అన్వేషించండి
Happy Birthday Alia Bhatt : ట్రోల్స్ ఎదుర్కోని స్టార్ హీరోయిన్ అయింది.. ఐదేళ్లు లివ్ ఇన్‌లో ఉండి చిన్ననాటి క్రష్‌నే పెళ్లి చేసుకుంది
Alia Bhatt Birthday : బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ ఆలియా భట్ ఈరోజు తన 31వ బర్త్‌డే జరుపుకుంటుంది. ఇంతటీ స్టార్ డమ్ వెనుక ఈ భామ స్ట్రగుల్స్ ఏంటో.. లైఫ్ స్టైల్ ఏంటో మీరు ఓ లుక్కేయండి.

హ్యాపీ బర్త్ డే ఆలియా(Images Source : Instagram/ aliaabhatt)
1/11

ఆలియా భట్ 1993లో మార్చి 15వ తేదీన యూకేలో జన్మించింది. ఈ సూపర్ క్యూటీ మహేశ్ భట్, సోని రజ్దాన్‌కు రెండో సంతానం. (Images Source : Instagram/ aliaabhatt)
2/11

ఆలియా భట్ తండ్రి అయిన మహేశ్ భట్ బాలీవుడ్లో ఓ ప్రముఖ దర్శుకుడు. తల్లి సోని కూడా హీరోయిన్గా పలు సినిమాలు చేశారు. వీరిద్దరి కుమార్తెగా ఆలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.(Images Source : Instagram/ aliaabhatt)
3/11

కరణ్ జోహార్ నిర్మించి, దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్‌తో ఆలియా బాలీవుడ్లో హీరోయిన్గా లాంఛ్ అయింది. సినిమాలో ఈ పాత్రకు తగిన న్యాయం చేసి అందరినీ ఆకట్టుకుంది.(Images Source : Instagram/ aliaabhatt)
4/11

కానీ ఈమెపై సోషల్ మీడియాలో నెపోటిజం, నెపో కిడ్స్ అంటూ తెగ ట్రోల్స్ చేసేవారు. కానీ ఆలియా ఇవేమి పట్టించుకోకుండా తన వర్క్(సినిమా)లతోనే వారికి సమాధానం ఇస్తూ వచ్చింది.(Images Source : Instagram/ aliaabhatt)
5/11

గ్లామర్ పాత్రలే కాకుండా లేడీ ఓరియేంటెడ్ పాత్రలు చేస్తూ.. తన నటనతో అందిరనీ ఆకట్టుకోవడం ఆలియాకు వెన్నతో చేసిన విద్య. గంగూభాయి కతియావాడితో సెన్సేషన్ క్రియేట్ చేసి.. జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది ఈ బ్యూటీ. (Images Source : Instagram/ aliaabhatt)
6/11

తన సినిమాలతోనే ట్రోల్స్ అన్నింటికి చెక్ పెట్టింది ఆలియా. కొన్నిసార్లు ట్రోల్స్ వల్ల కృంగిపోయినా.. వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యేది. ఏ హీరోయిన్ ఎదుర్కోనన్ని ట్రోల్స్ ఆలియా ఫేస్ చేసి.. ఈరోజు సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రాణిస్తుంది.(Images Source : Instagram/ aliaabhatt)
7/11

ఆలియా పెళ్లికి ముందు కొన్ని రిలేషన్స్‌లో ఉన్నా.. తన క్రష్ రణ్‌బీర్ కపూర్ అనే చెప్పేది. కెరీర్ ప్రారంభం నుంచి ఏ ఇంటర్వ్యూకెళ్లినా రణ్‌బీర్ కపూర్‌నే తన క్రష్ అని చెప్పేది ఆలియా.(Images Source : Instagram/ aliaabhatt)
8/11

కిల్, మ్యారీ, హూక్ అప్.. ఈ ఛాయిస్‌లలో ఎప్పుడూ మ్యారేజ్ అంటే రణ్‌బీర్ కపూర్ పేరునే చెప్పేది. బహిరంగంగానే రణ్‌బీర్‌పై ప్రేమను ఎన్నోసార్లు వ్యక్తం చేసింది.(Images Source : Instagram/ aliaabhatt)
9/11

చివరికి వీరిద్దరూ లివ్ఇన్లోకి వెళ్లాక కూడా చాలా ట్రోల్స్, నెగిటివిటీని ఫేస్ చేసింది ఆలియా. రణ్‌బీర్ రెడ్ ఫ్లాగ్ అంటూ ఎంతమంది కామెంట్స్ చేసినా.. అతనిని సపోర్ట్ చేస్తూ తన రిలేషన్‌ని కొనసాగించింది.(Images Source : Instagram/ aliaabhatt)
10/11

ఐదేళ్లు లివ్ ఇన్ రిలేషన్ తర్వాత.. 2022లో రణ్‌బీర్, ఆలియా పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ సమయంలో Today, surrounded by our family and friends, at home … in our favourite spot - the balcony we’ve spent the last 5 years of our relationship - we got married అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఈ భామ. (Images Source : Instagram/ aliaabhatt)
11/11

రణ్‌బీర్, ఆలియా ప్రేమకు గుర్తుగా వీరికి రాహా జన్మించింది. ఈ స్టార్ కిడ్కి సోషల్ మీడియాలో పేరెంట్స్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఇలా ఆలియా ట్రోల్స్‌ని భరిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. రెడ్ ఫ్లాగ్ అన్న వ్యక్తినే పెళ్లి చేసుకుని.. అందమైన కూతురికి జన్మనిచ్చి.. సంతోషమైన వెడ్డింగ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ.. ఎందరికో స్ఫూర్తినిస్తోంది ఆలియా.(Images Source : Instagram/ aliaabhatt)
Published at : 15 Mar 2024 09:32 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion