అన్వేషించండి

Ind vs aus 1st odi: తొలి వన్డే ఆస్ట్రేలియాదే.. 7 వికెట్లతో భారత్‌పై ఘన విజయం.. మార్ష్ కెప్టెన్ ఇన్నింగ్స్

India vs Australia 1st ODI | భారత్ తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. పెర్త్ లో వర్షం కారణంగా డీఎల్ఎస్ ప్రకారం 131 పరుగులు చేసి గెలుపొందింది.

Australia vs India 1st ODI | ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఓటమితో మొదలుపెట్టింది. తొలి వన్డేలో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా భారత్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ వన్డే మ్యాచ్ కు వరుణుడు పలుమార్లు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఒక్కో ఇన్నింగ్స్‌కు 26 ఓవర్లకు కుదించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. DLS పద్ధతి ప్రకారం, ఆస్ట్రేలియాకు 131 పరుగులు టార్గెట్ ఫిక్స్ చేయగా.. ఆతిథ్య జట్టు సులభంగా ఛేజ్ చేసింది. తొలి వన్డే విజయంతో 3 వన్డేల సిరీస్ లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది, మిగిలిన మ్యాచ్‌లు అక్టోబర్ 23న అడిలైడ్‌లో, అక్టోబర్ 25న సిడ్నీలో జరగనున్నాయి.

భారత టాపార్డర్ ఫెయిల్.. రాణించిన రాహుల్, అక్షర్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. పేస్ కు అనుకూలించే పెర్త్ పిచ్ మీద నిప్పులు చెరిగారు మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్, ఎల్లిస్. ఆసీస్ బౌలర్లు ఎదురుదాడికి దిగే అవకాశం ఇవ్వకుండా ప్రారంభంలోనే భారత్ టాప్ ఆర్డర్‌ను కూల్చారు. రోహిత్ శర్మ 8 పరుగులు చేసి అవుట్ కాగా, కింగ్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే  డకౌట్ అయి విలియన్ చేరాడు. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 10 పరుగులు చేయగా, మరో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 11 పరుగులకు ఔటయ్యాడు. 

పలుమార్లు వర్షం అంతరాయం.. 

వర్షం అంతరాయం కలిగించిన తొలి వన్డేలో భారత్ ఆరంభం నుంచి ఇబ్బంది పడింది. ముఖ్యంగా ఆసీస్ పేసర్లు వాతావరణం అనుకూలించడంతో అటు పేస్ తో పాటు స్వింగ్ రాబట్టి భారత బ్యాటర్లను తిప్పలుపెట్టారు. పలుమార్లు వర్షం పడటం సైతం భారత్ కు కలిసిరాలేదు. బ్యాటర్లు క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డారు. వర్షం వల్ల ఎక్కువ సమయం వృధా కావడంతో మ్యాచ్ 26 ఓవర్లకు ఇన్నింగ్స్ కుదించారు. 

కఠిన పరిస్థితుల్లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 31 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. కెఎల్ రాహుల్‌తో కలిసి 5వ వికెట్ కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అదే అత్యధిక భాగస్వామ్యం. రాహుల్ చివర్లో బౌండరీలు బాది 38 పరుగులు చేశాడు. స్కోరు పెంచే క్రమంలో ఔటయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి చివర్లో రెండు సిక్సర్లు బాదడంతో 130 పరుగులు దాటింది. 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. డక్ వర్ల్ లూయిస్ ప్రకారం ఆసీస్ కు టార్గెట్ 131కి నిర్ణయించారు. 

మిచెల్ మార్ష్ కెప్టెన్ ఇన్నింగ్స్

అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ తొందరగా అవుటైనా, మిచెల్ మార్ష్ మరో ఎండ్‌లో బౌండరీలు బాదుతూ స్ట్రైక్‌ను క్రమం తప్పకుండా రొటేట్ చేశాడు. మథ్యూ షార్ట్ 8 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. అప్పటికీ స్కోరు 44/2కి చేరింది.

 కెప్టెన్ మార్ష్.. జోష్ ఫిలిప్స్ (37) మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టారు. మ్యాట్ రెన్షా 21 పరుగులు సాయంతో కెప్టెన్ మిచెల్ మార్ష్  21.1 ఓవర్లలో ఆటను ముగించారు. ఆసీస్ ఇన్నింగ్స్ లో మార్ష్ (46 నాటౌట్) అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Rinku Singh Captain: రహానే రిటైర్మెంట్ తర్వాత  KKR కొత్త కెప్టెన్ ఎవరనే సస్పెన్స్‌కు తెర.. రేసులో ఆ స్టార్ ప్లేయ‌ర్ ముందంజ
రహానే రిటైర్మెంట్ తర్వాత  KKR కొత్త కెప్టెన్ ఎవరనే సస్పెన్స్‌కు తెర.. రేసులో ఆ స్టార్ ప్లేయ‌ర్ ముందంజ, విదేశీ ప్లేయ‌ర్ పైనా న‌జ‌ర్..
Mohammed Siraj Omission:  సిరాజ్ ను త‌ప్పించ‌డంలో జట్టు మేనేజ్‌మెంట్ తీరుపై అశ్విన్, మురళీ కార్తీక్ అస‌హ‌నం, ఎంపిక చేయనప్పుడు స్క్వాడ్ లోకి ఎందుకు తీసుకెళ్లారని ఆవేదన
సిరాజ్ ను త‌ప్పించ‌డంలో జట్టు మేనేజ్‌మెంట్ తీరుపై అశ్విన్, మురళీ కార్తీక్ అస‌హ‌నం, ఎంపిక చేయనప్పుడు స్క్వాడ్ లోకి ఎందుకు తీసుకెళ్లారని ఆవేదన
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Akash Deep Record: కివీస్ గడ్డపై జహీర్ సరసన చేరిన ఆకాశ్ దీప్.. 5 వికెట్లతో అరుదైన ఘనత, కోహ్లీ చెత్త రికార్డును దాటేసిన జైస్వాల్
కివీస్ గడ్డపై జహీర్ సరసన చేరిన ఆకాశ్ దీప్.. 5 వికెట్లతో అరుదైన ఘనత, కోహ్లీ చెత్త రికార్డును దాటేసిన జైస్వాల్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget