అన్వేషించండి
Post Office MIS : ఇంట్లో కూర్చుని ప్రతి నెలా 6000 రూపాయలు ఎలా సంపాదించవచ్చు? ఈ పోస్ట్ ఆఫీస్ పథకం గురించి తెలుసా?
Post Office Monthly Income Scheme : పోస్ట్ ఆఫీస్ పథకం ద్వారా నెలకు 6000 రూపాయలు పొందవచ్చు. ఏ పథకం ద్వారా దీనిని పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ నుంచి డబ్బులు ఎలా పొందవచ్చో తెలుసా?
1/6

ప్రతి నెలా కొంత సంపాదనను కోరుకుంటూ.. మీ డబ్బు కూడా సురక్షితంగా ఉండాలని చూస్తుంటే.. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ పథకం వల్ల స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
2/6

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వల్ల ప్రతి నెలా స్థిరమైన మొత్తాన్ని పొందవచ్చు. దీనిలో మీరు ఒకసారి పెట్టుబడి పెడితే.. ఆపై ప్రతి నెలా వడ్డీ రూపంలో డబ్బులు వస్తాయి. ప్రభుత్వ మద్దతుతో కూడుకున్నది కాబట్టి ఈ స్కీమ్ సురక్షితమైనదిగా చెప్తారు.
3/6

ఈ పథకంలో పెట్టుబడిదారుడికి తన డిపాజిట్లపై ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు. అంటే మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుందని అర్థం. ఈ పథకం ఉద్యోగం చేసేవారికి, పదవీ విరమణ చేసిన వారికి మంచి ఎంపిక.
4/6

మీరు ప్రతి నెలా 6000 రూపాయల ఆదాయం పొందాలనుకుంటే.. మీరు ఈ పథకంలో దాదాపు 9.7 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం దీని వడ్డీ రేటు సంవత్సరానికి దాదాపు 7.4%. ఈ లెక్కన ఈ మొత్తంపై సంవత్సరానికి దాదాపు 72,000 రూపాయల వడ్డీ వస్తుంది.
5/6

అంటే ప్రతి నెలా మీరు ఏమీ చేయకుండానే వడ్డీ రూపంలో 6000 రూపాయలు పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ పథకం వ్యక్తిగత, ఉమ్మడి ఖాతాలలో తీసుకోవచ్చు. వ్యక్తిగత ఖాతాలో పెట్టుబడి పరిమితి వేరుగా ఉంటుంది. ఉమ్మడి ఖాతాలో ఎక్కువ మొత్తం జమ చేసే సౌకర్యం ఉంటుంది.
6/6

పథకంలో పెట్టుబడి ఒక నిర్దిష్ట సమయం వరకు ఉంచవచ్చు. ఆ వ్యవధి పూర్తయిన తర్వాత మీ పెట్టుబడి తిరిగి వస్తుంది. పెట్టుబడిదారుడు కోరుకుంటే.. దానిని మళ్ళీ కొత్త పథకంలో పొడిగించవచ్చు. దీని గురించి పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పథకం గురించి మరింత సమాచారం తీసుకోవచ్చు.
Published at : 29 Sep 2025 02:00 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
కర్నూలు
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















