Chandrababu Naidu: ఇప్పటికే 20 లక్షల దొంగ ఓట్లు, పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు
Chandrababu Naidu: దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని టీడీపీ పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. అక్రమాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
Chandrababu Naidu: ఓటరు జాబితాలో అక్రమాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపును సీరియస్ గా తీసుకుని నిత్యం పోరాటం చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు బాబు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో వైసీపీ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతోందని, ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమ దారులు ఎంచుకుందని విమర్శించారు. దాని కోసం ఇప్పటి నుంచే కుట్రలు మొదలు పెట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా జరుగుతున్న ఓటరు ధ్రువీకరణ పై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె్న్నాయుడు, టీడీపీ ఎన్నికల కమిటీ సభ్యులతో బాబు పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
'20 లక్షల దొంగ ఓట్లు గుర్తించాం'
ఓటరు ధ్రువీకరణ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో భారీగా దొంగ ఓట్లు గుర్తించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా ఫేక్ ఓట్లను గుర్తించామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలాంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారిని కోరుతూ.. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను అందిజేశామని చంద్రబాబుకు నేతలు వివరించారు. చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయించడం, టీడీపీ అనుకూలం అని భావించే వారి ఓట్లను తీసేయడం, ఒక బూత్ లోని ఓట్లను మరో బూత్ లోకి మార్చడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరినట్లు టీడీపీ నాయకులు చంద్రబాబుకు వివరించారు. వైసీపీ దొంగ ఓట్ల అక్రమాలకు పాల్పడటమే కాకుడా.. ఆ నిందను టీడీపీపై వేస్తోందని.. ఈ చర్యను పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో ఓటర్ వెరిఫికేషన్ ను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పారు. అలా వైసీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. అర్హులు కాని వారికి ఓట్ల విషయంలో ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేసే అధికారులు ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని చంద్రబాబు నేతలతో సమీక్ష సందర్భంగా హెచ్చరించారు.
ఒకే ఇంటి నంబర్ తో పదుల సంఖ్యలో ఓట్లు..
ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెరలేపుతున్నట్లు గుర్తించామని టీడీపీ నేత దామచర్ల జనార్దన్ ఆరోపించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే ఇంటి నంబర్ తో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇలా దొంగ ఓట్లు నమోదు చేసేందుకు కొంత మంది అధికారులు వైసీపీ పార్టీకి సహకరిస్తున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ల గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. రేపటి రోజుల్లో సీఎం జగన్ పదవి పోతే మనమే అన్నా క్యాంటీన్ ద్వారా ఇంత కూడు పెడదాం అంటూ కామెంట్లు చేశారు.
పాపం పేదోడు అంట.. ఎవరూ లేరంట..
— Telugu Desam Party (@JaiTDP) June 29, 2023
రేపు సియం పదవి పోతే, తిండికి కూడా ఉండదు పాపం.
రేపు మనం వస్తానే, అన్న క్యాంటీన్ పెట్టి, తిండి పెడదాం#RichestCMJaganVsPoor#NalugellaNarakam#RashtramaaRavanakaashtamaa #ByeByeJaganIn2024 #JaganLosingIn2024 #AndhraPradesh pic.twitter.com/vrPv3VWbZx