Smriti Mandhana Marriage: ఇండోర్ కోడలు కాబోతున్న స్మృతి మంధానా.. వరుడు కూడా సెలబ్రిటీనే, ఎవరంటే
Smriti Mandhana Boy Friend | ఎంతో మంది క్రికెటర్లు బాలీవుడ్ నటీనటులను పెళ్లి చేసుకున్నారు. ఈసారి క్రికెట్ నుండి వధువు, బాలీవుడ్ నుండి వరుడు.

Smriti Mandhana Wedding | భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ప్రస్తుతం ఇండోర్‌లో ఉన్నారు. ఇక్కడ భారత్ ఈరోజు ఇంగ్లాండ్‌తో (IND W vs ENG W) ప్రపంచ కప్ లో కీలకమైన మ్యాచ్ ఆడనుంది. ఈ సమయంలో మంధానకు సంబంధించి ఓ ముఖ్యమైన వార్త బయటకు వచ్చింది. ఆమె ఇండోర్ కోడలు కాబోతోంది. ఈ విషయాన్ని మంధానను వివాహం చేసుకునే వ్యక్తి ధృవీకరించారు.
బాలీవుడ్, క్రికెట్‌కు లింకేంటి..
ఎంతో మంది క్రికెటర్లు బాలీవుడ్ నటీనటులను, ఇతర ప్లేయర్లను వివాహం చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ వంటి ప్రముఖులు బాలీవుడ్ నటీమణులను వివాహం చేసుకున్నారు. ఈసారి వధువు స్పోర్ట్స్ ఉమెన్ కాగా, వరుడు బాలీవుడ్ కు చెందిన వ్యక్తి కావడంతో విషయం వైరల్ అవుతోంది. సినీ నిర్మాత, సింగర్ అయిన పలాష్ ముచ్చల్ (Palash Muchhal) స్మృతీ మంధానతో తన రిలేషన్ వెల్లడిస్తూ పెద్ద ప్రకటన చేశారు. దాంతో త్వరలో వీరిద్దరి వివాహం జరగనుందని వార్త హాట్ టాపిక్ అవుతోంది.
పలాష్ ముచ్చల్‌తో స్మృతి మంధాన (Smriti Mandhana) రిలేషన్ గురించి ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. అయితే వారి బంధం గురించి మొదటిసారిగా విషయం వెల్లడైంది. ఊహాగానాలకు తెరదించుతూ తాను మంధానను వివాహం చేసుకోబోతున్నట్లు పలాష్ ముచ్చల్ అధికారికంగా తెలిపాడు. డిష్కియాన్, భూత్నాథ్ రిటర్న్స్ వంటి చిత్రాలకు సంగీతం అందించిన 30 ఏళ్ల పలాష్, స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన 2019 నుండి డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
View this post on Instagram
తమ రిలేషన్ బహిర్గతం చేసిన పలాష్
మీడియా నివేదికల ప్రకారం.. పలాష్ ముచ్చల్ స్టార్ క్రికెటర్ మంధానతో తన ప్రేమ విషయాన్ని ధృవీకరించారు. క్రికెటర్ స్మృతి మంధాన త్వరలో ఇండోర్ కోడలు కాబోతోందని స్పష్టం చేశారు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత జట్టు ICC మహిళల ODI ప్రపంచ కప్ 2025లో 5వ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లాండ్‌తో ఈ మ్యాచ్ కోసం మంధాన సైతం భారత జట్టుతో పాటు ఇండోర్‌లో ఉన్నారు.
మొదటి రెండు మ్యాచ్‌లలో శ్రీలంక, పాకిస్తాన్‌లను ఓడించిన తర్వాత.. భారత జట్టు ప్రపంచ కప్‌లో వరుసగా 2 మ్యాచ్‌లు ఓడిపోయింది. దక్షిణాఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓటమిచెందింది. దాంతో నేడు ఇంగ్లాండ్ తో జరగనున్న మ్యాచ్ తప్పనిసరిగా నెగ్గాలని భారత్ భావిస్తోంది.





















