అన్వేషించండి

Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు

TG high court quashes GO 16 | కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఆ ఉద్యోగులు మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుతారు.

TG High Court quashed GO 16 of regularisation of contract employees హైదరాబాద్: రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 16 ద్వారా గత BRS ప్రభుత్వం వేలాది మందిని రెగ్యులరైజ్‌ చేసింది. ముఖ్యంగా విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. తాజాగా హైకోర్టు సంచలన తీర్పుతో రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్ట్‌ ఉద్యోగుల భవితవ్యం మళ్లీ ఆందోళనలో పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేసిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా కొనసాగించాల్సి ఉంటుందని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది పిటిషనర్లు తెలిపారు. అయితే దీనిపై హైకోర్టు నుంచి తమకు ఆర్డర్‌ కాపీ వస్తే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇకపై ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం కుదరదు

ఎన్నో ఏళ్లుగా సగం జీతానికే సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి, మా కుటుంబ సమస్యలు తెలుసుకుని జాబ్ పర్మినెంట్ చేయాలి... ఇదే మాట కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి తరచుగా వింటూనే ఉంటాం. కొన్నిసార్లు ప్రభుత్వాలు వారిపై సానుకూల నిర్ణయాలు తీసుకుని రెగ్యూలరైజ్ (ఉద్యోగాల క్రమబద్ధీకరణ) చేస్తాయి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల్ని గుర్తించి, వారి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి సెక్షన్ 10ఏ ప్రకారం జీవో 16 తీసుకొచ్చింది. దీని ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం పర్మినెంట్ చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది.

అయితే నియామక పరీక్షలు నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలి కానీ, నేరుగా వారిని రెగ్యూలరైజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం నేడు విచారించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. దాంతో రెగ్యూలరైజ్ అయిన ఉద్యోగులు మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారనున్నారు. ఏళ్ల తరబడి పడుతున్న వారి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయని చెబుతున్నారు.

Also Read: Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఒక్క నెలలో మిగతా పోస్టుల భర్తీ సాధ్యమా?

కాగా, తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీతో యువత, నిరుద్యోగులు హస్తం పార్టీకి అభయహస్తం ఇచ్చి ఓటు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరుసగా నియామకాల పత్రాలు అందిస్తూ వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే 50, 60 వేల వరకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ లో నిర్వహించగా, వచ్చే నెలలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరగనుంది. గ్రూప్ 4 మెరిట్ జాబితా అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి ఇటీవల తుది జాబితాను విడుదల చేయడం తెలిసిందే.

Also Read: TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్‌' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్‌' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
Embed widget