Morning Top News:
అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు
దేశంలోని ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్నులుగా ఏపీ సీఎం చంద్రబాబు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం.. సీఎం చంద్రబాబు రూ.931 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రూ.15కోట్ల ఆస్తులతో చివరి స్థానంలో ఉన్నారు. ఇక మొత్తం 31 మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,630 కోట్లు అని నివేదిక వెల్లడించింది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్
చిన్నపాటి ప్రమాదం అనుకున్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కదలాల్సి వచ్చింది మదనపల్లి ఫైల్స్ దగ్దం కేసు. అప్పటివరకు ప్రమాదం అనుకున్న వారే ఇది ప్రమాదం కాదు కుట్ర కోణం అనేది తెరమీదకు వచ్చింది. ఆరు నెలల పాటు సాగిన విచారణ లో తొలి అరెస్ట్ నమోదైంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రేషన్ బియ్యం మాయం కేసులో 'పేర్ని'కి ఊరట
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి ఊరట లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరైంది. అయితే కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని 9వ అదనపు జిల్లా జడ్జి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సివిల్ సప్లయిస్ కు అద్దెకు ఇచ్చిన గోడౌన్ లో 185 టన్నుల రేషన్ బియ్యం షార్టేజీ రావటంతో జయసుధపై క్రిమినల్ కేసు నమోదైంది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ స్వాధీనం
ఇంగ్లీష్ న్యూ ఇయర్ సందర్భంగా భారీగా డ్రగ్స్, మత్తు పదారాలు నగరంలోకి వస్తాయని పోలీసుల ఆకస్మితక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివారులో భారీగా మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్న 2 కేజీల పప్పిస్ట్రా అను మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేజీల మత్తు పదార్థం పప్పిస్ట్రా స్వాధీనం చేసుకున్నారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సొంత నియోజకవర్గం లేని గుడివాడ అమర్నాథ్
సొంత నియోజక వర్గం అంటూ లేని నేతగా గుడివాడ అమర్ నాథ్ మారారు. చిన్న వయసులోనే మంత్రి అయిన అమర్నాథ్ వైసీపీ లో కీలక పాత్రనే పోషించారు. అయితే ప్రస్తుతం రాజకీయంగా నియోజకవర్గంలేని చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఈ మాజీ మంత్రి. ఆయన పరిస్థితి అనకాపల్లిలో పోటీ చేయడానికి లేదు ఇటు గాజువాకలో కంటిన్యూ అవ్వడం ఇష్టం లేదు అన్నట్టు తయారయ్యింది పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీలో రేవ్ పార్టీ కలకలం!
తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలకం రేగింది. కోరుకొండ మం. బూరుగుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో తెల్లవారుజామున రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. దీనిలో పాల్గొన్న ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. పార్టీలోని యువతులు గుంటూరు, యువకులు, రెసిడెన్సీ కల్యాణ మండపం ఓనర్ రాజమండ్రికి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అల్లు అర్జున్‌ను ఒంటరి చేసేశారు: పవన్ కల్యాణ్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను ఒంటరి చేసేశారని, అతడిని దోషిగా నిలబెట్టారని పవర్ స్టార్
పవన్ కల్యాణ్ అన్నారు. ఇది సమంజసం కాదన్నారు. ఈ ఘటనలో అందరూ కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేదన్నారు. అల్లు అర్జున్ కాకపోయినా కనీసం ఆయన సిబ్బంది అయినా రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తే సబబుగా ఉండేదని, అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకూ ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
స్పేడెక్స్ ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ - 60 (PSLV C-60) వాహకనౌక ప్రయోగ వేదిక నుంచి సరిగ్గా రాత్రి 10 గంటల 15 సెకన్లకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా స్పేడెక్స్ ప్రయోగం చేపట్టారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అందుకే PSLV C60 ప్రయోగం ఆలస్యం: ఇస్రో
PSLV C60 రాకెట్ ప్రయోగం వాయిదా పడటంపై ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ స్పందించారు. ‘అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాకెట్ వెళ్లాల్సిన అదే కక్ష్యలో ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చెందడం వల్ల ఈ పరిస్థితికి దారితీసింది. దీంతో ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యం అయింది. 9.58 గంటలకు బదులుగా 10 గంటల 15 సెకన్లకు రీషెడ్యూల్ చేశాం’ అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమ్‌నాథ్ వెల్లడించారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సత్య నాదెండ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో సీఎం దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
న్యూ ఇయర్ కి సిద్దమైన దేశ రాజధాని
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నగరంలోని కీలక ప్రాంతాల్లో అదనపు పెట్రోలింగ్, ప్రత్యేక విభాగాలను మోహరించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) అంకిత్ చౌహాన్ తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భారత్ డబ్ల్యూటీసీ ఆశలు సంక్లిష్టం
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలను భారత్ క్లిష్టం చేసుకుంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో గెలిచినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితిలో నిలిచింది. మరోవైపు ఆదివారం పాకిస్థాన్‌పై 2 వికెట్లతో గెలిచిన దక్షిణాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ఫైనల్ పోరు వచ్చే జూన్‌లో లండన్‌లోని ప్రముఖ లార్డ్స్ మైదానంలో జరుగుతుంది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..