అన్వేషించండి

Morning Top News: కూటమి ప్రభుత్వంపై మహాసేన రాజేష్ వాఖ్యలు, రెహమాన్ దంపతుల విడాకులు వంటి మార్నింగ్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Morning Top News:

కాంట్రాక్ట్ ఉద్యోగులకు కోర్టు షాక్
కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ హైకోర్టు జీవో 16ను కొట్టేసింది. గత BRS ప్రభుత్వం జీవో 16 ద్వారా వేలాది మందిని రెగ్యులరైజ్‌ చేసింది. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో తిరిగి వారిని కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా కొనసాగించవచ్చని కోర్టు తెలిపిందని పిటిషనర్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
లొంగిపోయిన లగచర్ల కేసు నిందితుడు
 వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో ఏ2గా ఉన్న కీలక నిందితుడు సురేశ్ మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో సురేశ్ ను పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కాగా ఘటన జరిగిన నాటి నుంచి నిందితుడు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం
కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభలో 'మాది మహిళల రాజ్యం అని గర్వంగా చెబుతున్నా' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. వరంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి, కేసీఆర్ కాస్కో అంటూ సవాల్ విసిరారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
విశాఖలో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
విశాఖలో మరో దారుణం చోటుచేసుకుంది. నలుగురు యువకులు లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా నగ్నంగా వీడియోలు తీసి బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విశాఖ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
అవినాష్‌రెడ్డికి సుప్రీం నోటీసులు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నేత, ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. అవినాష్‌ బెయిల్‌ రద్దు చేయాలని వివేకా కూతురు వైఎస్ సునీత వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని డాక్టర్ చైతన్య రెడ్డి జైలులో బెదిరించాడని సునీత తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో ప్రతివాదులైన అవినాష్ రెడ్డి, చైతన్య రెడ్డికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
కూటమి ప్రభుత్వంలో తప్పుడు కేసులు: మహాసేన రాజేష్
టీడీపీ అధికార ప్రతినిధి, మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో తప్పుడు కేసులు భరించానని, ఇప్పుడు తమ ప్రభుత్వంలోనూ తనపై మహిళలను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మలికిపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.. తప్పుడు కేసులతో బదనాం చేస్తున్నారని రాజేష్‌ అన్నారు.
 
రైతులకు పరిహారం ఇవ్వాలన్న పరిటాల సునీత

వైసీపీ చేతకానితనం వల్ల గత ఐదేళ్లుగా రాప్తాడు నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. పేరూరు ప్రాజెక్టుతో పాటు పీఏబీఆర్ పరిధిలోని రైతులు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలని అసెంబ్లీలో పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 
అయ్యప్ప భక్తులకు శుభవార్త.. 26 స్పెషల్ ట్రైన్స్!
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం, కొల్లాం మధ్య మొత్తం 10 సర్వీసులు నడపనున్నారు. మౌలాలి, కొల్లాం మధ్య 12 సర్వీసులను ఏర్పాటు చేశారు. రైళ్ల టైమింగ్స్ కోసం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్ సైట్‌లో చూడవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
అన్ని ప్రాంచైజీల చూపు.. పంత్ వైపే
ఐపీఎల్ 2025 వేలానికి సమయం సమీపిస్తోంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో సూపర్ ప్లేయర్లను దక్కించుకోవాలని ప్రాంచైజీలు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం వేలంలో అన్నీ ఫ్రాంచైజీల తొలి ప్రాధాన్యం మాత్రం కచ్చితంగా రిషభ్ పంతే అని మాజీలు అంటున్నారు. పంత్ పోరాట తత్వం, వికెట్ కీపింగ్ స్కిల్స్, , ఫైరింగ్ గేమ్, ఏ జట్టుకైనా అడ్వాంటేజ్ అవుతాయని.. పంత్ కోసం పోటాపోటీ తప్పదని అంటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
29 ఏళ్ల తర్వాత రెహమాన్ దంపతుల విడాకులు 
లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన వార్త సంచలనం సృష్టిస్తోంది. తన భర్త ఏఆర్ రెహమాన్ తో విడిపోతున్నట్లు ‌ భార్య సైరా బాను ప్రకటించారు. 29 ఏళ్ల తర్వాత వీరిద్దరూ వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కుటుంబ జీవితంలో వేదనతో తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా వెల్లడించారు. ఈ క్లిష్టమైన పరిస్థితులను అర్థం చేసుకుని తనకు అండగా ఉండాలని కోరారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget