అన్వేషించండి

Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?

Telangana BJP: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఇళ్లకు వెళ్లారు. ఇక్కడే ఏదో రాజకీయం ఉందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.

Modi road map for Telangana BJP:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహాలు ఎప్పుడూ అత్యంత ఆశ్చర్యకరంగా, ముందస్తు ప్రణాళికతో కూడి ఉంటాయి. తాజాగా ఆయన హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి మరీ పలకరించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దీని వెనుక కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమే ఉందా లేక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందా అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. 
 
చంద్రబాబు, పవన్ నివాసాలకు వెళ్లడానికి కారణం ఏమిటో ? 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 10న హైదరాబాద్ పర్యటనలో భాగంగా అనుకోని విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. స్వయంగా వారి ఇళ్లకు వెళ్లడం అనేది మోదీ ఇస్తున్న ఒక బలమైన రాజకీయ సంకేతం. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కోటను బద్ధలు కొట్టి, బీజేపీ జెండా పాతిన ఉత్సాహంలో ఉన్న మోదీ.. ఇప్పుడు తన తదుపరి లక్ష్యం తెలంగాణ అని ఈ పర్యటన ద్వారా స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది.  తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు  బెంగాల్, అస్సాంలలో బీజేపీకి అనుకూలంగా రావడంతో, అదే ఊపును తెలంగాణకు కూడా విస్తరించాలని మోదీ భావిస్తున్నారు. అందుకే, ఏపీలో సక్సెస్ అయిన  ఎన్డీయే కూటమి ప్రయోగాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మోదీ ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్‌లతో భేటీ వెనుక తెలంగాణలో ఓటు బ్యాంకును సమీకరించే వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 హైదరాబాద్  వీకెండ్  పాలిటిక్స్ - సస్పెన్స్ భేటీలు 

చంద్రబాబు నాయుడు వీకెండ్స్‌లో హైదరాబాద్‌లో ఉండటం సాధారణమే అయినా, పవన్ కళ్యాణ్ ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ప్రధాని నేరుగా వారి వద్దకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. షెడ్యూల్‌లో లేకపోయినా ఈ భేటీలు జరగడం అంటే.. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా చర్చకు వచ్చి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెటిలర్ల ఓట్లు అత్యంత కీలకం. ఈ ఓట్లను ప్రభావితం చేయడంలో చంద్రబాబు, పవన్‌లకు ఉన్న పట్టును ఉపయోగించుకుని, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎన్డీయేను ఒక బలమైన శక్తిగా మార్చడమే మోదీ లక్ష్యంగా కనిపిస్తోంది.

 దక్షిణాదిపై మోదీ  చాణక్యం 

దక్షిణ భారత దేశంలో కర్ణాటక తర్వాత బీజేపీకి అత్యంత ఆశలు ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఢిల్లీ మద్యం కేసు వంటి అంశాలతో బీఆర్ఎస్ బలహీనపడటం, కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరగడాన్ని సానుకూలంగా మార్చుకోవాలని మోదీ ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో కూటమిని సమన్వయం చేసినట్లుగానే, తెలంగాణలోనూ చంద్రబాబు అనుభవాన్ని, పవన్ ఇమేజ్‌ను వాడుకుని క్లీన్ స్వీప్ చేయాలన్నదే ఆయన అంతరంగం కావచ్చు. అందుకే, కేవలం ఏపీ నేతలుగా కాకుండా  ఎన్డీయే భాగస్వాములు గా వారిద్దరికీ మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని భావిస్తున్నారు.   మోదీ రాజకీయ అడుగులు సామాన్యులకు అర్థం కావడం కష్టమే అయినా, తాజా భేటీలు మాత్రం తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పేలా ఉన్నాయి. అటు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూనే, ఇటు మిత్రపక్షాలతో మంతనాలు జరపడం ద్వారా ఏకకాలంలో రెండు లక్ష్యాలను ఆయన సాధించాలనుకుంటున్నారు.   చంద్రబాబు, పవన్‌లతో జరిపిన భేటీలు తెలంగాణలో ఎన్డీయే కూటమి ఏర్పాటుకు సంకేతంగా కనిపిస్తున్నాయి. ముందస్తు వ్యూహంతోనే మోదీ ఈ హోమ్ విజిట్స్ చేసినట్లు  ఎక్కువ మంది నమ్ముతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget