అన్వేషించండి

EPFO New Rules: వివాహం, ఇంటి కోసం పీఎఫ్ నగదు విత్‌డ్రా చేయాలా? ఈ కొత్త రూల్ మీకు తెలుసా

PF Amount Withdrawal Rules | పిఎఫ్ విత్‌డ్రా నిబంధనలు మారాయి. పెళ్లి లేదా కొత్త ఇల్లు కోసం డబ్బులు తీసుకోవాలనుకుంటే గతంలోలాగ 2 నెలల్లో విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు.

PF  Withdrawal Rules: దేశంలో కోట్లాది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund PF) ఖాతా ఉంటుంది. ప్రతి నెలా జీతంలో కొంత భాగం ఈ పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. తద్వారా అవసరమైనప్పుడు మీరు ఆ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఉద్యోగం మానేసిన నెల, రెండు నెలల తరువాత చాలా మంది తమ PF ఖాతా నుండి డబ్బులు విత్‌డ్రా చేసుకునేవారు. ఇంట్లో పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం, ఇల్లు కొనుగోలు, చదువులు లేదా ఏదైనా అత్యవసర ఖర్చుల కోసం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఇలా చేసేవారు.

కానీ ఇప్పుడు ఉద్యోగులు కొంచెం కాలమే వేచి ఉండాలి. ప్రభుత్వం, EPFO ​​ద్వారా PF నగదు ఉపసంహరణ నిబంధనలలో మార్పులు చేశారు. ఈ మార్పు భవిష్య నిధిని అత్యవసర నిధిగా ఉపయోగించే లక్షలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. కనుక పీఎఫ్ కొత్త రూల్స్ తెలుసుకోండి. 

ముందుగానే PF డబ్బును ఇలా తీసుకోవచ్చు 

గతంలో నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాదారుడు ఉద్యోగం మానేస్తే, 2 నెలల తర్వాత తన PF ఖాతా నుండి మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగంలో చేరని వారికి ఈ రూల్ వర్తిస్తుంది. చాలా మంది ఈ డబ్బును పెళ్లి కోసం, ఇల్లు కట్టుకోవడం లేదా అప్పులు తీర్చడం, పిల్లల చదువులు వంటి వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించేవారు. 

EPFO ​​అటువంటి సందర్భాలలో కొన్ని షరతులతో ముందస్తు ఉపసంహరణకు అనుమతించింది. అంటే ఉద్యోగి ఉద్యోగం మానేసిన 60 రోజుల తర్వాత తన PF బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా చేయవచ్చు. సాధారణంగా ఒక వారంలో నగదు మీ ఖాతాలో జమ అవుతుంది.

కొత్త నిబంధనల్లో మార్పు ఏమిటి?

కొత్త PF ఖాతాల నిబంధనల ప్రకారం.. పీఎఫ్ ఖాతాదారులు ఎవరైనా ఉద్యోగం మానేసిన తర్వాత పెళ్లి, ఇల్లు కట్టుకోవడం లేదా ఏదైనా వ్యక్తిగత అవసరాల కోసం ఒక ఏడాది తర్వాత మాత్రమే PF ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోగలరు. అంటే గతంలోలాగ ఇప్పుడు మీరు కేవలం 2 నెలలు కాదు, 12 నెలలు నగదు కోసం వేచి ఉండాలి. ఈ నిర్ణయం పీఎఫ్ ఖాతాదారులను భవిష్యత్తు కోసం పొదుపు చేసే అలవాటును పెంచుతుందని, అత్యవసర భవిష్యత్ నిధిని సరైన ప్రయోజనం కోసం ఉపయోగించడంలో సహాయపడుతుందని EPFO ​​భావిస్తోంది. 

Also Read: Women Savings Schemes: మహిళల కోసం బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే! సేఫ్, అధిక వడ్డీ అందించే పథకాలు

అత్యవసర వైద్య అవసరం లేదా శాశ్వత వైకల్యం వంటి సందర్భాల్లో గతంలోలాగే తక్షణ విత్‌డ్రా సౌకర్యం కొనసాగుతుంది. ఈ మార్పు  ఉద్దేశ్యం ఏమిటంటే PF ఖాతాను ఉద్యోగులకు దీర్ఘకాలిక భద్రతగా ఉంచడం. తద్వారా పీఎఫ్ ఖాతాదారులు పదవీ విరమణ సమయంలో తగినంత మొత్తాన్ని పొందడానికి వీలుంటుందని కేంద్ర కార్మిక శాఖ, ఈపీఎఫ్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Advertisement

వీడియోలు

సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..
ఆ ఒక్క క్యాచ్ వదలకుండా ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది
సఫారీలతో రెండో వన్డేలో భారత్ ఘోర ఓటమి
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Telangana Police website hacked :  తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
Pushpa 2 Japan Release : 'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Embed widget