KCR New Plan : కలసి కట్టుగా దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక ప్రదర్శనలు - విపక్ష నేతలతో కేసీఆర్ మంతనాలు !
బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అన్ని పార్టీలనూ కలుపుకునేందుకు వారితో చర్చలు జరుపుతున్నారు.
KCR New Plan : కేంద్రంపై యుద్ధం విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని కేసీఆర్ డిసైడయ్యారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అన్ని పార్టీలని కలుపుకుని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల విపక్ష నేతలకు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. శుక్రవారం ఉదయం పలువురు ముఖ్యమంత్రులతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. జాతీయ నేతలతోనూ సీఎం చర్చలు కొనసాగుతున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
వివిధ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన కేసీఆర్
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు పలువురు జాతీయ నాయకులతో కేసీఆర్ స్వయంగా ఫోన్‌లో మాట్లాడారని.. కేంద్రంపై పోరాటానికి కలిసి రావాలని కేసీఆర్ వారిని కోరారని చెబుున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని రాష్ట్రాల విపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటూ.. పోరుకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ విధానాలను కేసీఆర్ ఎండగట్టనున్నారు.
ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికే జంట జలాశయాలను ఖాళీ చేస్తున్నారా ? మాజీ ఎంపీ ఎవరిని టార్గెట్ చేశారు ?
పార్లమెంట్ సమావేశాల్లో కలసి కట్టుగా బీజేపీపై విరుచుకుపడే ప్రయత్నం
. పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుని బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయనున్నారు. దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత్నాలకు కేసీఆర్ మరింత పదును పెట్టారు. ఆర్థిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టివేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక దమననీతిని తీవ్రంగా ఖండిస్తూ.. దేశవ్యాప్త నిరసనలతో కేంద్రాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమవుతున్నారని అంటున్నారు.
అటు పోలవరం - ఇటు కాళేశ్వరం మునక ! తప్పెవరిది ?
దేశవ్యాప్తంగా కలిసి నిరసన ప్రదర్శనలు చేపట్టాలనే యోచన
కేంద్రంపై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం మెడలువంచి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడే దిశగా అన్ని విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు మంతనాలు కొనసాగుతున్నాయని ఇవి సత్ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు.