అన్వేషించండి

Canada PM Justin Trudeau: మోదీతో పెట్టుకున్న కెనడా ప్రధానికి పదవీ గండం- ట్రూడో రాజీనామాకి ఎంపీల డిమాండ్

Canada PM Justin Trudeau: చేసిన నిర్వాకాలు చాలు దిగిపోండని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు ఎంపీలు అల్టిమేటం ఇచ్చారు. ఎప్పటి నుంచో తీవ్ర అసంతృప్తితో ఉన్న వారంతా లెటర్ రాశారు.

Canadian PM Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు పదవీ గండం పొంచి ఉంది. చేసిన నిర్వాకాలా చాలు ఇక తప్పుకోమంటూ కెనడా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ సమావేశంలో ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎంపీలు రాజీనామాకు అల్టిమేటం జారీ చేశారు. 

భారత్‌తో సున్నం పెట్టుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అనుకోని కష్టం వచ్చి పడింది. ఆధారాలు లేని కేసులో లేని పోని ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నించారు. కర్మ రిటర్న్స్‌ అన్నట్టు ఇప్పుడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ప్రమాదం వచ్చి పడింది. 

కెనడా ప్రధానమంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రిజైన్ చేయాలని ఎంపీలు పట్టుబట్టారు. అక్టోబర్ 28లోగా రాజీనామా చేయాలని డెడ్‌లైన్ పెట్టారు. ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉన్నప్పటికీ...ఈ మీటింగ్‌లో ఒక్కసారిగా తమ ఫ్రస్ట్రేషన్‌ చూపించారు. ఈ మేరకు ఓ డాక్యుమెంట్‌ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చారు. 

ట్రూడో రాజీనామా చేయకపోతే తరవాతి పరిణామాలు ఎలా ఉంటాయన్నది మాత్రం అందులో ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈ డాక్యుమెంట్‌పై లిబరల్ పార్టీకి చెందిన 24 మంది ఎంపీలు సంతకం చేశారు. అంతే కాదు. అమెరికాలోని ఎలక్షన్స్‌కి ఇక్కడి పరిస్థితులకు లింక్ చేస్తూ డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు. 

ట్రూడో వద్దంటున్న ఎంపీలు

నాలుగు గోడల మధ్య అసమ్మతి లిబరల్ MPలు తమ మనసులో మాటలను ట్రూడోకు తెలియజేశారు. పార్టీలో పెరుగుతున్న అసంతృప్తికి ఇది ప్రతిబింబిస్తుంది. హౌస్ ఆఫ్ కామన్స్ సెషన్‌లో ఉన్న సమయంలో ఎంపీలు తమ ఫిర్యాదులు తెలియజేశారు. కనీసం 24 మంది ఎంపీలు లిబరల్ నాయకుడిగా ట్రూడోను వ్యతిరేకిస్తున్నారు.  
బుధవారం జరిగిన కాకస్ సమావేశంలో ఎంపీలు ప్రసంగించడానికి ఒక్కొక్కరికి రెండు నిమిషాల సమయం ఇచ్చారు. అంతా ముక్తకంఠంతో వచ్చే ఎన్నికలకు ముందే ట్రూడోను పక్కన పెట్టాలని కోరారు. దీన్ని వ్యతిరేకిస్తున్న ఎంపీలు కొందరు ప్రధానికి మద్దతుగా నిలిచారని తెలుస్తోంది. 

ట్రూడో భావోద్వేగం

ఈ సమావేశంలోనే మాట్లాడిన ట్రూడో కాస్త భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది. తన పిల్లలు చూసేలా బహిరంగంగా"F--- ట్రూడో" ప్లకార్డులు చూపించడాన్ని తప్పుపట్టారు. సమావేశంలో ఎంపీలు చెప్పిన సలహాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. ట్రూడోపై ఒత్తిడి ఉన్నప్పటికీ పదవి నుంచి వెళ్లాలా ఉండాలా అనేది పూర్తిగా ఆయన ఇష్టంపై ఆధార పడి ఉంటుంది. 

భారత్‌తో వైరం పెరిగినప్పటి నుంచి మారుతున్న పరిస్థితులు

జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోడానికి అంగీకరించకపోతే ఎలాగైతే డెమొక్రాట్ పార్టీలో అలజడి రేగిందో..అదే విధంగా లిబరల్ పార్టీలోనూ జరుగుతుందని హెచ్చరించారు. మీటింగ్ జరుగుతుండగానే ఎంపీలంతా నిరసన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నుంచి ట్రూడో తప్పుకోవాలంటూ అల్టిమేటం ఇచ్చారు. భారత్‌తో వైరం పెరిగినప్పటి నుంచి ఎంపీల్లో ప్రధాని ట్రూడోపై అసహనం పెరిగిపోయింది. ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్  హత్యలో భారత్‌ జోక్యం ఉందని సంచలనం ఆరోపణలు చేశారు ట్రూడో. అప్పటి నుంచే స్థానికంగా వ్యతిరేకత పెరిగింది.

Also Read: ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టంలో ఐరన్ డ్రోమ్ ఒక్కటేనా? ఇంకా ఉన్నాయా?

టాప్ హెడ్ లైన్స్

US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget