అన్వేషించండి

Ukrain Russia War: చర్చలకు పిలిచి రష్యా దొంగదెబ్బ తీసే ప్రయత్నాలు - ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

Ukrain Russia War: చర్చలు జరుగుతున్న సమయంలో దాడులు ఎక్కువ చేయడం ద్వారా మా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రష్యా షరతులు అంగీకరించేలా చేసుకునేందుకు కుట్ర పన్నిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు.

Ukrain Russia Conflict: ఓవైపు చర్చలకు ఆహ్వానించి.. మరోవైపు తమ దేశంపై రష్యా బాంబు దాడులను తీవ్రతరం చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. చర్చలు జరుగుతున్న సమయంలో దాడులు ఎక్కువ చేయడం ద్వారా మా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రష్యా షరతులు అంగీకరించేలా చేసుకునేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. తమ నగరాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో చర్చలకు తాము అంగీకరించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. 

Ukrain Russia War: చర్చలకు పిలిచి రష్యా దొంగదెబ్బ తీసే ప్రయత్నాలు - ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

రష్యాతో భేటీ సందర్భంగా యుద్ధానికి ముగింపు పలకాలని తాము భావిస్తుండగా వారి బలగాలు కీవ్ సహా ఇతర నగరాలపై దాడులను పెంచి తమపై మరింత తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఓవైపు రాకెట్లతో దాడులు చేస్తూ, మరోవైపు శాంతి చర్చలు అనడం సబబు కాదన్నారు. దీనిపై ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదన్నారు. ఇప్పటికీ మా రాజధాని కీవ్ రష్యా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

లాస్ ఏంజిల్స్: స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను వినియోగించే కొన్ని పరికరాలు తమ దేశానికి వచ్చాయని ఉక్రెయిన్ డిజిటల్  మంత్రి చెప్పారు. స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కి ట్విట్టర్ వేదికగా మైఖైలో ఫెడోరోవ్ కృతజ్ఞతలు తెలిపారు. స్టార్‌లింక్ ఇప్పుడు ఉక్రెయిన్‌లో యాక్టివ్‌గా ఉందని, మీకు కావాల్సిన మరిన్ని పరికరాలు ఈ వీకెండ్‌లో అందిస్తామని ఎలాన్ మస్క్ ట్వీట్‌లో రిప్లై ఇచ్చారు. 

స్టార్‌లింక్.. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సిస్టమ్. ప్రపంచంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని తీసుకురావడానికి SpaceX సంస్థ శ్రమిస్తోంది. త్వరలోనే పలు దేశాలకు తన సేవలను విస్తరించేందుకు మస్క్ సిద్ధంగా ఉన్నారు. 

కీవ్: ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ లెజియన్‌లో చేరడానికి, రష్యా సైన్యం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ పక్షాన నిలిచేందుకు రావాలనుకున్న విదేశీయులకు వీసాల పర్మిషన్ లేకుండా చేస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి రాగా, తదుపరి ప్రకటన వచ్చే వరకు అమలవుతుంది.

న్యూయార్క్: రష్యాలో అన్ని వ్యాపార లావాదేవీలను నేషనల్ హాకీ లీగ్ నిలిపివేసింది.  మరియు ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినందున ఈవెంట్‌ను ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదు. రష్యా చర్యలను ఖండిస్తూ నేషనల్ హాకీ లీగ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నేషనల్ హాకీ లీగ్ రష్యా ఆటగాళ్ల భద్రతను కోరుకుంటోంది. ఎన్నో కుటుంబాలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని అర్థం చేసుకుంది. 

వాషింగ్టన్: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా రష్యా కు చెందిన RT, స్పూత్నిక్‌లను కంట్రోల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా సంస్థలు ఇతర దేశాలపై దుష్ప్రచారం చేస్తున్నాయన్న ఆరోపణలతో సోషల్ మీడియాలో వారి వీడియోలను స్ట్రీమింగ్ అవకుండా నియంత్రించాయి. ప్రభుత్వానికి చెందిన 40 సోషల్ మీడియా ఖాతాలను తొలగించిననట్లు మెల్నో పార్క్ వెల్లడించారు. ఫేస్‌బుక్ 2020లో రష్యా ప్రభుత్వం నడుపుతున్న మీడియాను లేబుల్ చేయడం ప్రారంభించింది. రష్యాకు మద్దతుగా ప్రసారం చేస్తున్న ఆర్టీ, స్పూత్నిక్‌లను తమ సోషల్ ఖాతాల్లో కంట్రోల్ చేస్తోంది. 

కైవ్: ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపాలని రష్యా అధినేతను కోరాలని ఉక్రేనియన్ ఆర్థోడాక్స్ బిషప్‌లు మాస్కోలోని తమ ఉన్నతాధికారికి సూచించారు. ఉక్రేనియన్ ఆర్థోడాక్స్ చర్చి  బిషప్‌ల పాలకమండలి హోలీ సైనాడ్ మాస్కో దాడుల్ని ఆపాలని కోరారు. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాట్రియార్క్ కిరిల్ చాలా కాలంగా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నారు. యుద్ధం గురించి ఎవరినీ నిందించడం లేదని, ఆర్థోడాక్స్ ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సైన్యం తరఫున దాడిని ఆపాలని రష్యాకు విన్నవించారు. 

టొరంటో: రష్యాతో యుద్ధంలో పోరాడేందుకుగానూ యుద్ధ ట్యాంకులను నాశనం చేసే ఆయుధాలు, అత్యాధునిక మందుగుండు సామాగ్రిని త్వరలోనే కెనడా అందిస్తుందని చెప్పారు. రష్యా నుంచి అన్ని ముడి చమురు దిగుమతులను కెనడా నిషేధించింది. శరీర రక్షక కవచం, హెల్మెట్లు, గాజు, నైట్-విజన్ గాగుల్స్‌తో సహా కొత్త సైనిక సామాగ్రిని ఈ వారం పంపిస్తామని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. రష్యా నుంచి తాము ఎక్కువగా ముడి చమురు దిగుమతి చేసుకోవడం లేదని తెలిపారు. ఇకనైనా ఆపకపోతే యుద్ధ పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

యునైటెడ్ నేషన్స్: దౌత్య సంబంధాలు దెబ్బతిని యుద్ధం జరుగుతున్న కారణంగా 12 మంది రష్యా దౌత్యాధికారులను తొలగించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా తొలగింపు జరిగినట్లు యూఎస్ డిప్యూటీ అంబాసిడర్ రిచర్డ్ మిల్స్ ఈ విషయాన్ని స్ఫష్టం చేశారు. రష్యా దౌత్యాధికారుల తొలగింపు యుద్ధానికి మరింత ఆజ్యం పోయడమేనని కొందరు భావిస్తున్నారు.

బ్రస్సెల్స్: ఓలిగార్చ్, ఉన్నతాధికారులు, ఎనర్జీ ఇన్సురెన్స్ కంపెనీ లాంటి మొత్తం రష్యాకు చెందిన 26 మంది, సంస్థల ఆస్తులపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల సంఖ్యను 680కి పెంచుతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగశాఖ మంత్రి సెర్గే లావ్రోవ్ కూడా ఉన్నారు. యుద్ధం కొనసాగితే మరికొందరు ఆస్తులను, బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని హెచ్చరించారు. 

కైవ్: రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై పలు నగరాల్లో దాడులు కొనసాగిస్తోంది. శాటిలైట్ ఫొటోలలో ఇది గుర్తించారు. రష్యా సైన్యం కీవ్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో దాడులు చేస్తోంది. ఇప్పటికే అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.  నగరంలో దాదాపు 3 మిలియన్ల మంది నివసిస్తున్నారు. మాక్సర్ టెక్నాలజీస్ రిలీజ్ చేసిన ఫొటోలు ప్రస్తుత పరిస్థితిని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి..

 పారిస్: ఫ్రాన్స్ తన ఎంబసీని ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుండి తరలించాలని నిర్ణయించింది. కానీ తమ రాయబారి అక్కడే ఉంటారు. కీవ్ నుంచి తమ ఆఫీసును పశ్చిమ నగరమైన ఎల్వివ్‌కు మార్చినట్లు ఫ్రాన్స్ వెల్లడించింది. దౌత్యధికారి ఎటియెన్ డి పోన్సిన్స్ ఉక్రెయిన్‌లోనే ఉంటారని లీ డ్రియన్ సోమవారం ఫ్రెంచ్ టెలివిజన్ స్టేషన్ బీఎఫ్ఎంటీవీకి తెలిపారు. సరిహ్దదు దేశంపై దాడులతో అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిలో ఉన్న తమ అంబాసిడర్‌కు ఏమైనా ముప్పు పొంచి ఉందా అని అడగగా.. కొన్ని సందర్భాలలో అపాయం ఉందని లె డ్రియాన్ తెలిపారు. ఎంబసీ ఆఫీసు పనులు ఇప్పుడు లీవ్ నుంచి జరుగుతాయని వెల్లడించారు.

(This story is published as part of the auto-generated syndicate wire feed.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
GTA 6: జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Embed widget