Achenna On IPS Manikanta : ఐపీఎస్ మణికంఠకు చట్టాలు తెలియదా ? - రూల్స్ పాటించని అధికారులను వదిలే ప్రసక్తే లేదన్న అచ్చెన్న !
రూల్స్ అతిక్రమించే అధికారులను వదిలే ప్రసక్తే లేదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతలో కీలక పాత్ర పోషించి ఐపీఎస్ మణికంఠపై అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
Achenna On IPS Manikanta : నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటిని దగ్గరుండి తెల్లవారుజామున మూడు గంటలకు కూలగొట్టించిన ఏఎస్పీ మణికంఠపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్నెన్నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. 300ఏ ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి కూల్చివేతలు వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ ఆదేశాలు అమలు చేసే పోలీసు అధికారులకు లేదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారిరి మణికంఠ గారికి చట్టాలు తెలియదా అని ప్రశ్నించారు. అర్థరాత్రి, ఇంటిని కూల్చడానికి నిమిషం ముందు నోటీసు ఇవ్వడంపై సమాధానం చెప్పాలన్నారు. ఐపీఎస్ అధికారి మణికంఠ గారి తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాలో ఉంటారు... వారి ఇంటిని అర్థరాత్రి వేళ జేసీబీలతో కూలిస్తే.. మీకు బాధ ఉండదా? అని అచ్చెన్న ప్రశ్నించారు. మణికంఠ తల్లిదండ్రులకు కూడా లేఖ రాస్తాం. ఈ పరిస్థితే వారికి వస్తే.. వారెంత బాధపడతారో లేఖ రాస్తామన్నారు.
పవన్ పిలుపు కోసం ఫృధ్వీ వెయిటింగ్ - జగన్ పిలిచినా వెళ్లనంటున్న కమెడియన్ !
వైఎస్ఆర్‌సీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలపై కక్ష సాధింపుల కోసం నిబంధనలను కూడా పాటించకుండా వ్యవహరిస్తున్న అధికారులను వదిలి పెట్టబోమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అర్థరాత్ర వేళ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇంటిని కూల్చడాన్ని ప్రజలందరూ గమనించారన్నారు. అధికారులకు రాజ్యాంగంపై కనీస పరిజ్ఞానం ఉండదా .. మరీ ఇంత దిగజారిపోతారా అని ప్రశ్నించారు. .
వీళ్లకి ‘అమ్మ ఒడి’ వర్తిస్తుందా? మంత్రి బొత్స క్లారిటీ - వీరికే వర్తింపు
అయ్యన్నపాత్రుడు ఇంటిని కూల్చడం బలహీన వర్గాలపై దాడేనని అచ్చెన్న స్పష్టం చేశారు. జగన్ రెడ్డి అవినీతిని ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అసలు జగన్ రెడ్డికి అయ్యన్న కుటుంబ చరిత్ర తెలుసా .. అయ్యన్నపాత్రుడి కుటుంబం సొంత భూములను ప్రభుత్వాలకు దానం చేసి, అనేక సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడు గారు కావాల్సిన అన్ని అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకున్నారని.. బలహీన వర్గానికి చెందిన అయ్యన్నపాత్రుడి కుటుంబం పట్ల అమానుషంగా ప్రవర్తించారని అచ్చెన్న మండిపడ్డారు.
అర్హులకే అమ్మఒడి ! మరి మీ పేరు ఏ జాబితాలో ఉందో తెలుసుకున్నారా?
అయ్యన్నపాత్రుడు ఇంటి వెనుక గోడ పంట కాలువను ఆక్రమించి కట్టారని అర్థరాత్రి పూట జేసీబీలతో ఐపీఎస్ అధికారి మణికంఠ సమక్షంలో ధ్వంసం చేశారు. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని అయ్యన్న కుమారులు కోర్టుకెళ్లారు. కూల్చివేతలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతోంది.