అన్వేషించండి

Google : గూగుల్‌పై కోర్టుకెళ్లి రూ.26 వేల కోట్ల పరిహారం పొందుతున్నారు - ఈ యూకే జంట పంట పండినట్లే !

UK: ఓ కంపెనీ వెబ్ సైట్ విషయంలో చేసిన తప్పు కోసం గూగుల్ భారీ పరిహారం చెల్లించాల్సి వస్తోంది. రూ. 26వేల కోట్లను ఓ జంటకు చెల్లించాలని బ్రిటన్ కోర్టు ఆదేశించింది.

UK couple: గూగుల్ సెర్చింజన్ చేసిన తప్పు కారణంగా తమ వ్యాపారం దెబ్బతిన్నది కోర్టుకెళ్లిన ఓ జంటకు పదిహేనేళ్లల న్యాయపోరాటం ఫలితం ఇచ్చింది. రూ. 26 వేల కోట్ల నష్టపరిహారం చెల్లించాని గూగుల్ ను యూకే కోర్టు ఆదేశించింది.              
 
యునైటెడ్ కింగ్ డమ్‌కు చెందిన శివౌన్ రౌఫ్  , ఆమె భర్త అడమ్‌కు ఓ  వెబ్ సైట్ ఉండేది. ఆ వెబ్ సైట్ వివిధ వస్తువుల ధరలను కంపేర్ చేస్తుంది. ఏదో తప్పు జరిగిందని గూగుల్ సెర్చ్ పెనాల్టీకి గురయ్యారు. అయితే ఎలాంటి తప్పు లేకుండా గూగుల్ సెర్చ్ పెనాల్టీకి గురయ్యామని ఇదంతా గూగుల్ ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు అని ఆరోపిస్తూ ఆ జంట యూకే కోర్టులో పిటిషన్లు వేశారు. అనేక సార్లు విచారణ జరిగింది. అనేక సార్లు అప్పీలుకు వెళ్లారు. చివరికి కోర్టు తుది విచారణ పూర్తి చేసింది. గూగుల్ వైపు నుంచే తప్పు ఉందని గుర్తి 2.4 బిలియన్ బ్రిటన్ పౌండ్ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంటే మన రూపాయల్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు.                   

  కిండర్ గార్టెన్లను వృద్ధాశ్రమాలుగా మార్చేస్తున్నారు - చైనా ముసలిదైపోతోంది !

గూగుల్ చేసిన తప్పు కారణంగా తాము ఎంతో నష్టపోయామని అందుకే సుదీర్ఘంగా న్యాయపోరాటం చేస్తున్నామని ఆ జంట చెబుతున్నారు. అనుకూల ఫలితం రావడంతో వారు సంతృప్తిగా ఉన్నారు. అప్పట్లో తాము పడిన మానసిక వేదనను తమను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పుకున్నారు. ఎంతో కష్టపడి తాము ప్రారంభించిన వెబ్ సైట్ గూగుల్ చేసిన తప్పు కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఎన్నో సార్లు లేఖలు పంపినా పట్టించుకోలేదన్నారు  తరవాత ఇదందా ఉద్దేశపూర్వకంగా చేసిందని గుర్తించామని తమ వ్యాపారాలను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా గుర్తించామని అంటున్నారు. ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయించామని ఇప్పుడు మంచి ఫలితం సాధించామని చెబుతున్నారు.            

దేశం నుంచి వెళ్లగొట్టారు కానీ రాజీనామా లేఖ మర్చిపోయారు - ఇప్పటికీ బంగ్లాదేశ్ అధ్యక్షురాలు హసీనానేనా ?

 ఈ జంట ఆషామాషీగా న్యాయపోరాటం చేయలేదు. గూగుల్ చేసిన తప్పులను ప్రతి ఆధారాన్ని సేకరించారు. వాటిని కోర్టు ముందు ఉంచారు. గూగుల్ చాలా పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని వాదనలు వినిపించింది. అయితే యూకే కోర్టు ముందు వారి పప్పులు ఉడకలేదు. ఇరవై ఆరు వేల కోట్లు కట్టాల్సి వస్తోంది. నిజానికి గూగుల్ పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. తమ వెబ్ సైట్ ర్యాంకింగ్స్ ను తగ్గిస్తోందని ఉద్దేశపూర్వకంగా కొంత మందివి హైలెట్ చేస్తోందని అనేక దేశాల్లో కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో పిటిషన్లు వేసిన వారంతా ఇప్పుడు మరింత కసిగా న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది.                            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Tata Altroz ​​Racer: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Tata Altroz ​​Racer: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Embed widget