అన్వేషించండి
Advertisement
Modi Telangana Tour: వరంగల్ పర్యటనకు ప్రధాని మోదీ, డేట్ ఫిక్స్ - పీఎంవో వెల్లడి
వరంగల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కాజీపేటలోని వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 8న ప్రధాని తెలంగాణలోని వరంగల్ లో పర్యటించనున్నారు. అది అధికార పర్యటన కాగా, రాజకీయపరంగానూ వాడుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.
వరంగల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కాజీపేటలోని వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కుకు కూడా ప్రధాని శంకుస్తాపన చేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాల తర్వాత అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వేళ రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు బాగానే చేస్తోంది. మరోవైపు వచ్చే నెల 8న హైదరాబాద్‌లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion