Andhra NO Talks On Alliance : పొత్తులపై ఎవరూ మాట్లాడొద్దు - ఏపీ బీజేపీ నేతలకు హైకమాండ్ ఫైనల్ వార్నింగ్ !
పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ఏపీ బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పవన్ మూడు ఆప్షన్ల వ్యాఖ్యల కారణంగా పలువురు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Andhra NO Talks On Alliance : ఆంధ్రప్రదేశ్‌లో ఇక పొత్తులపై మాట్లాడవద్దని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఆ పార్టీ నేతలను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. రెండు మూడు రోజులుగా ఏపీలో పొత్తులపై విస్తృత రాజకీయాలు నడుస్తున్నాయి. తమతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ ఒంటరి పోటీ... అలాగే టీడీపీతో పాటు బీజేపీ కలిసి పోటీ చేసే ఆప్షన్లను ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు దూకుడుగా స్పందించారు. విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్ సహా అనేక మంది నేతలు పవన్ ను తప్పు పట్టేలా మాట్లాడారు. ఎవరినో సీఎం చేయడానికి బీజేపీ ప్రయత్నించదని తేల్చి చెప్పారు.
పులివెందులలో వైఎస్ జగన్ ఇంటి కొలతలు తీసుకున్న సీబీఐ - వివేకా మర్డర్ కేసులో దర్యాప్తు ముందుకే !
బీజేపీ నేతల కామెంట్లు కూడా వివాదాస్పదమయ్యాయి. పొత్తులో ఉన్న జనసేన పార్టీని కూడా కించ పరుస్తున్నారని.. తిరుపతి ఉపఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరూ అడగకపోయినాప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన వైపు బీజేపీ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లుగా చెబుతున్నారు. దీంతో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పొత్తుల విషయంలో ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
ఏపీలో పది మార్కులొచ్చిన వాళ్లూ పాసయ్యారా ? అసలు నిజం ఇదిగో
నిజానికి పొత్తులు , సీఎం అభ్యర్థి అనే అంశాలు బీజేపీలో రాష్ట్ర స్థాయిలో తేలేవి కావు. హైకమాండ్ స్థాయిలో నిర్ణయం జరుగుతుంది. కానీ ఇక్కడ కొంత మంది నేతలు ప్రత్యేకమైన ఎజెండాతో వ్యవహరిస్తూ ఉంటారన్న ఆరోపణలు ఉంటాయి. ఇటీవల పవన్ కల్యాణ్ వైఎస్ఆర్‌సీని ఓడించడానికి ఓట్లు చీలకుండా చూస్తామని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లోనూ జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అన్నదానిపై రకరకాల ప్రకటనలను ఆ పార్టీ నేతలు చేశారు.
"టెన్త్ ఫెయిల్" పాపం ఎవరిది ? మీదంటే మీదని టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ రచ్చ !
గతంలో అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు కూడా పొత్తుల అంశం ప్రస్తావనకు వచ్చింది. పలువురు నేతలు పొత్తులపై వివాదాస్పద వ్యా్యలు చేస్తున్నారని కొంత మంది అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడే అమిత్ షా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పొత్తుల గురించి చర్చించవద్దని.. ఎన్నికల సమయంలో వాటిపై నిర్ణయం తీసుకుందామని చెప్పారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే తర్వాత మళ్లీ ఏపీ బీజేపీ నేతలు అలాంటి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.