Cannes Film Festival: మరో చాప్లిన్ రావాలి, పుతిన్‌ను ప్రపంచం ప్రశ్నించాలి: కేన్స్ చలన చిత్రోత్సవంలో జెలెన్‌స్కీ
Cannes Film Festival: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దండయాత్రపై యావత్ సినీ ప్రపంచం ప్రశ్నించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.
Cannes Film Festival:
ప్రతిష్ఠాత్మక చలన చిత్రోత్సవం కేన్స్ వేడుకలు ఫ్రాన్స్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుక ప్రారంభోత్సవంలో లైవ్ శాటిలైట్ వీడియో ద్వారా ప్రత్యేక ప్రసంగం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. రష్యా చేస్తోన్న దురాగతాలను ప్రపంచానికి గొంతెత్తి చాటాలని ఆయన కోరారు.
And here is the video of today's performance by Zelenskyy at the Cannes Film Festival.
— ТРУХА⚡️English (@TpyxaNews) May 17, 2022
“I am sure that the dictator will lose. We will win this war,” the President of Ukraine said.
The audience gave a standing ovation 👏 pic.twitter.com/s5yiroFpOq
స్టాండింగ్ ఒవేషన్
ఈ ప్రసంగంలో భాగంగా 'ది గ్రేట్ డిక్టేటర్' చిత్రంలో చాప్లిన్ చెప్పిన ఓ డైలాగ్‌ను జెలెన్‌స్కీ ప్రస్తావించారు.
ఆయన ప్రసంగానికి వేడుకకు హాజరైన వారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ వేడుకలో భాగంగా ఉక్రెయిన్ దర్శకుడు మాంటాస్ రూపొందించిన 'ది నేచురల్ హిస్టరీ ఆఫ్ డిస్ట్రక్షన్' డాక్యుమెంటరీని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ డాక్యుమెంటరీ తీసిన కొద్ది రోజులకే మాంటాస్.. మేరియుపోల్‌లో రష్యా జరిపిన దాడుల్లో మరణించారు.
Also Read: Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్
Also Read: Wall Collapse in Gujarat: ఉప్పు ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం- గోడ కూలి 12 మంది మృతి!