News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tata Nexon EV: అమ్మకాల్లో దూసుకుపోతున్న టాటా నెక్సాన్ - సేల్స్‌లో కొత్త రికార్డు!

సేల్స్ పరంగా టాటా నెక్సాన్ ఈవీ మోడల్ కొత్త రికార్డును సృష్టించింది.

FOLLOW US: 
Share:

Tata Nexon EV: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్ కారు 2020లో మార్కెట్లో లాంచ్ అయింది. టాటా నెక్సాన్ తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా మారింది. కొత్త కస్టమర్లకు ఇది ఫేవరెట్ ఆప్షన్‌గా మారింది. అలాగే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా మారింది.

కేవలం మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే టాటా నెక్సాన్ 50,000 యూనిట్ల అమ్మకాలు సాధించింది. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఈవీగా నిలిచింది. మొత్తమ్మీద నెక్సాన్, దాని వేరియంట్‌లు దేశీయ మార్కెట్‌లో 15 శాతం అమ్మకాలను సొంతం చేసుకున్నాయి.

టాటా ప్రస్తుతం నెక్సాన్‌కు సంబంధించి విభిన్న మోడళ్లను విక్రయిస్తుంది. ఇందులో ఈవీ ప్రైమ్, ఈవీ మ్యాక్స్ అలాగే దాని డార్క్ ఎడిషన్ ఉన్నాయి. మరోవైపు నెక్సాన్ ఈవీ ప్రైమ్ ధర గురించి చెప్పాలంటే దీనిని ప్రారంభ ధర రూ. 14.49 లక్షలుగా ఉంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 18.79 లక్షలుగా నిర్ణయించారు.

ఈ కారు ఇటీవలే 50,000 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇంతకు ముందు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మరో రికార్డును సృష్టించింది. ఇది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా డ్రైవ్ చేసింది. అంటే 4,003 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 95 గంటల 46 నిమిషాల్లో (4 రోజులలోపు) పూర్తి చేసింది. దీని ద్వారా ఈ కారు అనే నగరాలను తక్కువ కాలంలో కవర్ చేయగలదని ప్రూవ్ అయింది. అదే సమయంలో నెక్సాన్ ఈవీ మ్యాక్స్ 453 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించగలదు. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 453 కిలోమీటర్ల రేంజ్ లభించనుందన్న మాట.

కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం కేవలం మూడు సంవత్సరాలలో 50,000 ఎలక్ట్రిక్ నెక్సాన్‌ల విక్రయం జరిగింది. అంటే ఈ-మొబిలిటీ రంగంలో మార్పు కోసం భారతదేశం ఎంత సిద్ధంగా ఉందో తెలుస్తోంది.

టాటా మోటార్స్ ఇటీవల నెక్సాన్ ఈవీకి కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది, అందులో తాజా తరం హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ కూడా ఉంది. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ వాహనాలైన హారియర్, సఫారీ ఎస్‌యూవీల్లో ఈ ఫీచర్‌ను అందిస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఈ కారు ధర రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎంట్రీ లెవల్ ఎక్స్‌జెడ్+ వేరియంట్ ధర. ఇందులో టాప్ ఎండ్ ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ ట్రిమ్ వేరియంట్ ధర రూ.19.24 లక్షలుగా ఉంది. రెగ్యులర్ నెక్సాన్ ఈవీ ధర రూ.14.79 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.

రెండు సంవత్సరాల క్రితం లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఈవీ కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే వెర్షనే ఈ నెక్సాన్ ఈవీ మ్యాక్స్. ఇందులో ఎక్కువ కెపాసిటీ ఉన్న లిథియం ఇయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. శక్తివంతమైన మోటార్, కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

దీని డిజైన్ రెగ్యులర్ నెక్సాన్ ఈవీ తరహాలోనే ఉంది. ఇంటెన్సీ టియాల్, డేటోనా గ్రే, ప్రిస్టీన్ వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ కొంచెం కొత్తగా ఉండనుంది. 16 అంగుళాల అలోయ్ వీల్స్, ఈవీ మ్యాక్స్ బ్యాడ్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

Published at : 29 Jun 2023 09:52 PM (IST) Tags: Tata Nexon EV Tata Nexon EV Max Tata Nexon EV Sales Record Tata Nexon EV Sales

ఇవి కూడా చూడండి

TVS iQube Sales: టీవీఎస్ బైకులకు పెరుగుతున్న డిమాండ్ - ఏకంగా 67 శాతం వరకు పెరిగిన అమ్మకాలు!

TVS iQube Sales: టీవీఎస్ బైకులకు పెరుగుతున్న డిమాండ్ - ఏకంగా 67 శాతం వరకు పెరిగిన అమ్మకాలు!

Upcoming SUVs in 2024: 2024లో కారు కొనాలనుకుంటున్నారా? - ఈ నాలుగు ఎస్‌యూవీలు ఎంట్రీ ఇస్తున్నాయి - ఒక్కసారి చూడండి!

Upcoming SUVs in 2024: 2024లో కారు కొనాలనుకుంటున్నారా? - ఈ నాలుగు ఎస్‌యూవీలు ఎంట్రీ ఇస్తున్నాయి - ఒక్కసారి చూడండి!

New Kia Sonet Facelift: మరికొద్ది రోజుల్లో కొత్త కియా సోనెట్ - డిజైన్‌లో భారీ మార్పులు!

New Kia Sonet Facelift: మరికొద్ది రోజుల్లో కొత్త కియా సోనెట్ - డిజైన్‌లో భారీ మార్పులు!

Tesla Cybertruck: మోస్ట్ అవైటెడ్ టెస్లా సైబర్ ట్రక్ రేట్ చెప్పిన మస్క్ - అనుకున్నదానికంటే 50 శాతం ఎక్కువగా!

Tesla Cybertruck: మోస్ట్ అవైటెడ్ టెస్లా సైబర్ ట్రక్ రేట్ చెప్పిన మస్క్ - అనుకున్నదానికంటే 50 శాతం ఎక్కువగా!

Mahindra Pending Bookings: మహీంద్రా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్ - దాదాపు మూడు లక్షల వరకు ఆర్డర్లు పెండింగ్‌లో!

Mahindra Pending Bookings: మహీంద్రా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్ - దాదాపు మూడు లక్షల వరకు ఆర్డర్లు పెండింగ్‌లో!

టాప్ స్టోరీస్

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

Fact Check: కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో పాకిస్థాన్ జెండా అంటూ వీడియో వైరల్ - ఇందులో నిజమెంత?

Fact Check: కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో పాకిస్థాన్ జెండా అంటూ వీడియో వైరల్ - ఇందులో నిజమెంత?