Ending the ORS Misuse Scam: ఆమె ఒక సైన్యం...! ఎనర్జీ డ్రింకులపై ORS ట్యాగ్ తీసేయించడం కోసం డాక్టర్ శివరంజనీ 8 ఏళ్ల పోరాటం..!
ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్డ్ అథారటీ ఆఫ్ ఇండియా FSSAI, ఇక నుంచి ORS పేరుతో బ్రాండింగ్ చేయడానికి వీల్లేదని ఆదేశాలిచ్చింది. దీని వెనుక హైదరాబాద్‌కు చెందిన వైద్యురాలు శివరంజని సంతోష్ ఎనిమిదేళ్ల పోరాటం ఉంది.

Hyderabad Doctor’s 8-Year Battle on Fake ORS Drinks: పట్టువదలని విక్రమార్కుడి కథలు మనం చిన్నప్పుడు చదువుకిని ఉంటాం.. కానీ హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు శివరంజని సంతోష్ చేసిన పోరాటం.. దేశ ఆరోగ్య విభాగాన్ని కదిలించింది. సమాజపు ఆరోగ్య పరిరక్షణ కోసం, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం కోసం గళం వినిపించిన ఆమె ప్రయత్నాలు ఫలాన్నిచ్చాయి. ఆమె సాధించిన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఫుడ్ సేఫ్టీ కమిషనర్లు మరియు లైసెన్స్ అధికారి్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది: "ఇకపై ఎలాంటి ఫుడ్ ప్రాడక్ట్స్‌పై “ORS” అనే పదాన్ని వాడకూడదని నిర్దేశించింది. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన శివరంజని 8ఏళ్లపాటు పోరాటం చేశారు. ఆమె పోరాటం ఫలించి FSSAI ఆదేశాలు జారీ చేసింది.
మేం గెలిచాం... ఆదేశాలు వచ్చాక డాక్టర్ శివరంజనీ భావోద్వేగం
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ ప్రాంతంలో చిన్నపిల్లల క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ శివరంజని... ORS లేబుల్‌తో టెట్రా ప్యాక్‌లలో విక్రయిస్తున్న ఎనర్జీ డ్రింకులు ఆరోగ్యానికి హానికరం అని గుర్తించారు. వాటి విక్రయాలు ఆపేయాలని... లేదా ORS పేరు తీసేయాలని ఆమె డిమాండ్ చేస్తూ..వచ్చారు. దీనిపై 8ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేశారు. ఎట్టకేలకు అక్టోబర్ 14న FSSAI అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే డాక్టర్ శివరంజనీ భావోద్వేగానికి గురయ్యారు. 8 ఏళ్లపాటు తాము ఎంత పోరాటం చేసిందీ తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. “ఇది నాకు చాలా పెద్ద రిలీఫ్‌గా ఉంది. ఇన్నేళ్ళుగా ప్రైవేటు కంపెనీలు ORS పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయి. అసలు ORS అనేది ప్రాణాలు కాపాడే ఔషధం. దీన్ని తప్పుడు లేబులింగ్, వక్రీకృత మార్కెటింగ్ ద్వారా సంప్రదించి, అసలు దీన్ని తీసుకుంటే – ముఖ్యంగా పిల్లలకు, పెద్దలకు డయేరియా మరింత ముదిరేలా చేస్తుంది. ఈ అవినీతి మీద పోరాటం ఇప్పుడు ఫలితాన్నిచ్చింద"న్నారు.
View this post on Instagram
అధిక చక్కెరవున్న డ్రింక్స్ ను ORS అనే పేరు ద్వారా ప్రజలకు అమ్మడమే కాకుండా, ఔషధాలుగా ప్రచారం చేశారు. “ఒకవైపు మన దేశంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో 13% మరణాలకు డయేరియా కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ORS పేరుతో పిల్లలకు తప్పు సమాచారం ఇచ్చిన వారిని ఎలా క్షమించగలం?” అని డా. శివరంజని ప్రశ్నించారు.
ORS అంటే ఏమిటంటే..?
ప్రపంచవ్యాప్తంగా ORS అనేది చికిత్స కోసం ఉపయోగించే ప్రత్యేకమైన ఫార్ములా. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూనిసెఫ్ (UNICEF) చేసిన ఫార్ములా ప్రకారం లీటర్‌కు 2.6 గ్రాములు సోడియం క్లొరైడ్, 1.5 గ్రాముల పొటాషియం క్లొరైడ్, 2.9 గ్రాముల సోడియం సిట్రేట్, 13.5 గ్రాముల డెక్స్ట్రోస్ ఉండాలి. ఇది డయేరియా వంటి పరిస్థితులలో భద్రతగా శరీరాన్ని రక్షించడానికి, ఒత్తిడిని తగ్గించడానికే కేటాయించారు. శరీరం నీరసించిపోయినప్పుడు.. లవణాలను ఎక్కువుగా కోల్పోయినప్పుడు వైద్యులు దీనిని సిఫారసు చేస్తారు.
మార్కెట్‌లో ORS పేరుతో మోసాలు
కానీ ఇదే పేరుతో మార్కెట్‌లో చాలా ఎనర్జీ డ్రింకులు వచ్చేశాయి. ORS' పేరుతో ఎనర్జీ డ్రింక్స్, ఇతర తేనె/ఫ్రూట్ బేస్డ్ డ్రింక్స్ అమ్ముతున్నారనే విషయం డాక్టర్ శివరంజని గమనించారు. ఈ డ్రింక్‌లలో చక్కెర అధికంగా ఉండడం, అసలు ORSకు అవసరమైన సంతులిత లవణాలు ఉన్నదీ లేదో తెలియదు. కొన్ని ప్యాకెట్ల లీటర్‌కు 120 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర! అలాంటి డ్రింక్‌లు అసలు డీహైడ్రేషన్ ఉన్న చిన్నారులకు మరింత ప్రమాదకరం.
పోరాటానికి దిగిన శివరంజని
ప్రమాదకరమైన చెక్కర పానీయాలన్ని ORS పేరుతో అమ్మకాలు చేయడంపై నేరుగా పోరటానికి దిగారు శివరంజని..!మొదట్లో ఆమె Instagram, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ మోసాన్ని తేల్చుకునే ప్రయత్నం చేశారు. అందరినీ హెచ్చరించారు, “మీరు పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టవద్దు.” యధేచ్ఛగా కంపెనీలు ORS అని ప్రచారం చేసే ఉత్పత్తులను నిలిపేయాలని కోరారు. రెగ్యులేటరీ ఆధికారి CDSCO (Central Drugs Standard Control Organisation) దగ్గర స్పందన రాలేదు. చివరకు FSSAI ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నించారు. అక్కడ కూడా అనుకున్నంత స్పందన లేదు. 2022లో తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. మొదట కోర్టు ఆమెతోఏకీభవించింది. 2022 ఏప్రిల్‌లో ఫేక్ ఎనర్జీ డ్రింక్స్‌పై ORS ట్యాగ్ వేయడాన్ని FSSAI నిషేధించింది. కానీ, కొన్ని నెలలకే FSSAI వెనకడుగు వేసింది. ‘ఈ డ్రింక్ WHO ప్రమాణాలకు అనుగునమైన ORS కాదు’ అనే డిస్క్లెయిమర్‌తో ORS బ్రాండ్‌ను తిరిగి అనుమతించింది.
ఫార్మా జెయింట్స్ ఏదో ఒక రూపంలో తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న శివరంజనీ పోరాటాన్ని మరింత తీవ్రం చేశారు. ఈసారి కేంద్ర ఆరోగ్యశాఖ, FSSAI, ORS బ్రాండ్ ఎనర్జీ డ్రింకులు తయారు చేస్తున్న సంస్థలను పార్టీలను చేస్తూ మరో PIL వేశారు. ఆమె ఫోరాటం ఫలించి అక్టోబర్ 14న FSSAI తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై WHO ప్రమాణాలకు లోబడి లేనటువంటి ఒక్క ఉత్పత్తి కూడా ORS ట్యాగ్ వాడరాదు. పేరు, ట్రేడ్‌మార్క్, బ్రాండ్లలో ఉపయోగించినా నిబంధనలకు విరుద్ధమే. అని ఆదేశాలిచ్చింది.

ఇప్పటిదాకా చేపట్టిన డాక్టర్ శివరంజని పోరాటం ద్వారా దేశవ్యాప్తంగా వేల కొలదిగా చిన్నారులకు, వారికి పట్టిన తల్లిదండ్రులకు అండగా నిలిచారు. ఒక్క మహిళ నిరల్లాడిన దీర్ఘకాల పోరాటం భారత ఆరోగ్య రంగాన్ని మారుస్తూ, అందరికీ స్పూర్తిగా నిలిచింది.డాక్టర్ శివరంజని పోరాటం, ఫార్మా కంపెనీలను ఎదుర్కొని ఆమె చూపించిన తెగువ.. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో చారిత్రక స్థానం సంపాదించాయి. ముఖ్యంగా సరైన అవగాహన లేక.. మెడికల్ షాపుల్లో అమ్ముతున్న అధిక చెక్కర కలిగిన ఎనర్జీ డ్రింకులను కొనుగోలు చేస్తూ.. పిల్లల ఆరోగ్యాన్ని చేతులారా చెడగొడుతున్న తల్లిదండ్రులు ఈ నిర్ణయం ద్వారా ఎంతో మేలు పొందుతారు.





















