అన్ని శాఖల అధికారులు వారిపై ఆధారపడటం, ఒకే సమయంలో వివిధ శాఖలకు సంబంధించిన పనులు చేయాల్సి రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతోంది.
Andhra Pradesh Village and Ward Secretariat Staff: సచివాలయ సిబ్బంది బిగ్ రిలీఫ్- కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం బిగ్ రిలీఫ్ లభించింది. పని ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రభుత్వం జాబ్‌చార్ట్‌ను విడుదల చేసింది.

Andhra Pradesh Village and Ward Secretariat Staff: ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయిలో ప్రజలకు 24 అందుబాటులో ఉండే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు వారికి పనులు చెబుతున్నారు. ఇది ఒత్తిడి పెంచుతోంది. దీని నుంచి వారిని బయటపడేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏఏ పనులు చేయాలనే విషయాలపై క్లారిటీ ఇస్తూ జాబ్ చార్ట్‌ను విడుదల చేసింది. అంతకు మించి పనులు ఇస్తే వాటిని రద్దు చేయొద్దని కూడా పేర్కొంది.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారి వద్ద ఆ ప్రాంత డేటా ఉంటుందన్న కారణంతో అన్ని శాఖల అధికారులు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై ఆధారపడుతున్నారు. దీంతో వారు ఒకే సమయంలో వివిధ శాఖల పనులు చేయాల్సి వస్తోంది. ఇది వారిని మానసికంగా కుంగదీయడమే కాకుండా పనిలో నాణ్యత కూడా తగ్గిపోతోంది. అందుకే దీన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి పనులు గురించి వివరించే జాబ్ చార్ట్‌ను విడుదల చేసింది. ప్రభుత్వం సూచించినట్టుగానే పనులు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఒత్తిడి లేకుండా విధులు నిర్వర్తించేందుకు చర్యలు...
ఉన్నతాధికారులు ఇస్తున్న టాస్క్‌ల వల్ల పని ఒత్తిడి పెరుగుతోందని గ్రామ, వార్డు సచివాలయ సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇది వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, అదే టైంలో పనులు కూడా సరైన సమయంలో పూర్తి కావడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆలోచించిన ప్రభుత్వం వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నం చేసింది. అసలు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఫాలో కావాల్సిన విధి విధానాలతో జాబ్ చార్ట్ విడుదల చేసింది. దీనికి విరుద్ధంగా చెప్పిన ఆదేశాలు రద్దు అవుతాయని పేర్కొంది.
ప్రభుత్వం జారీ చేసిన విధి విధానాలకు వ్యతిరేకంగా ఒకేసారి ఎక్కువ పనులు ఉంటే వారు ఉన్నతాధికారులతో చర్చించాలి. గ్రామ, వార్డు సచివాలయ అధికారి, జిల్లా అధికారులతో చర్చించి సమస్యను వివరించాలి. అప్పుడు కలెక్టర్‌తో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించాలి. ఏ పని ముందు చేయాలనే విషయంపై వాళ్లు క్లారిటీ ఇస్తారని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ చార్టు ఇదే
ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ చార్ట్‌లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది గ్రామ, వార్డు స్థాయి అభివృద్ధి పనుల్లో భాగమవ్వాలి. ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు అయ్యేలా, అర్హులకు చేరేలా చూడాలి. వాటిని ఇంటి వద్దే వారికి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశించినప్పుడు తమ పరిధిలోని పౌరుల సమాచారాన్ని సేకరించాలి. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వానికి నివేదించాలి. విపత్తుల టైంలో ప్రజలకు అవసరమైన సేవలు అందించాలి. ప్రభుత్వం ఆదేశించిన ప్రతి పనిలో భాగమవ్వాలి. ప్రభుత్వం చేపట్టే పరీక్షలకు హాజరై అర్హత సాధించాలి. ఈ జాబ్ చార్ట్ అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. వారి లేని సమయంలో సంబంధించి నియామక అధికారులకు ఇచ్చారు. దీన్ని పాటించని వారిపై చర్యలు తీసుకునే బాధ్యతను కూడా వారికే ఇచ్చారు.
Frequently Asked Questions
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై పని ఒత్తిడికి కారణమేమిటి?
పని ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది?
ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేయాల్సిన పనులపై స్పష్టత ఇస్తూ జాబ్ చార్ట్‌ను విడుదల చేసింది. అంతకు మించి పనులు ఇస్తే వాటిని రద్దు చేయాలని ఆదేశించింది.
జాబ్ చార్ట్‌కు విరుద్ధంగా పనులు చెబితే ఏం చేయాలి?
జాబ్ చార్ట్‌కు విరుద్ధంగా పనులు చెబితే ఉన్నతాధికారులతో చర్చించి, సమస్యను వివరించి, కలెక్టర్‌తో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించుకోవాలి.
జాబ్ చార్ట్‌లో ఏ పనులు పేర్కొన్నారు?
గ్రామ, వార్డు స్థాయి అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, అర్హులకు అందేలా చూడటం, సమాచార సేకరణ, ఫిర్యాదుల పరిష్కారం, విపత్తుల సమయంలో సేవలు అందించడం వంటివి పేర్కొన్నారు.





















