అన్వేషించండి

Iran War: గల్ఫ్ దేశాల్లోని 8 ప్రధాన వంతెనలు పేల్చేస్తాం! అమెరికా- ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా హిట్‌ లిస్ట్ విడుదల చేసిన ఇరాన్!

Iran War: ఇరాన్‌లోని ఎత్తైన B1 వంతెనపై అమెరికా- ఇజ్రాయెల్‌ దాడులు చేసి 8 మంది మృతికి కారణమైంది. దీనికి ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాల్లోని 8 ప్రధాన వంతెనలు టార్గెట్ చేసినట్టు హిట్ లిస్ట్ విడుదల చేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌లో కీలక వంతెనపై దాడి చేశాయి.
  • ఈ దాడిలో 8 మంది మరణించారు, 95 మంది గాయపడ్డారు.
  • ట్రంప్ ఇరాన్‌ను రాతి యుగంలోకి పంపిస్తామని హెచ్చరించారు.
  • ప్రతీకారంగా ఇరాన్ నాలుగు దేశాల 8 వంతెనలను లక్ష్యంగా చేసుకుంది.

Iran War: మధ్య ప్రాచ్యంలో ఐదు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గురువారం నాడు అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు సంయుక్తంగా ఇరాన్‌లోని కీలకమైన మౌలిక సదుపాయాలపై మెరుపుదాడులు చేశాయి. ఈ దాడుల్లో భాగంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ సమీపంలోని కరాజ్ నగరంలో ఉన్న అత్యంత ఎత్తైన B1 వంతెనను లక్ష్యంగా చేసుకున్నారు. 

ఈ దాడిలో వంతెన పాక్షికంగా ధ్వంసమవడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అల్బోర్జ్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్‌ ఘోద్రతుల్లా సైఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 95 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న దృశ్యాల ప్రకారం దాడి జరిగిన వెంటనే వంతెనలోని ప్రధాన భాగాలు కుప్పకూలిపోయాయి. 

ట్రంప్ హెచ్చరిక 

ధ్వంసమైన బీ1 వంతెన మధ్య ప్రాచ్యంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా గుర్తింపు పొందింది. 136 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెన, టెహ్రాన్‌ను పశ్చిమ నగరమైన కరాజ్‌తో కనెక్ట్ చేసే కీలక మార్గంగా రూపొందుతోంది. ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. 

ఈ దాడి అనంతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సోషల్ మీడియాలో వంతెన నుంచి వస్తున్న పొగలను చూపే వీడియోను పోస్టు చేస్తూ ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్‌ తిరిగి రాతి యుగంలోకి పంపిస్తామని ఆయన గతంలోనే హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇరాన్ తన దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలని అనుకుంటే, సమయం మించిపోకముందే చర్చలకు ముందుకు రావాలి, లేకుంటే ఏమీ మిగలదు. అని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ లొంగిపోయే వరకు దాడులు కొనసాగుతాయని ఆయన సంకేతాలు ఇచ్చారు. 

ఇరాన్ ప్రతీకార చర్యగా హిట్ లిస్ట్ విడుదల 

అమెరికా- ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతి చర్యగా ఇరాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తన మౌలిక సదుపాయాలై జరిగిన దాడికి ప్రతీకారంగా మధ్య ప్రాచ్య ప్రాతంలోని నాలుగు దేశాలకు చెందిన 8 ప్రధాన వంతెనల జాబితాను విడుదల చేసింది. ఈ వంతెనలను ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఇరాన్ సెమీ అఫీషియల్ వార్తా సంస్థ ఫోర్స్ హెచ్చరించింది. 

ఇరాన్ హిట్ లిస్ట్‌లో ఉన్న వంతెనలు ఇవే

కువైట్‌లోని షేక్ బజార్‌ అల్‌- అహ్మద్‌ అల్‌ సబా సీ బ్రిడ్జ్‌ 

యూఏఈలోని షేక్‌ జాయెద్ బ్రిడ్జ్‌ అల్‌ ముఖ్తా బ్రిడ్జ్‌, షేక్ ఖలీపా బ్రిడ్జ్‌

సౌదీ అరేబియా- బహ్రెయిన్ లోని సౌదీ అరేబియాను బహ్రెయిన్‌తో కలిపే కింగ్ ఫహద్‌ కాజ్‌వే. 

జోర్డాన్‌ లోని కింగ్ హుస్సేన్‌ బ్రిడ్జ్‌, దమియా బ్రిడ్జ్‌, అబ్దున్‌ బ్రిడ్జ్‌ 

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ స్పందిస్తూ... నిర్మాణంలో ఉన్న వంతెనలు వంటి పౌర నిర్మాణాలపై దాడులు చేయడం వల్ల ఇరాన్ లొంగిపోదని స్పష్టం చేశారు. ఈ చర్యలు కేవలం శత్రువుల నైతిక పతనాన్ని , అశాంతిని మాత్రమే సూచిస్తాయని అభిప్రాయపడ్డారు. 

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 1340 మంది మరణించారని నివేదికలు చెబుతున్నాయి ఇందులో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా ఉన్నారు. గల్ఫ్ ప్రాంతంలో హోర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తుతోంది. 

Frequently Asked Questions

అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై ఎందుకు దాడి చేశాయి?

మధ్యప్రాచ్యంలో ఐదు వారాలుగా కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా, అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌లోని కీలకమైన మౌలిక సదుపాయాలపై మెరుపుదాడులు చేశాయి.

దాడిలో ధ్వంసమైన B1 వంతెన ప్రాముఖ్యత ఏమిటి?

B1 వంతెన మధ్య ప్రాచ్యంలోనే అత్యంత ఎత్తైన వంతెన. ఇది నిర్మాణ దశలో ఉంది మరియు టెహ్రాన్‌ను కరాజ్‌తో కలిపే కీలక మార్గంగా రూపొందుతోంది.

ఈ దాడి వల్ల జరిగిన నష్టం ఎంత?

ఈ దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 95 మంది తీవ్రంగా గాయపడ్డారు. వంతెన ప్రధాన భాగాలు కుప్పకూలిపోయాయి.

ఇరాన్ ప్రతీకార చర్యగా ఏమి చేసింది?

అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా, ఇరాన్ నాలుగు దేశాలకు చెందిన 8 ప్రధాన వంతెనల జాబితాను విడుదల చేసింది. వీటిపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై ఎలా స్పందించారు?

ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరిస్తూ, తిరిగి రాతి యుగంలోకి పంపిస్తామని, చర్చలకు ముందుకు రాకపోతే ఏమీ మిగలదని పేర్కొన్నారు. ఇరాన్ లొంగిపోయే వరకు దాడులు కొనసాగుతాయని సంకేతాలు ఇచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget