అన్వేషించండి
Huma Qureshi: హ్యూమా... నీకు 37 ఏళ్లు వచ్చాయంటే నమ్మగలమా?
Huma Qureshi At Sonakshi Sinha Wedding: సోనాక్షి సిన్హా బాలీవుడ్ ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్‌లో అందాల భామ హ్యూమా ఖురేషి ఒకరు. స్నేహితురాలి పెళ్లిలో ఆమె ఇలా సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి.
సోనాక్షి సిన్హా పెళ్లిలో హ్యూమా ఖురేషి సందడి... ఫోటోలు అస్సలు మిస్ అవ్వకండి
1/6

Huma Qureshi Photos New: హ్యూమా ఖురేషికి 37 ఏళ్ళు వచ్చాయంటే ఎవరైనా నమ్మగలరా? ఇప్పటికీ, ఎప్పటికీ తరగని అందం తన సొంతం అన్నట్టు ఉంటుంది. లేటెస్టుగా భువి నుంచి దివికి దిగివచ్చిన దేవకన్యలా ఆవిడ ఎలా మెరిసిపోయిందో చూడండి.
2/6

హిందీ సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లలో సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి మంచి స్నేహితులు. వాళ్లిద్దరూ కలిసి 'డబుల్ ఎక్స్ఎల్' సినిమాలో నటించారు. ఈ ఆదివారం రాత్రి సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లిలో హ్యూమా ఇలా సందడి చేశారు.
3/6

సోనాక్షి సిన్హా ప్రేమ కథ తెలిసిన బాలీవుడ్ సెలబ్రిటీలలో హ్యూమా ఖురేషి ఒకరు అని చెప్పాలేమో! 'డబుల్ ఎక్స్ఎల్' సినిమాలో జహీర్ ఇక్బాల్ కూడా యాక్ట్ చేశారు. ఆ సినిమా 2022లో రిలీజ్ అయ్యింది. అప్పటికి జహీర్, సోనాక్షి ప్రేమలో ఉన్నారు.
4/6

హ్యూమా ఖురేషి తెలుగు సినిమాలు చేయలేదు. కానీ, తమిళ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా', అజిత్ 'వలిమై' సినిమాల్లో ఆవిడ నటించారు. ఆ రెండూ తెలుగులో డబ్ అయ్యాయి.
5/6

తెల్లటి దుస్తుల్లో హ్యూమా ఖురేషిని చూస్తే... పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనబడుతోందని కొందరు ముంబై జనాలు కామెంట్ చేస్తున్నారు. మీరేమంటారు?
6/6

సోనాక్షి సిన్హా పెళ్లిలో హ్యూమా ఖురేషి ఫోటోలతో పాటు మరిన్ని గ్యాలరీల కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి.
Published at : 23 Jun 2024 11:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
కర్నూలు
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















