అన్వేషించండి
Simran Choudhary Atharva Movie: క్రైమ్ రిపోర్టర్‌గా సిమ్రాన్ చౌదరి, కథలో క్యారెక్టరే - అథర్వ దర్శకుడు మహేష్ రెడ్డి
Atharva movie director Mahesh Reddy Interview: సిమ్రాన్ చౌదరిని దర్శకుడు మహేష్ రెడ్డి క్రైమ్ రిపోర్టర్ చేశారు. 'అథర్వ' కోసం! డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల సందర్భంగా మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సిమ్రాన్ చౌదరి
1/6

హీరోయిన్ సిమ్రాన్ చౌదరి అందంగా ఉంటారు. ఆమెను క్రైమ్ రిపోర్టర్ చేశారు దర్శకుడు మహేష్ రెడ్డి. ఆయన తీసిన తాజా సినిమా 'అథర్వ'. ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో కార్తీక్ రాజు హీరో. ఐరా మరొక హీరోయిన్. సుభాష్ నూతలపాటి నిర్మాత. డిసెంబర్ 1న థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.
2/6

నేను ఓసారి క్లూస్ టీం హెడ్ వెంకన్న గారి ఇంటర్వ్యూ చూశా. క్రైమ్ జరిగినప్పుడు క్లూస్ టీం పని ఎక్కువ. క్రైమ్ జరిగిన చోట వాళ్ళు కలెక్ట్ చేసేవి కోర్టులో సాక్ష్యాలుగా నిలబడతాయి. కేసుల్లో 70 శాతం వరకు క్లూస్ టీం పరిష్కరిస్తుంటుంది. అలాంటి క్లూస్ టీం మీద సినిమా రాలేదని 'అథర్వ' చేశా. మర్డర్, రాబరీ నేపథ్యంలో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. వాస్తవ ఘటనలకు ఫిక్షన్ యాడ్ చేసి సహజత్వానికి దగ్గరగా తీశా - మహేష్ రెడ్డి
3/6

కార్తీక్ రాజు ఇంతకు ముందు హీరోగా చేశారు. దర్శకుడిగా నేను తప్ప హీరోయిన్లు, మిగతా ఆర్టిస్టులు సీనియర్లు. వాళ్ళ అనుభవం నాకు కలిసి వచ్చింది. అందరి సహకారంతో సినిమా చేశా. 'అథర్వ' సెకండ్ హాఫ్‌లో ప్రతీ పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే అసలు ఎవ్వరూ ఊహించరు. ఆ సీన్లు ప్రేక్షకులకు హై ఇస్తాయి. ఇందులో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి క్రైమ్ రిపోర్టర్ రోల్ చేశారు. హీరో క్లూస్ టీం మెంబర్! - మహేష్ రెడ్డి
4/6

చైతన్య రావు హీరోగా నేను 'హవా' అని షార్ట్ ఫిల్మ్ తీయాలని అనుకున్నాం. సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఓ కార్డులా ఉండాలని ప్రయోగం చేశాం. చివరకు అది సినిమాలా మారింది. దాని తర్వాత మంచి చిత్రాన్ని తీయాలనే ఇంత విరామం తీసుకున్నా. నాకు మంచి నిర్మాతలు దొరికారు. సినిమా బాగా రావాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు - మహేష్ రెడ్డి
5/6

'అథర్వ'కు శ్రీచరణ్ పాకాల సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఫుల్ ఫాంలో ఉన్నారు. మా సినిమాకు మంచి ఆర్ఆర్ ఇచ్చారు. పోలీస్ సైరన్ నుంచి కూడా ఓ మ్యూజిక్ పుట్టించారు. ఆర్ఆర్‌తో పాటు మాకు మంచి మాస్, రొమాంటిక్, ఫోక్ సాంగ్స్ కూడా ఇచ్చారు. ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. ప్రేక్షకులు థియేటర్లలో ఉత్కంఠగా చూసేలా ఉంటుంది. - మహేష్ రెడ్డి
6/6

సిమ్రాన్ చౌదరి
Published at : 28 Nov 2023 10:33 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
నిజామాబాద్
ఆరోగ్యం
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















