PDS Rice Testing Kits: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీడీఎస్ బియ్యం కనిపెట్టేలా మొబైల్ టెస్టింగ్ కిట్స్
Andhra Pradesh News | ఏపీలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయనున్నారు. రేషన్ బియ్యంలో కలిపే ఫోర్టిఫైడ్ రైస్ ద్వారా పీడీఎస్ బియ్యం గుర్తించే మొబైల్ కిట్లును అందుబాటులోకి తెచ్చింది..

కాకినాడ: పీడీఎస్ బియ్యం మాఫియా అనగానే కాకినాడ పేరు ఠక్కున గుర్తుకు వస్తుంది.. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై అంతటిస్థాయి వివాదం కాకినాడ చుట్టూ ముసురుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ పద్దతిలో సేకరించిన పేదల బియ్యాన్ని చివరకు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించి అక్రమ సొమ్మును ఆర్జీస్తున్నారన్న ఆరోపణలపై ఎన్నికలకు ముందు నుంచి పెద్ద దుమారమే రేగింది.. ఈనేపథ్యంలోనే ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పీడీఎస్ బియ్యం మాఫియా అంతుచూస్తామని కూడా వాగ్ధానాలు చేశారు... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే ఆదిశగా చర్యలు ప్రారంభించారు..
కూటమి ప్రభుత్వంలోనూ మారని తీరు...
కూటమి ప్రభుత్వం వచ్చాక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటకు వచ్చి నేరుగా పోర్టుకు వెళ్లారు.. అక్కడ అక్రమంగా ఎగుమతి అవుతున్న పీడీఎస్ బియ్యం ను టన్నుల కొద్దీ గుర్తించి సీజ్ చేయించారు.. ఆతరువాత ఏపీ సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ కూడా మరో రెండు సార్లు కాకినాడ పోర్టులో విస్తృతంగా తనిఖీలుచేసి టన్నుల కొద్దీ పీడీఎస్ బియ్యం సీజ్ చేయించారు.. కానీ చాలా వరకు అవి పీడీఎస్ బియ్యం అని నిరూపించలేని పరస్థితి తెలెత్తింది.. ఇదిలా ఉంటే కాకానాడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ను అడ్డుకునేందుకు ప్రత్యేక విధివిధానాలు రూపొందించినప్పటికీ అవికూడా అనుకున్న
స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయాయి.. కానీ యధారాజా తథా ప్రజా అన్న చందంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అనే నియంత్రణ కాలేని పరిస్థితి కనిపిస్తోంది..
తాజా నిర్ణయంతో పీడీఎస్ బియ్యం ఇట్టే కనిపెట్టే అవకాశం..
గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా జరిగిన రేషన్ బియ్యం అక్రమ రవాణా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా నియంత్రణ కాలేని పరిస్తితి కనిపిస్తోంది.. రేషన్ మాఫియాలో చాలా మంది పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి..ముఖ్యంగా తీర ప్రాంతాల్లో రేషన్ మాఫియా రెచ్చిపోతుందని, దీనికి అడ్డుకట్ట వేయాలంటే చాలా ఇబ్బందులు తప్పడం లేదని అధికారులు సైతం చేతులెత్తేసిన పరిస్తితి కనిపించింది.. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి రేషన్ మాఫియాని కట్టడి చేసేందుకు మంచి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నట్లయ్యింది.. రేషన్ బియ్యం పట్టుకున్నా, అవి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం అని అనుమానాలున్నా పీడీఎస్ బియ్యం అని రూడీ చేయడానికి టెస్ట్ చేయడానికి ల్యాబ్ కి పంపి వారం రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. తాజాగా ప్రభుత్వం ఒక మొబైల్ కిట్‌ను రూపకల్పన చేయించి పంపిణీకు సిద్ధం చేసింది.
మొబైల్ కిట్ లో ఉండే కెమికల్ బాటిల్స్ రేషన్ బియ్యం లో వేసినప్పుడు పోషక విలువల కోసం రేషన్ బియ్యంలో కలుపుతున్న పోర్టిఫైడ్ రైస్ ఎరుపు రంగులోకి మారతాయి. వెంటనే అది అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం అని అర్ధం క్లియర్‌కట్‌గా అర్ధం అవుతుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 700 కిట్లు, 33 మంది అదనపు సిబ్బందిని విశాఖపట్నం లో 3 చెక్ పోస్ట్ ల దగ్గర నియమించారు. అలాగే కాకినాడ లో కూడా సుమారు 700 కిట్లు అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది.. దీంతో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను చాలా సులభంగా గుర్తించి కట్టడి చేయడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.
ఫోర్టిఫైడ్ బియ్యం ఎందుకంటే...
పీడీఎస్ బియ్యంలో పోషక విలువలు పెంచేవిధంగా ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ బియ్యం కలపడం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రక్తహీనత, పోషకాహార లోపం సమస్యలను తగ్గించేందుకు ఈ ప్రక్రియను ప్రారంభించింది. వీటివల్ల ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 లాంటిముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.. ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రతీ క్వింటాల్ సాధారణ బియ్యానికి ఒక కిలో ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ కలుపుతున్నారు. 100 కిలోల బియ్యంలో అంటే ఒక శాతం వంతు ఫోర్టిఫైడ్ బియ్యం ఉంటుంది.. ఇప్పడు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విషయంలో పట్టించేందుకు ఈ ఫోర్టిఫైడ్ రైస్ ఉపయోగ పడుతున్నాయి..





















