అన్వేషించండి

Top 10 Headlines Today: కేంద్రమంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఎవరికీ? తమిళనాడులో గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ సీజన్ 2

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today: 

ఛాాన్స్ కొట్టేదెవరు?

ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ తన టీంను పునర్వవ్యవస్థీకరించాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. సోమవారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. సాధారణంగా కేబినెట్ సమావేశాల్లో కేబినెట్ మంత్రులకే ఆహ్వానం ఉంటుంది. కానీ ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు అంటే.. సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ చార్జ్ ఉన్న  సహాయమంత్రులు కూడా హాజరవుతున్నారు. బహుశా.. తప్పించాలనుకున్న మంత్రుల వద్ద నుంచి అక్కడే రాజీనామా లేఖలు తీసుకునే అవకాశం ఉంది. కొత్తగా ఎన్నికలు జరగనున్న  రాష్ట్రాలకు మంత్రి పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. అందులో తెలంగాణ కూడా ఉంది. మరి తెలంగాణకూ మరో కేంద్ర మంత్రి పదవి లభిస్తుందా ? ఏపీ కి అసలు కేంద్రమంత్రే లేరు. ఏపీకీ ఓ చాన్సిస్తారా ?పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

జులై 8న తెలంగాణకు మోదీ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 8న ప్రధాని తెలంగాణలోని వరంగల్ లో పర్యటించనున్నారు. అది అధికార పర్యటన కాగా, రాజకీయపరంగానూ వాడుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వెదర్‌ రిపోర్ట్

ప్రస్తుతం తెలంగాణలో దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇవాళ, అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పారు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రేస్‌లో అగార్కర్

టీమిండియా మాజీ బౌలర్  అజిత్ అగార్కర్ ఆలిండియా చీఫ్ సెలక్టర్  రేసులో ఉన్నాడా..? అంటే సమాధానం అవుననే వినిపిస్తున్నది. ఇటీవలే బీసీసీఐ.. స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన మాజీ చీఫ్ సెలక్టర్  చేతన్ శర్మ స్థానాన్ని (నార్త్ జోన్) భర్తీ చేసేందుకు గాను  అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరిన విషయం తెలిసిందే. చేతన్ శర్మ స్థానంలో  అజిత్ అగార్కర్.. ఆలిండియా చీఫ్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తున్నది. తాజాగా అగార్కర్  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచింగ్ స్టాఫ్ నుంచి కూడా తప్పుకోవడం ఈ వార్తలను మరింత బలాన్నిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రేపే గ్రూప్‌4 ఎగ్జామ్ 

తెలంగాణలో జూన్‌ 1న నిర్వహించనున్న 'గ్రూప్‌-4' పరీక్షకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. భారీసంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరికోసం 2878 పరీక్ష కేంద్రాల్లో  టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్-4 పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కొన్ని కీలక సూచనలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఓట్లు తొలిగిస్తున్నారు; చంద్రబాబు

ఓటరు జాబితాలో అక్రమాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపును సీరియస్ గా తీసుకుని నిత్యం పోరాటం చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు బాబు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో వైసీపీ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతోందని, ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమ దారులు ఎంచుకుందని విమర్శించారు. దాని కోసం ఇప్పటి నుంచే కుట్రలు మొదలు పెట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా జరుగుతున్న ఓటరు ధ్రువీకరణ పై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె్న్నాయుడు, టీడీపీ ఎన్నికల కమిటీ సభ్యులతో బాబు పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

గవర్నర్‌ వర్సెస్ గవర్నమెంట్‌

తమిళనాడులో మరోసారి గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ ఫైట్ నడుస్తోంది. ఈ మధ్యే అవినీతి కేసుల్లో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసింది. ఈ కారణంతో బాలాజీని మంత్రిపదవి నుంచి గవర్నర్ తొలగించడం కొత్త వివాదానికి దారి తీసింది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

18 ఏళ్ల తర్వాత ‘చంద్రముఖి’ 2

‘చంద్రముఖి’ సినిమా ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా 2005 లో వచ్చిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. కొన్నేళ్ల తర్వాత ‘నాగవల్లి’ అంటూ ‘చంద్రముఖి’ రిలేటెడ్ స్టోరీతో ఓ సినిమాను విడుదల చేశారు. దీనికి కూడా పి.వాసు యే దర్శకుడు. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమాను కూడా పి.వాసు తెరకెక్కిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఫేవరేట్‌ కారు 

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్ కారు 2020లో మార్కెట్లో లాంచ్ అయింది. టాటా నెక్సాన్ తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా మారింది. కొత్త కస్టమర్లకు ఇది ఫేవరెట్ ఆప్షన్‌గా మారింది. అలాగే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా మారింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వయసు తగ్గించుకున్నట్టు శాస్త్రవేత్త ప్రకటన

వైద్యరంగంలో ఎప్పుడూ ఏదో అద్భుతం జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఓ అద్భుతాన్ని చేసి చూపించాడు హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లైర్. జీవశాస్త్రవేత్త, యాంటీ ఏజింగ్ పరిశోధకుడు అయిన డేవిడ్ సింక్లైర్ ఎంతో కాలంగా వయస్సును తగ్గించడంపై పరిశోధనలు సాగిస్తున్నారు. తాజాగా ఆయన తన వయస్సును పదేళ్లు తగ్గించుకున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget