అన్వేషించండి

Iran War: అమెరికా-ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్ వివాదం!ట్రంప్ హెచ్చరికలు లైట్ తీసుకున్న టెహ్రాన్! బ్రిటన్ సరికొత్త ప్రతిపాదన!

Iran War: కాల్పులు విరమణ ప్రకటించాలని ఇరాన్ ప్రాధేయపడుతుందని ట్రంప్‌ చేసిన కామెంట్స్‌పై టెహ్రాన్ మండిపడింది. అలాంటిదేమీ లేదని వెల్లడించింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇరాన్-అమెరికా మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది.
  • ఇరాన్ ప్రతిపాదనపై ట్రంప్ షరతులు విధించారు.
  • ఏప్రిల్ ఫూల్ అంటూ ఇరాన్ ఘాటుగా స్పందించింది.
  • హోర్ముజ్ జలసంధిని తెరవడానికి బ్రిటన్ ప్రతిపాదన.

Iran War: పశ్చిమాసియాలో నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ  క్రమంలో ఇరాన్, ట్రంప్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకవైపు యుద్ధ విరమణ ప్రకటించాలని ఇరాన్ రిక్వస్ట్ చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తే, ఆ వార్తలను టెహ్రాన్ ఖండించింది. ప్రపంచాన్ని ట్రంప్ ఏప్రిల్‌ ఫూల్ చేస్తున్నారని సెటైర్లు వేస్తోంది. 

ఇరాన్ ప్రాధేయపడుతుందన్న ట్రంప్‌

బుధవారం నాడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌సోషల్‌లో డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్టు పెట్టారు. ఇరాన్‌లోని కొత్త పాలన ప్రతినిధి యుద్ధ విరమణ ప్రతిపాదన తమ వద్ద ఉంచారని తెలిపారు. ఈ కొత్త అధ్యక్షుడికి గత నేతల కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని తీవ్రవాద ధోరణి తక్కువగా ఉందని కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు సీజ్‌ఫైర్ అంత ఈజీ కాదని ట్రంప్ షరతులు పెట్టినట్టు చెప్పారు. ప్రపంచ క్రూడ్ ఆయిల్ వ్యాపారానికి కీలకమైన హోర్ముజ్‌  జలసంధిని తక్షణమే పూర్తి స్థాయిలో తెరవాలని డిమాండ్ చేశారు. ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలని చెప్పారు. ఈ షరతులకు అంగీకరిస్తే యుద్ధ విరమణ గురించి ఆలోచిస్తామన్నారు. అంతేకాకుండా ఈ షరతులకు ఒప్పుకోకపోయినా ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాతియుగంలో ఎలా ఉండేదో ఆ దేశాన్ని అలా చేస్తామని అన్నారు. 

ఏప్రిల్ పూల్ అంటూ ఇరాన్ ఘాటు స్పందన 

ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వం మండిపడింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో... అబద్దాలతో కూడిన ప్రకటనలు ట్రంప్ చేస్తున్నారని అన్నారు. ఇరాన్‌లో పాలన మారలేదని స్పష్టం చేసింది. మసూద్‌ పెజెష్కీయాన్ అధ్యక్షుడిగా ఉన్నారని, అమెరికా వద్దకు ఎలాంటి సీజ్‌ఫైర్ అభ్యర్థనలు పంపలేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా అధ్యక్షుడిని మార్చలేరని ఎద్దేవా చేశారు. ట్రంప్ ఏప్రిల్‌ ఫూల్ జోకులు వేస్తున్నారని సెటైర్లు వేశారు. ఎన్ని రోజులైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామన వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ప్రకటించారు. ఆరు నెలలపాటు యుద్ధం చేసే శక్తి వనరులు ఉన్నాయని స్పష్టం చేశారు. 

బ్రిటన్ కీలక ప్రతిపాదన 

ఇరాన్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ హోర్మూజ్‌ జలసంధిని ఓపెన్ చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని కిర్‌ స్టార్మర్‌ హోర్మూజ్‌ జలసంధిని తెరిపించేందుకు 35 దేశాలతో కలిసి ఒక అంతర్జాతీయ దౌత్య సదస్సును నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు ఇప్పటికే ఈ ఒప్పందంపై సంతకం చేశాయి.సముద్రయాన భద్రతను పునరుద్ధరించడం, చిక్కుకుపోయిన నౌకలను, నావికులను సురక్షితంగా బయటకు తీసుకురావడమే ఈ సమావేశ ప్రధాన ఉద్దేశమని స్టార్మర్‌ తెలిపారు. ఈ సమావేశానికి మిలిటరీ ప్లానర్లను కూడా ఆహ్వానించారు. 

ఈ సంక్షోభం అమెరికా, దాని పాత మిత్ర దేశాల మధ్య విభేదాలను బయటపెట్టింది. ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో బ్రిటన్, ఫ్రాన్స్‌,  వంటి దేశాలు నేరుగా పాల్గొనకపోవడంపై ట్రంప్‌ తప్పుపడుతున్నారు. మీర సొంత చమురు కోసం మీరే పోరాడటం నేర్చుకోండని సెటైర్లు వేస్తున్నారు. ఇకపై అమెరికా ఎలాంటి సాయం చేయబోదని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్పందించిన బ్రిటన్ వంటి దేశాలు తమక ప్రయోజనాల కోసం తాము పని చేస్తామని అమెరికా లాంటి దేశాల ఒత్తిడితో ఎలాంటి చర్యలు తీసుకోమని స్టార్మర్‌ స్పష్టం చేశారు. 

Frequently Asked Questions

ట్రంప్ ఇరాన్ యుద్ధ విరమణ ప్రతిపాదనపై ఏమి చెప్పారు?

ఇరాన్ కొత్త పాలన ప్రతినిధి యుద్ధ విరమణ ప్రతిపాదన తమ వద్ద ఉంచారని ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, హోర్ముజ్ జలసంధిని పూర్తి స్థాయిలో తెరవాలని షరతు విధించారు.

ఇరాన్ ట్రంప్ ప్రకటనపై ఎలా స్పందించింది?

ఇరాన్ ఈ ప్రకటనను ఖండించింది. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని, తాము ఎలాంటి అభ్యర్థనలు పంపలేదని, ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ అని పేర్కొంది.

హోర్ముజ్ జలసంధిని తెరవడానికి బ్రిటన్ ఏమి ప్రతిపాదించింది?

బ్రిటన్ ప్రధాని కిర్ స్టార్మర్ 35 దేశాలతో కలిసి హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఒక అంతర్జాతీయ దౌత్య సదస్సును నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఇరాన్ విదేశాంగ మంత్రి ఏమి ప్రకటించారు?

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, ఎన్ని రోజులైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని, వెనక్కి తగ్గేది లేదని, ఆరు నెలలపాటు యుద్ధం చేసే శక్తి వనరులు ఉన్నాయని స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Iran US War: చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget