Womens world cup 2025: మంధానా- హర్మన్‌ప్రీత్ ల కష్టం వృథా?.. భారత్‌పై విజయంతో సెమీఫైనల్లోకి ఇంగ్లాండ్
Ind vs England | భారత్ మహిళల జట్టును ఇంగ్లాండ్ టీం ఓడించింది. వరల్డ్ కప్ లో భారత్‌కు వరుసగా మూడో ఓటమి ఇది. దాంతో సెమీఫైనల్ రేసు మరింత కష్టంగా మారింది.

Ind vs Eng Womens world cup | ఇంగ్లండ్ జట్టు భారత్ మీద 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లలో దీప్తి శర్మ వికెట్ పడిన తర్వాత మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లింది. భారత్ చివరి 3 ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి ఉండగా, టెయిలెండర్లు ఉండటంతో మ్యాచ్ చేజారింది. స్మృతి మంధానా సెంచరీ చేజార్చుకుంది. మంధాన 88 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ (70), దీప్తి శర్మ (50) పోరాడినా ఫలితం దక్కలేదు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి 288 పరుగులు చేయగా, ఇండియా 50 ఓవర్లలో 284 పరుగులకు పరిమితం కావడంతో 4 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఇది ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టుకు వరుసగా మూడో ఓటమి.
భారత సెమీఫైనల్ ఆశలు దెబ్బ తిన్నాయి
భారత జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకోవాలనుకుంటే, వారు ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలవాలి. మరోవైపు ఇంగ్లాండ్ ఈ విజయం ద్వారా సెమీఫైనల్ స్థానాన్ని మరింత పదిలం చేస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా నాలుగు స్థానాల్లో తమ స్థానాలను కన్ఫామ్ చేసుకున్నాయి. సెమీఫైనల్లో 4వ స్థానం కోసం భారతదేశం సహా ఐదు జట్లు పోటీలో ఉన్నాయి. భారత్ సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే, తమ తదుపరి రెండు మ్యాచ్‌లను గెలవాలి. ఒకవేళ టై అయిన సందర్భంలో ఇతర జట్ల కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉంటే భారత్ ఆశలు సజీవంగా ఉంటాయి.
England win by 4 runs. #TeamIndia fought hard in a closely contested match and will look to bounce back on Thursday.
— BCCI Women (@BCCIWomen) October 19, 2025
Scorecard ▶ https://t.co/jaq4eHaH5w#WomenInBlue | #CWC25 | #INDvENG pic.twitter.com/f9xKaO1ydg
మలుపు తిప్పిన దీప్తి శర్మ వికెట్
మంధాన, హర్మన్‌ప్రీత్ ప్రయత్నాలు ఫలించలేదు. జట్టు కేవలం 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ భారత ఇన్నింగ్స్‌ను నడిపించారు. వారిద్దరూ 125 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 70 పరుగులు చేసింది. ఆమె అవుటయ్యాక మంధాన, దీప్తి శర్మ 67 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించారు. దాంతో భారత్ విజయానికి చేరువైనట్లే అనిపించింది. కానీ కీలక సమయంలో దీప్తి శర్మ 47వ ఓవర్‌లో 50 పరుగుల వద్ద ఔటైంది. దాంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మళ్లింది. అమన్‌జోత్ కౌర్ బ్యాటింగ్ చేయగలదు, కానీ ఒత్తిడిలో ఆమె పరుగులు చేయలేకపోయింది. భారత్‌కు తరువాత న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే వారు 2 మ్యాచ్‌లలో కచ్చితంగా గెలవాలి.
శతకంతో అదరగొట్టిన హీథర్ నైట్
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ హీథర్ నైట్ (109; 91 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించగా.. ఓపెనర్ అమీ జోన్స్ (56), నాట్ సీవర్ బ్రంట్ (38) రాణించారు. టామీ బ్యూమాంట్ (22), షార్లెట్ డీన్ (19 నాటౌట్)గా నిలిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టింది. శ్రీ చరణి 2 వికెట్లు దక్కించుకుంది. భారత బ్యాటర్లు కొందరు బాల్స్ వృథా చేయగా.. ఇంగ్లాండ్ లో మాత్రం శతకం బాదినా వందకు మించిన స్ట్రైక్ రేట్ తో హీథర్ నైట్ అదరగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.





















