రోజా సినిమాలో నటించిన హీరోయిన్ మధుబాల గుర్తుంది కదా అచ్చం అలాగే ఉంటుంది సోనియా సింగ్. అందుకే అభిమానులంతా జూనియర్ మధుబాల అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.
సోనియా సింగ్ 1998లో మార్చి 31న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. బీటెక్ చదివింది. యోగా చేయడం, ట్రావెలింగ్, పుస్తకాలు చదవడం బాగా అలవా. అయితే చదువు పూర్తయ్యాక పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం ద్వారా తన యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించింది.
‘హే పిల్ల’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయింది. ఆ తర్వాత రౌడీ బేబీ ఛానల్ తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది. పెళ్ళైన కొత్తలో, న్యూ ఏజ్ గర్ల్ ఫ్రెండ్, నాన్ తెలుగు గర్ల్ ఫ్రెండ్, హైడ్ అండ్ సీక్, గుడ్ న్యూస్, ఓయ్ పద్మావతి, ఈ మాయ పేరేమిటో, సాఫ్ట్ వేర్ సావిత్రి వంటి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటించింది.
పవన్ సిద్ధుతో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు బాగా పాపులర్ అయ్యాయి. వీరిద్దరి జోడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మొదట్లో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చూసే వారికి మాత్రమే తెలిసిన సోనియా సింగ్.. తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిపోయింది.
‘యమలీల ఆ తరువాత’ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. బుల్లితెర మీద సత్తా చాటిన సోనియా సింగ్ రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. చలాకీతనం, సహజంగా ఉండే మాటలతో అందరినీ బాగా ఆకట్టుకుంటోంది సోనియా.
సోనియా సింగ్ (Image Credit: Sonia Singh / Instagram)
సోనియా సింగ్ (Image Credit: Sonia Singh / Instagram)
సోనియా సింగ్ (Image Credit: Sonia Singh / Instagram)
సోనియా సింగ్ (Image Credit: Sonia Singh / Instagram)
పుత్తడి రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ప్రియాంక - కొత్త ఫొటోలు చూశారా?
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
కండల వీరుడు కనిపించగానే ఫొటోల కోసం వచ్చిన ఫ్యాన్స్!
ఎయిర్ పోర్టులో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ - ఎవరో గుర్తు పట్టారా?
నీలి రంగు డ్రెస్సులో బిగ్ బాస్ స్రవంతి- సీతాకోక చిలుకలగా కనువిందు
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>