By: Ram Manohar | Updated at : 30 Apr 2023 01:08 PM (IST)
తమ నిరసనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రెజ్లర్లు అసహనం వ్యక్తం చేశారు.
Wrestlers Protest:
అవన్నీ అవాస్తవం..
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేపడుతున్న రెజ్లర్లు తమ నిరసనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కావాలనే కొందరు ఉద్దేశపూర్వకంగా దీన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నేషనల్స్ ఆడడానికి తాము ఆసక్తి చూపడం లేదన్న ఆరోపణల్నీ ఖండించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని, కేవలం లైంగిక వేధింపులపై మాత్రమే తాము పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు.
"కొందరు కావాలనే మా నిరసనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లు చేసే ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేం న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. మహిళల కోసం పోరాడుతున్నాం. కానీ కొందరు మా ఆందోళనల ఉద్దేశాన్నే మార్చేస్తున్నారు. ఇక్కడ నిరసన వ్యక్తం చేసే ప్రతి ఒక్కరూ మహిళలకు న్యాయం జరగాలని చూసే వాళ్లే. ఇక్కడ ఎలాంటి రాజకీయాలు జరగడం లేదు. మహిళలే ముందు...ఆ తరవాతే రాజకీయాలు"
- బజ్‌రంగ్ పునియా, రెజ్లర్
ఆ తరవాత వినేష్ ఫోగట్ కూడా ఆరోపణలపై స్పందించారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
"నేషనల్స్ ఆడడం లేదంటూ మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నేషనల్ కాంపిటీషన్‌లో మార్పులు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. మా నిరసనను అడ్డుకునేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ సమస్య నేషనల్స్ గురించి కాదు. లైంగిక వేధింపుల గురించి. మీపై ఆరోపణలు వస్తున్నప్పుడు తప్పకుండా స్పందించాలి"
- వినేష్ ఫోగట్, రెజ్లర్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు FIRలు నమోదు చేశారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేశారు. దీనిపై బ్రిజ్ భూషణ్ స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగానే ఉన్నానని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టుపైన తనకు గౌరవం ఉందన్న ఆయన...న్యాయస్థానం ఎలాంటి తీర్పునిచ్చినా స్వీకరిస్తానని అన్నారు. రెజ్లర్‌లు రోజుకో డిమాండ్ చేస్తున్నారని మండి పడ్డారు.
"నాకు ఆ ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇన్నోసెంట్‌ని. ఎలాంటి విచారణకైనా సిద్ధమే. దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తాను. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తాను. రెజ్లర్‌లు రోజుకో డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. ముందు నాపై FIR నమోదు చేయాలని అన్నారు. అది అయిపోయింది. ఇప్పుడు నన్ను జైలుకి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని పదవుల నుంచి రిజైన్ చేయాలని అంటున్నారు. నేనో ఎంపీని. ఈ పదవి నాకు ప్రజలే ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన హోదా ఇది. వినేష్ ఫోగట్ వల్ల వచ్చిన పదవి కాదిది. కేవలం ఓ కుటుంబం మాత్రమే ఈ నిరసనలు చేస్తోంది. మిగతా ప్లేయర్స్ అంతా నాకు మద్దతుగా ఉన్నారు"
- బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, WFI చీఫ్
Also Read: ప్రధాని మోదీకి రేడియా అంటే ఎంతిష్టమో, వైరల్ అవుతున్న పాత ఫొటో - వయసెంతో చెప్పగలరా?
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు
ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్
Stocks Watch Today, 29 May 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్లో ఉండే 'కీ స్టాక్స్' Aurobindo Pharma, Adani Transmission
Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు
కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్