China News : కిండర్ గార్టెన్లను వృద్ధాశ్రమాలుగా మార్చేస్తున్నారు - చైనా ముసలిదైపోతోంది !
Population : చైనాలో జనాభా సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. వృద్ధాశ్రమాలుగా కిండర్ గార్టెన్ స్కూళ్లను మార్చేస్తున్నారు. వేగంగా జనాభా తగ్గిపోతోంది.
China population crisis is getting worse: చైనా శరవేగంగా వృద్ధాప్యంలోకి వెళ్లిపోతోంది. ఎంతగా అంటే అక్కడ కిండర్ గార్టెన్ స్కూళ్లను వృద్ధాశ్రమాలుగా మార్చేస్తున్నారు. వాటిలో చేరేందుకు అవసరమైనంత మంది పిల్లలు పుట్టడం లేదు. అంతేనా వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. అలాంటి వారికి షెల్టర్లు దొరకడం గగనంగా మారుతోంది. దాంతో మూతపడిన కిండర్ గార్టెన్ స్కూళ్లలో వృద్ధుల్ని ఉంచుతున్నారు. వృద్ధులూ చిన్న పిల్లలే అనుకుంటూ మధ్యతరం వారికి సేవలు చేస్తోంది. కానీ భవిష్యత్ పై మాత్రం చైనాకు భయం పట్టుకుంది.
ఒక్క బిడ్డ కూడా వద్దనుకుంటున్న చైనా జంటలు
చైనాలో జనాభా సమస్య తీవ్రమవుతోంది. ఒకప్పుడు అధిక జనాభాతో బాధపడిన ఆ దేశం అత్యంత కఠినంగా ఒకే బిడ్డ విధానాన్ని అమలు చేసింది. ఈ కారణంగా చైనాలో ఓ కుటుంబానికి వారసుడో.. వారసురాలో ఒక్కరే ఉంటారు. ఇలా అత్యంత కఠినంగా జనాభాను నియంత్రించడంతో యువ జనాభా తగ్గిపోయింది. రాను రాను పరిస్థితి వరస్ట్ గా మారిపోయింది. ఇప్పుడు చైనా జనాభాలో యువత తగ్గిపోయారు. అంటే శ్రామిక శక్తి తగ్గిపోతోంది. వృద్ధులు పెరిగిపోతున్నారు. చైనా శ్రామిక శక్తి కారణంగానే తయారీ రంగంలో నెంబర్ వన్ గా ఉంది. ఇప్పుడు పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గుతూండటంతో భవిష్యత్ అత్యంత భయంకరంగా ఉంటుందని అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వానికి అర్థం అయింది.
మూడో బిడ్డను కంటే ప్రోత్సాహకాలు ఇస్తున్న చైనా
వెంటనే పాలసీ మార్చింది. ఇద్దర్ని కనవచ్చని ప్రకటించింది. ముగ్గుర్ని కంటే ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని చెబుతోంది. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. విషాదం ఏమిటంటే ఆ ఒక్కరూ కూడా వద్దనుకుంటున్న జంటలు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో చైనా ప్రభుత్వం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. గత ఏడాది కాలంలో చైనాలో 14వేలకుపైగా కిండర్ గార్టెన్ స్కూళ్లు .. పిల్లలు లేక మూతపడ్డాయి. జనాభా సంఖ్య స్థిరంగా కూడా ఉండటం లేదు. జననాలతో పోలిస్తే మరణాల రేటు ఎక్కువగా ఉండటంతో జనాభా తగ్గిపోయింది.
మోదీతో పెట్టుకున్న కెనడా ప్రధానికి పదవీ గండం- ట్రూడో రాజీనామాకి ఎంపీల డిమాండ్
మేలుకుంటున్న భారత్
ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం చైనా పాలకులకు తలకు మించిన బారంగా మారింది. భవిష్యత్‌లో ఎంత ఇబ్బంది పడాలో అని మథనపడుతోంది. మన దేశంలో పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి. అయితే చైనా లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు, స్టాలిన్ లాంటి వాళ్లు పిలుపునిస్తున్నారు.