అన్వేషించండి
Photos: తిరుపతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. స్వాగతం పలికిన సీఎం జగన్

కేంద్ర హోమంత్రి అమిత్ షాకు స్వాగతం పలికిన సీఎం జగన్
1/8

ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
2/8

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు.
3/8

రోడ్డు మార్గం గుండా కేంద్ర హోంమంత్రి, సీఎం జగన్ తిరుమలకు చేరుకున్నారు.
4/8

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
5/8

స్వామి వారి దర్శనం అనంతరం తాజ్ హోటల్‌లో బస చేసి ఆదివారం మధ్యాహ్నం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు.
6/8

ఆదివారం ఉదయం నెల్లూరులోని స్థానిక కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి అమిత్ షా పాల్గొననున్నారు.
7/8

సదరన్ జోనల్ సమావేశంలో రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు.
8/8

ఈ సమావేశంలో పాల్గొనే రాష్టాలకు సంబంధించిన 48 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం మరింత పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి సూచనలు చేయనున్నారు.
Published at : 13 Nov 2021 09:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion