అన్వేషించండి

Modi Cabinet Reshuffle 2026 Telangana: మోదీ కేబినెట్ విస్తరణ - తెలంగాణ నుంచి ఈటల కు ఛాన్స్ - బండి సంజయ్‌కు ప్రమోషన్?

Modi Cabinet Bandi Sanjay: కేంద్ర మంత్రివర్గ మార్పులపై తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్, డి.కె. అరుణ పేర్లు రేసులో ఉండగా, బండి సంజయ్ కు కేబినెట్ ర్యాంక్ ఇవ్వొచ్చని చెబుతున్నారు.

Modi Cabinet Reshuffle 2026:  తెలంగాణలో బీజేపీ బలపడుతున్న తరుణంలో, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ  రాజకీయ వర్గాల్లోనూ వేడి పుట్టిస్తోంది.   కేంద్రంలో మోదీ 3.0 సర్కార్ రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేసే దిశగా కొత్త నిర్ణయాలు తీసుకోబోతోంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్న  బండి సంజయ్ కు కేబినెట్ ర్యాంకు ఇస్తారనే టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్, పార్టీ కేడర్‌లో ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకుని ఆయన పోర్ట్‌ఫోలియోను పెంచే అవకాశం ఉంది.  వాస్తవానికి ఆయన కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసుతో  ఆయనను అసలు మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ లాంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ  మోదీ భిన్నంగా ఆలోచించే అవకాశం ఉంది. 

 సామాజిక సమీకరణాలే ప్రాధాన్యం 
తెలంగాణ రాజకీయాల్లో బలమైన నేతగా ఉన్న ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చని బీజేపీ యోచిస్తోంది. ఆయనకు కేబినెట్ లేదా స్వతంత్ర హోదా కలిగిన రాష్ట్ర మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం. మహిళా కోటాలో,  దక్షిణ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే నేతగా డి.కె. అరుణ పేరు పరిశీలనలో ఉంది. జాతీయ స్థాయిలో పార్టీ ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఆమెకు కలిసి వచ్చే అంశం. ఉత్తర తెలంగాణ నుంచి బలమైన వాయిస్ వినిపించే అరవింద్‌ను కూడా ఏదైనా కీలక బాధ్యతల్లోకి తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 కిషన్ రెడ్డికి కొత్త బాధ్యతలు? 

ప్రస్తుతం బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా ఉన్న జి. కిషన్ రెడ్డికి బాధ్యతల మార్పు ఉంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఆయనను పూర్తిగా పార్టీ సంస్థాగత పనులకు పరిమితం చేస్తారా లేదా ఇంకా కీలకమైన శాఖను అప్పగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నందున, ఆయన అనుభవాన్ని ఎక్కడ వినియోగిస్తారనేది ప్రధాని నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

 రాజకీయ వ్యూహం - 2028 లక్ష్యం                                      

తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మోదీ తన టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. కేబినెట్ లో చోటు కల్పించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో బీజేపీ బలాన్ని పెంచుకోవాలన్నది వ్యూహం. ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే తెలంగాణ నుంచి కనీసం ముగ్గురు లేదా నలుగురికి  అవకాశం దక్కవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరోసారి కేంద్ర కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించే అవకాశం లేదు. అందుకే వచ్చే ఎన్నికలకు ఇప్పుడే పూర్తి స్థాయిలో మంత్రివర్గ సమీకరణాలనులెక్కలోకి తీసుకోనున్నారు.  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget