అన్వేషించండి
Liquor Tax in India : మందుబాటిల్పై ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుంది? టాక్స్ లేకపోతే ఎంత ధర ఉంటుంది?
Liquor Bottle Price : భారతదేశంలో మద్యంపై ప్రభుత్వం భారీగా పన్నులు వసూలు చేస్తుంది. పన్ను లేకపోతే బాటిల్ ధర ఎంత ఉంటుంది? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
లిక్కర్‌పై టాక్స్ ఎంత ఉంటుందో తెలుసా
1/7

భారతదేశంలో మద్యంపై ఎక్సైజ్ సుంకం కూడా వసూలు చేస్తారు. ప్రతి రాష్ట్రం తన విధానాల ప్రకారం మద్యంపై ఎక్సైజ్ టాక్స్, వ్యాట్, ఇతర సుంకాలు విధిస్తుంది. చాలా రాష్ట్రాల్లో మద్యం ధరలో 60% నుంచి 80% వరకు కేవలం పన్నులే ఉంటాయి.
2/7

ఢిల్లీలో ఒక బాటిల్ ధరపై దాదాపు 65-70% పన్ను ఉంటుంది. కర్ణాటక, తమిళనాడులో పన్ను 70% కంటే ఎక్కువ. ఉత్తర ప్రదేశ్‌లో కూడా మద్యంపై మొత్తం పన్ను దాదాపు 60% వరకు ఉంది.
3/7

ఒక ప్రీమియం బ్రాండ్ మద్యం బాటిల్ ఫ్యాక్టరీ ధర 200 రూపాయలు అనుకోండి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ పన్నులు విధిస్తుంది.
4/7

ఒకవేళ పన్ను రేటు సగటున 70% అయితే..బాటిల్ ధర ఎలా నిర్ణయిస్తారంటే.. ఫ్యాక్టరీ ధర 200 రూపాయలు, ఎక్సైజ్ సుంకం, ఇతర పన్నులు 70% అంటే 140 రూపాయలు. ఇది కాకుండా డిస్ట్రిబ్యూటర్, రిటైల్ మార్జిన్ 60 రూపాయలు. ఫైనల్‌గా దాని ధర 400 రూపాయలు.
5/7

బాటిల్ మీద ప్రభుత్వానికి 140 రూపాయలు టాక్స్ అందుతుంది. మొత్తం ధరలో దాదాపు మూడో వంతు నుంచి సగం వరకు ప్రభుత్వానికి లాభంగా వెళుతుంది.
6/7

అదే పన్నులు లేకపోతే 400 రూపాయల బాటిల్ అసలు ధర 200 నుంచి 250 రూపాయల మధ్య ఉంటుంది. అంటే వినియోగదారుడు సగం ధరకే మద్యం కొనుగోలు చేయగలుగుతాడు.
7/7

కానీ ప్రభుత్వానికి ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మద్యం పన్ను రాష్ట్రాల ఆదాయంలో పెద్ద భాగం. వార్తల ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2022-23లో మద్యం పన్ను ద్వారా రాష్ట్రాలు దాదాపు 2.4 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాయి.
Published at : 31 Aug 2025 02:54 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















