Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Telangana News: బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తాను హస్తంలో చేరనున్నట్లు చెప్పారని సమాచారం.
Brs Mla Decided To Joined in Congress: ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తాను త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు సీఎంకు ఆయన చెప్పినట్లు సమాచారం. మరో 2 రోజుల్లో అనుచరులతో కలిసి తాను హస్తంలో చేరనున్నట్లు చెప్పారని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ సైతం వారి బాటలోనే హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఆయన సీఎం రేవంత్ ను కలిశారు.
కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే??
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2024
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
రేపు కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రచారం. https://t.co/qBAVYxNnAf pic.twitter.com/SYqxh6iy5J
బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్. pic.twitter.com/xmWXi7qOAd
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2024
మరోవైపు, వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ బీఆర్ఎస్ కు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపారు. 'ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు. నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి అధిష్టానం నన్ను అవమానించింది. మళ్లీ ఓడిపోయిన వ్యక్తికే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అందుకే అసంతృప్తితో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నా.' అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
Also Read: High Court: ఆ 106 మంది ఉద్యోగులకు ఊరట - విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు