అన్వేషించండి

Pawan Kalyan Press Meet: పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 

Pawan Kalyan Press Meet: తెలంగాణలో పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్ హైవోల్టేజ్ డ్రామాకు దారి తీస్తోంది. నవ నిర్మా సభకు బ్రేక్‌ వేయడంతో ఆయన ప్రెస్‌మీట్ పెడుతున్నారు. ఇది కూడా పొలిటికల్ హీట్‌ను పెంచేస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో నవ నిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
  • అనుమతి నిరాకరణపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది.
  • కాంగ్రెస్ పార్టీ పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై వ్యతిరేకత వ్యక్తం చేసింది.
  • గన్ పార్క్ వద్ద జనసేన, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Pawan Kalyan Press Meet: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. జనసేనాని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పెడుతున్న పొలిటికల్ ప్రెస్‌మీట్‌ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవ నిర్మాణ సభ పేరుతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని భావించారు. కానీ పోలీసులు, హైకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో కేవలం ప్రెస్‌మీట్‌తో సరిపెడుతున్నారు. విశ్లేషణతో మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ అజెండా, ప్రాంతీయవాదం చుట్టూ అల్లుకుంది. ఇంతకీ ప్రెస్‌మీట్‌లో వీటిపై పవన్ స్పందిస్తారా లేదా తన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి వదిలేస్తారా అనే చర్చ నడుస్తోంది.

చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పోలీసులు 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ హైదరాబాద్‌ వేదికగా నవ నిర్మాణ సభ పేరుతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని చూశారు. అయితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో తెలంగాణ పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. మంగళవారం నగరంలోని ఒక ప్రముఖ హోటల్‌లో ఈ సభకు జనసేన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ చివరి నిమిషంలో అనుమతి రాకపోవడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్‌ తన నివాసంలో ప్రెస్‌మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. 

హైకోర్టులో చుక్కెదురు

మరోవైపు పట్టువదలని జనసేన పోలీసుల అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ జనసేన లీగర్‌సెల్ హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా విచారణ జరిపి సభకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇదే సమయంలో తెలంగాణకు చెందిన వ్యక్తులు హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. 

పవన్‌పై కాంగ్రెస్ విమర్శలు

మరోవైపు పవన్ కల్యాణ్‌ తెలంగాణలో రాజకీయాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ వాటికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని పవన్ గతంలో అన్నారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ రాజకీయం చేస్తామంటే ఎలా అంగీకరిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీకి మేలు చేయడానికి పవన్ కల్యాణ్‌ను తెలంగాణలోకి బీజేపీ పంపిస్తోందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు వైషమ్యాలు సృష్టించడానికే ఈ ప్రయత్నమని పీసీసీ చీఫ్‌ మహేష్ గౌడ్‌ విమర్శించారు. వ్యక్తుల మధ్య ఉండే విభేదాలను ప్రాంతాల మధ్య వైరుధ్యంగా మార్చడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హితవు పలికారు. పవన్ తన అభిప్రాయాలను ఏపీలోనే వ్యక్తం చేయవచ్చని, అనవసర వివాదాల కోసం హైదరాబాద్‌ రావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. 

గన్ పార్క్ వద్ద ఘర్షణ

కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాకుండా, వివాదం భౌతిక దాడుల వరకు వెళ్లింది. మంగళవారం ఉదయం అమరవీరుల స్మార చిహ్నం వద్ద నివాళులర్పించే క్రమంలో జనసేన, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురెదురు పడ్డారు. పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని జనసేన నేతలు నిరసించగా, కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కాస్తా తీవ్ర వాగ్వాదానికి, తోపులాటకు దారి తీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో కాసేపు గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 
    
మరోవైపు పవన్ కల్యాణ్ తన పోరాట పటిమను తెలంగాణ నుంచే నేర్చుకున్నానని పవన్ చెబుతున్నారు. జనసేన ఊపిరి పోసుకున్నదే తెలంగాణ గడ్డపై అని, ఈ నేలంటే తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. కనీసం తన ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టుకోవడానికైనా అనుమతి ఇస్తారా అని ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాజకీయాల్లోకి పవన్  రావడం పార్టీ విస్తరణ ప్రయత్నం మాత్రమే కాదు. ఇది రాబోయే రోజుల్లో తెలంగాణలో మారబోతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతం. కాంగ్రెస్ దీనిని తీవ్రంగా ప్రతిఘటిస్తుండగా, దీని వెనుక బీజేపీ ఉందనే ఆరోపణలతో విరుచుకుపడుతోంది. 

ఎక్కువ మంది చదివిన ఈ వార్తలు మిస్ అవ్వొద్దు

1 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్
2 హరీష్ రావుపై మైండ్ గేమ్ - బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
3 విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
4 పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. ఆ తర్వాతే హైదరాబాద్ లో సభ
5 పవన్‌కు షాకిచ్చిన పోలీసులు - మీటింగ్‌కు నో పర్మిషన్

Frequently Asked Questions

పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవ నిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, పవన్ కల్యాణ్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

నవ నిర్మాణ సభకు ఎందుకు అనుమతి లభించలేదు?

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ పోలీసులు నవ నిర్మాణ సభకు అనుమతి నిరాకరించారు.

హైకోర్టులో జనసేన పిటిషన్‌కు ఏమైంది?

అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ జనసేన లీగల్ సెల్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోంది?

గతంలో పవన్ కల్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ఆయనకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఆయన తెలంగాణ రాజకీయాలు చేయడం సరికాదని విమర్శిస్తోంది.

గన్ పార్క్ వద్ద జరిగిన ఘర్షణకు కారణం ఏమిటి?

నవ నిర్మాణ సభకు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తున్న జనసేన కార్యకర్తలు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ఎదురుపడటంతో ఘర్షణ చోటు చేసుకుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక ముఖ్యమంత్రి డీకేకు రెండో రోజే షాక్ ఇచ్చిన సీనియర్ మంత్రి - రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక ముఖ్యమంత్రి డీకేకు రెండో రోజే షాక్ ఇచ్చిన సీనియర్ మంత్రి - రామలింగారెడ్డి రాజీనామా!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
BJP Silent Operation North Telangana: ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
KS Bharat Announces Retirement:  ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
Embed widget