News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

తమిళనాడు గవర్నర్ సంచలన నిర్ణయం- మంత్రి సెంథిల్ బాలాజీపై వేటు- సీఎం స్టాలిన్ ఆగ్రహం

మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

FOLLOW US: 
Share:

తమిళనాడులో మరోసారి గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ ఫైట్ నడుస్తోంది. ఈ మధ్యే అవినీతి కేసుల్లో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసింది. ఈ కారణంతో బాలాజీని మంత్రిపదవి నుంచి గవర్నర్ తొలగించడం కొత్త వివాదానికి దారి తీసింది. 

గవర్నర్ ఆర్‌ ఎన్‌ రవి తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహంతో ఉన్నారు. అర్థరాత్రి గవర్నర్‌కు లెటర్ రాసిన స్టాలిన్...మంత్రి సెంథిల్ బాలాజీ తొలగింపు అంశాన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేస్తున్నట్టు చెప్పారు. అటార్నీ జనరల్‌ సంప్రదించి న్యాయసలహా తీసుకుంటున్నట్టు వివరించారు. 

ఉద్యోగాలకు నోటు కేసులో అరెస్టైన మంత్రి వి.సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి తప్పిస్తూ గవర్నర్ గురువారం (జూన్ 29) నిర్ణయం తీసుకున్నారు. మనీలాండరింగ్ సహా పలు అవినీతి కేసుల్లో సెంథిల్ బాలాజీ తీవ్రమైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కొంటున్నారని రాజ్ భవన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

మంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేయడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించింది గవర్నర్‌ కార్యాలయం. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న ఓ క్రిమినల్ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

నిరసన వ్యక్తం చేసిన సీఎం స్టాలిన్

గవర్నర్ ఆదేశాలను ప్రభుత్వం చట్టపరంగా సవాల్ చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. ఒక మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించే అధికారం గవర్నర్ రవికి లేదని స్టాలిన్ అన్నారు. దీనిపై ప్రభుత్వం న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. 

సెంథిల్ బాలాజీ అరెస్ట్..
2011 నుంచి 2014 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణ శాఖ మంత్రి ఉన్న సెంథిల్ బాలాజీ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశారని కేసు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని జూన్ 14న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.

అరెస్టు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఛాతీలో నొప్పి రావడంతో సెంథిల్ బాలాజీని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న టైంలో సెంథిల్ బాలాజీని అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఆయన భార్య మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన హైకోర్టు మంత్రి సెంథిల్ బాలాజీని తదుపరి చికిత్స కోసం కావేరీ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించింది. దీంతో కోర్టు సెంథిల్ బాలాజీకి ఈ నెల 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఈలోగా సెంథిల్ బాలాజీ వద్ద ఉన్న శాఖలను మంత్రులు తంగమ్ తెన్నరసు, ముత్తుస్వామికి కేటాయించింది ప్రభుత్వం. ఆయనను పదవి నుంచి మాత్రం తొలగించలేదు. సెంథిల్ బాలాజీని శాఖలు లేని మంత్రిగా కొనసాగిస్తామని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాఖలు లేని మంత్రిగా కొనసాగేందుకు గవర్నర్ నిరాకరించడంతో వివాదం మొదలైంది. 

దీంతో సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గవర్నర్ ఆర్ ఎన్ రవి ఉత్తర్వులు జారీ చేశారు. సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి గవర్నర్ తొలగించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనిని సీఎం స్టాలిన్ సహా పలువురు అధికార పార్టీ నేతలు ఖండించారు. గవర్నర్‌కు అలాంటి అధికారమే లేదని స్పష్టం చేస్తున్నారు. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని తెలియజేస్తున్నారు. 

Published at : 30 Jun 2023 06:49 AM (IST) Tags: Tamil Nadu DMK rn ravi MK Stalin V Senthil Balaji Senthil Balaji Arrest Tamil Nadu Cabinet

ఇవి కూడా చూడండి

చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం

చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం

ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్నట్టుండి మంటలు, చూస్తుండగానే కాలి బూడిదైపోయింది - వైరల్ వీడియో

ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్నట్టుండి మంటలు, చూస్తుండగానే కాలి బూడిదైపోయింది - వైరల్ వీడియో

కార్‌పూలింగ్‌ని బ్యాన్ చేసిన బెంగళూరు, ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా - కారణమిదే

కార్‌పూలింగ్‌ని బ్యాన్ చేసిన బెంగళూరు, ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా - కారణమిదే

Tamilnadu Bus Accident : ఘోర ప్రమాదం, లోయలో పడిన బస్సు, 9 మంది దుర్మరణం

Tamilnadu Bus Accident : ఘోర ప్రమాదం, లోయలో పడిన బస్సు, 9 మంది దుర్మరణం

నవంబర్ నాటికి భారత్‌కి శివాజీ పులిగోళ్ల ఆయుధం, త్వరలోనే లండన్‌కి మహారాష్ట్ర మంత్రి

నవంబర్ నాటికి భారత్‌కి శివాజీ పులిగోళ్ల ఆయుధం, త్వరలోనే లండన్‌కి మహారాష్ట్ర మంత్రి

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్