిత్‌షాతో నేను మాట్లాడినట్టు ప్రచారం చేశారు. దాన్ని తప్పుబడుతూ జనసైనికులు కేసులు పెట్టారు. దీంతో ప్రతి విషయానికి ఆంధ్రవాడే కారణమని ప్రచారం చేస్తున్నారు."  

చెరువు కబ్జాపై పవన్ స్పందన 

నేను కబ్జా చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. పవన్ ఆ చెరువును కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఇవాళే రాసేస్తాను. వామపక్ష వాదులం అని విశ్లేషకుడు మాట్లాడుతూ, ఇప్పుడు ప్రాంతీయ వాదనకు వచ్చిందా. ఇలాంటి వారి వల్లే కమ్యూనిస్టులకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. గద్దర్‌ బతికి ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. నా ఆఫీస్‌కు వచ్చి బండి కొనమని అడిగితే మూడు రోజుల్లో ఆయన ఇంటికి బండి పంపించాను, బతికి ఉన్నప్పుడు ఆయనకు మీరు ఆయనకు ఏం చేశారు. ఖుషి సినిమా తర్వాత నన్ను కలిశారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఆయన మంచి సన్నిహితుడు. ఆయన ఒక లెటర్ రాసిస్తే, ఆయన ఒక ఆడియో ఫైల్ చేసి ఆయన ఛానల్‌కు రిలీజ్ చేస్తే బయటకు వచ్చింది. 

కమిట్‌మెంట్‌ లేకపోతే కొండగట్టుకు విరాళం ఇస్తాను. వైఎస్‌ బతికి ఉన్నప్పుడు ఆ రోజు మీ గొంతులు ఏమయ్యాయి. యువ రాజ్యం పెట్టిన తర్వాత భీమ్‌రావ్‌ వాడ కోసం నాపై తొలి కేసు నమోదు అయ్యింది. దాడులు, కేసులు, బెదిరింపులు కొత్త కాదు. అన్నీ తట్టుకొని బయటకు వచ్చాం. మీ తాటాకు చప్పుళ్లకు బెదిరబోను. నా వల్ల కబ్జా జరిగి ఉంటే సీజ్‌ చేయండి. ప్రైవేటు స్థలాల్లోకి వస్తే కేసులు ఎదురుకోవాల్సి ఉంటుంది. భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్లం కాదు. ప్రతి విషయంలో ప్రాంతీయ వాదం తీసుకొస్తే భారత్‌ మనుగడ కష్టం. తెలంగాణకు మొదట గొంతులేపిందే జనసేన. కాంగ్రెస్ నాయకులు నాలుకు చీరుస్తామంటున్నారు. రండీ రెడీగా ఉన్నాం. 2019లో శివ, మల్లికార్జున్‌ నన్ను వెతుక్కొని వచ్చారు. సమస్యలు చెప్పుకున్నారు. ఆ రోజు మేం ఓడిపోయినా వచ్చిన సమస్యలు చెప్పుకున్నరంటే నాపై ఉన్న నమ్మకం. 

"బీఆర్‌ఎస్ పేరు మారిస్తే స్వాగతించిన వ్యక్తిని నేను, జనసేన పార్టీ నాయకుడినే అధ్యక్షుడిగా చేస్తే సంతోషించాను. అలాంటిది జనసేన పార్టీ తెలంగాణకు రాకూడదా, ఇక్కడ జనసేన గెలిస్తే పవన్ ముఖ్యమంత్రి అవుతాడా? ఆంధ్రప్రదేశ్‌లోనే దిక్కులేదు కదా. వాళ్ల భయం ఏంటంటే జనాలను చైతన్యం చేస్తామనే భయం వారది. వేల మందితో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వరా? ఒక విశ్లేషకుడు చేసిన కామెంట్స్‌పై స్పందించే స్వేచ్ఛ కూడా మాకు లేదా, నేను ప్రాంతీయ వాదాన్ని ఎక్కడ అవమానించాను. నేను ఆంధ్ర వ్యక్తిని ఇక్కడికి రావద్దని అంటున్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్స్ రావచ్చా? ఎవర్ని మోసం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇలాంటివి గుర్తించాలి. బిజినెస్‌లు, కాంట్రాక్టులు బాగానే ఉన్నాయి. కానీ నా లాంటి వ్యక్తి మాత్రం బెదిరిస్తారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, పోటీ చేస్తాం. ప్రతి సమస్యపై మాట్లాడుతా, పోరాటాలు చేస్తా తెలంగాణ భారత్‌లోనే అంతర్భాగం. తెలంగాణ వ్యతిరేకించిన వారంతా పదవుల్లో ఉన్నారు. వ్యతిరేకించిన వారంతా ఎమ్మెల్యేలు అయ్యారు. తెలంగాణలో జనసేనను నిలబెట్టింది నాయకులే. వేరే పార్టీకి వెళ్లిపోమని చెప్పాను. వారు వెళ్లకుండా నాతో నా ఆశయాలతో నిలబడ్డారు. నాడు వైఎస్ రాజశేఖర్‌ కూడా ఇలానే బెదిరించారు. ఒక్కొక్కర్ని తన్ని తరిమేశాం."

"బీఆర్‌ఎస్ పేరు మారిస్తే స్వాగతించిన వ్యక్తిని నేను, జనసేన పార్టీ నాయకుడినే అధ్యక్షుడిగా చేస్తే సంతోషించాను. అలాంటిది జనసేన పార్టీ తెలంగాణకు రాకూడదా, ఇక్కడ జనసేన గెలిస్తే పవన్ ముఖ్యమంత్రి అవుతాడా? ఆంధ్రప్రదేశ్‌లోనే దిక్కులేదు కదా. వాళ్ల భయం ఏంటంటే జనాలను చైతన్యం చేస్తామనే భయం వారది. వేల మందితో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వరా? ఒక విశ్లేషకుడు చేసిన కామెంట్స్‌పై స్పందించే స్వేచ్ఛ కూడా మాకు లేదా, నేను ప్రాంతీయ వాదాన్ని ఎక్కడ అవమానించాను. నేను ఆంధ్ర వ్యక్తిని ఇక్కడికి రావద్దని అంటున్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్స్ రావచ్చా? ఎవర్ని మోసం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇలాంటివి గుర్తించాలి. బిజినెస్‌లు, కాంట్రాక్టులు బాగానే ఉన్నాయి. కానీ నా లాంటి వ్యక్తి మాత్రం బెదిరిస్తారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, పోటీ చేస్తాం. ప్రతి సమస్యపై మాట్లాడుతా, పోరాటాలు చేస్తా తెలంగాణ భారత్‌లోనే అంతర్భాగం. తెలంగాణ వ్యతిరేకించిన వారంతా పదవుల్లో ఉన్నారు. వ్యతిరేకించిన వారంతా ఎమ్మెల్యేలు అయ్యారు. తెలంగాణలో జనసేనను నిలబెట్టింది నాయకులే. వేరే పార్టీకి వెళ్లిపోమని చెప్పాను. వారు వెళ్లకుండా నాతో నా ఆశయాలతో నిలబడ్డారు. నాడు వైఎస్ రాజశేఖర్‌ కూడా ఇలానే బెదిరించారు. ఒక్కొక్కర్ని తన్ని తరిమేశాం."

ప్రియాంక వచ్చి కేరళలో పోటీ చేయవచ్చు, పీవీని నంద్యాలో గెలిపించారు. అయినా కాంగ్రెస్ పార్టీది ప్రాంతీయవాదమా, తెలంగాణ నేతల కామెంట్స్‌పై రాహుల్ స్పందిస్తారని ఆశిస్తున్నాను. మీకు ఏంటీ హిపోక్రసీ, ఈ లెక్కలు వేసుకుంటే ప్రతి రాష్ట్రానికి పాస్‌పోర్టులు తీసుకొని వెళ్లాలా. పాశం యాదగిరితో నేను మాట్లాడాను, చాలా గౌరవం చూపించిన వ్యక్తి కూడా నన్ను తిడుతున్నారు. ఎక్కడికి పారిపోవాలి. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టొద్దు. భయపెట్టే కొద్ది గుండె గట్టిపడుతుంది కానీ భయపడం. తెలుగు రాష్ట్రాల నుంచి 13 లక్షల మంది డిగ్రీలు చేస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగత పెరిగిపోతోంది. ఇలాంటి వాటి గురించి మాట్లాడితే జనసేన వద్దా.

ప్రాంతీయత వాదం తీసుకొస్తే భారత్ అంతరంగిక భద్రత దెబ్బతింటుంది. ఆఫీస్‌ల్లో ఎవరు పని చేయలేరు. ఎంత మంది జర్నలిస్టులో ఏపీ నుంచి వచ్చారో తెలుసుకోండి. తెలంగాణ వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎంను ఎందుకు ప్రశ్నించరు. ఐ లవ్ పాకిస్తాన్ అన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు జనసేనతోనే శాంతిభద్రతల సమస్య వస్తుందా. తిరిగి కాంగ్రెస్ నాయకులు గడీల పాలన తీసుకొస్తారా?

అన్నింటికీ సమాధానం చెబుతున్నారు. ప్రెస్‌మీట్ లైవ్‌ లింక్‌ ఇక్కడ ఉంది. 

ఎక్కువ మంది చదివిన ఈ వార్తలు మిస్ అవ్వొద్దు

1 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్
2 హరీష్ రావుపై మైండ్ గేమ్ - బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
3 విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
4 పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. ఆ తర్వాతే హైదరాబాద్ లో సభ
5 పవన్‌కు షాకిచ్చిన పోలీసులు - మీటింగ్‌కు నో పర్మిషన్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Hyderabad Traffic Diversions: నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌లో 2 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు!
నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌లో 2 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు!
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Embed widget