(Source: ECI/ABP News/ABP Majha)
ప్రధాని మోదీకి రేడియా అంటే ఎంతిష్టమో, వైరల్ అవుతున్న పాత ఫొటో - వయసెంతో చెప్పగలరా?
Mann Ki Baat 100th Episode: ప్రధాని మోదీ పాత ఫోటో వైరల్ అవుతోంది.
Mann Ki Baat 100th Episode:
వైరల్ అవుతున్న ఫొటో
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తైంది. ఈ కార్యక్రమంలో ఎన్నో కీలక విషయాలు ప్రస్తావించారు. దేశ ప్రజలందరితో కనెక్ట్ అవ్వడానికి ఇదో మంచి వేదికగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో ఎన్నో మంచి విషయాలు ప్రజలతో పంచుకునేందుకు అవకాశం దొరికిందని అన్నారు. అయితే...అసలు ప్రధాని మోదీ ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ఓ బలమైన కారణముంది. ఆయనకు రేడియో అంటే ఎంతో ఇష్టం. బీజేపీ కార్యకర్తగా పని చేసినప్పటి నుంచి ఆయన రేడియోపై ఎంతో ఆసక్తి కనబరిచే వారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పాత ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఓ నెటిజన్ ఆర్కీవ్స్ నుంచి ఈ ఫోటో తీసి పోస్ట్ చేశాడు. మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా పోస్ట్ చేసిన ఈ ఫోటోని చూసి అభిమానులు ముచ్చట పడుతున్నారు. "నరేంద్ర మోదీ వయసెంతో చెప్పగలరా" అంటూ ఆ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో మోదీ మైక్ ముందు కూర్చుని, హెడ్ సెట్ పెట్టుకుని ఉన్నారు. ఇది చూసిన మోదీ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఆయనకు 40 ఏళ్లు ఉండొచ్చని కామెంట్ చేస్తుంటే...మరి కొందరు 45 ఏళ్లు ఉండొచ్చు అని చెబుతున్నారు. modiarchive ట్విటర్ పేజ్‌లో ప్రధాని మోదీకి సంబంధించిన పాత ఫోటోలు, వార్తలు పోస్ట్ చేస్తుంటారు. దీనికి బీజేపీ ట్విటర్ హ్యాండిల్స్‌కి ఎలాంటి సంబంధం లేదు. అయితే...ఆ యూజర్ పోస్ట్‌లు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో చాలా పాతది. అప్పటికి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కూడా అవ్వలేదు. అప్పటికి బీజేపీ కార్యకర్తగా యాక్టివ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
Throwback: Can you guess how old Narendra Modi was in this picture?#MannKiBaat100 pic.twitter.com/OWXPswwQa1
— Modi Archive (@modiarchive) April 30, 2023
మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. దేశ ప్రజలందరకీ అభినందనలు తెలిపారు. మన్‌కీబాత్ కేవలం ఓ కార్యక్రమం మాత్రమే కాదని ఎంతో మందిని కదిలించిన ఉద్యమం అని వెల్లడించారు.
"మన్‌కీ బాత్ నాది మాత్రమే కాదు. ఇది దేశ ప్రజలందరి మనసులోని మాట. ఇది కేవలం ఓ కార్యక్రమం కాదు. దేశ పౌరులకు నేను ఇచ్చిన కానుక. ఇన్ని రోజుల ప్రయాణాన్ని నేను ఓ ఆధ్యాత్మిక యాత్రగా భావిస్తున్నాను. బేటీ బచావో, బేటీ పడావో, స్వచ్ఛ భారత్ అభియాన్, ఆజాద్ కా అమృత్ మహోత్సవ్..ఇలా ఏ కార్యక్రమమైనా సరే అది మన్ కీ బాత్‌తో ముడి పడిపోయింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. సెల్ఫీ విత్ డాటర్ అనే ఇనిషియేటివ్‌కి కూడా భారీ స్పందన వచ్చింది. యాక్టివిస్ట్ సునీల్ జగ్లన్ ఆలోచన ఇది. ప్రజలందరితో కనెక్ట్ అవ్వడానికి నాకు ఇదో వేదికగా మారింది. అందుకే దేశమంతా ఈ 100వ ఎపిసోడ్‌ని పండుగలా జరుపుకుంటోంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: Ludhiana Gas Leak: ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్, 9 మంది మృతి - మరికొందరు కోమాలో