Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్ న్యూస్
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..
Top 10 Headlines Today:
తెలంగాణ ఉద్యమ ఘట్టాలు
1969లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆగిపోయింది. ఆ తరువాత మలిదశ ఉద్యమానికి 1983లో హియాయత్ నగర్ ఎన్నికలు నాంది పలికాయి. ఆపై మలిదశ ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ స్థాపనతో 2001లో ప్రారంభమైనప్పటికీ.. 2009 తరువాతే ఉద్యమం ఎన్నో మలుపులు తిరిగింది. చారిత్రక ఘటనలు జరిగాయి. చివరగా 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ జూన్ 2తో 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ ఏటకు తెలంగాణ రాష్ట్రం అడుగుపెట్టనుంది. అయితే తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు ఇవే. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టర్ వార్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్దం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. మూడు పార్టీల శ్రేణులు ఫ్లెక్సీల ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఒక పార్టీ పై మరో పార్టీ నినాదాలు..వ్యంగాస్త్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వివాదానికి కారణం అవుతోంది. పొత్తుల రాజకీయం తేలకముందే ఇప్పుడు వైసీపీ వర్సస్ జనసేన పొలిటికల్ వార్ షురూ అయింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చల్లని వాతావరణం
నిన్న ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు కూడా పశ్చిమ విదర్భ నుండి మరత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మి ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం (మే 31) ఓ ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజులు గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్, చుట్టూ పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరో 13 మంది డీబార్
పేపర్ లీకేజీ కేసును సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. వరుస అరెస్టులు కొనసాగుతుండగా కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన వారిలో 13 మందిని డీబార్ చేస్తూ టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో వారు టీఎస్ పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలు రాసేందుకు అనర్హులు అవుతారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన వారిలో 37 మందిని మంగళవారం కమిషన్ డీబార్ చేయడం తెలిసిందే. తాజాగా బుధవారం మరో 13 మందిని జీవితంలో ఏ టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ రాయకుండా అనర్హత వేటు వేసింది కమిషన్. ఏమైనా అభ్యంతరాలుంటే నిందితులకు వివరణకు 2 రోజులు గడువు ఇచ్చినట్లు నోటీసులలో పేర్కొంది టీఎస్ పీఎస్సీ. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని నోటిఫికేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన పది జిల్లాల్లోని 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 3 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ద్వారా మెయిన్స్ పరీక్షలు రాసేందుకు 6,455 మంది అర్హత సాధించారని గౌతమ్ సవాంగ్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఊబకాయం ఉన్నవారి విషయంలో బీమా కంపెనీల జాగ్రత్త
ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా అవసరం అన్నంతగా కాలం మారింది. అయితే, మన దేశంలో ఇప్పటికీ చాలామంది లేదా చాలా కుటుంబాలు హెల్త్ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉన్నాయి. దీనికి కారణం అధిక ప్రీమియం. ఆరోగ్య బీమా అంటే కేవలం ఆరోగ్యానికే కాదు, మన ఆర్థిక పరిస్థితికి కూడా చాలా ముఖ్యమైనది. కరోనా తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. వాస్తవానికి ఫిట్‌నెస్ - హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. మీ ఆరోగ్యమే మీ డిస్కౌంట్ కూపన్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విషాదం
తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరదయ్యపాలెం మండలం, ఎల్లకట్టవా గ్రామ శివారులో టపాకాయల గోడౌన్ లో ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చేందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న వరదయ్యపాలెం పోలీసులు అగ్నిమాపక యంత్రంతో మంటల అదుపు చేసి మృతదేహాలను వెలికి తీశారు. టపాకాయలను సర్దుతుండగా ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఖైరతాబాద్ గణేషుడి వేడుక పని ప్రారంభం
వినాయక చవితి దగ్గర పడుతున్నందన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణానికి 2023 మే 31 బుధవారం రోజున అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాటు కోసం కర్రపూజను సాయంత్రం 5 గంటలకు నిర్వహించారు. ఈ పూజతో గణనాథుడి విగ్రహ నిర్మాణ పని ప్రారంభమైంది. ఈ ఏడాది 51 అడుగుల ఎత్తైన మట్టి గణపతి విగ్రహాన్ని ప్తిష్టించనున్నారు. ఆలాగే వచ్చేవారం వినాయకుడికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పెళ్లి కలలు
నిద్ర పోయే అందరూ తప్పకుండా కలలు కంటూనే ఉంటారు. కొన్ని కలలు మన భయాలకు సంకేతాలయితే కొన్ని మనలోని ఆలోచనలకు. వీటికి భిన్నంగా కొన్ని భవిష్యత్తుకు సూచికలు కావచ్చని స్వప్నశాస్త్రం చెబుతోంది. ఇవి నిద్రలో చూసే కలల గురించిన విషయాలను గురించి స్వప్నశాస్త్రం వివరిస్తుంది. మరి కొన్ని కలలుంటాయి. అవి మనం మెలకువగా ఉండే కనే కలలు, మన ఆశలకు ప్రతిరూపాలు. అవి నెరవేర్చుకోవడమే లక్ష్యంగా జీవితం నడుస్తుంది. అలాంటి కలల్లో ఒకటి జీవిత భాగస్వామిని గురించినవి. కోరుకున్న భాగస్వామి లేదా ఆశించిన లక్షణాలు కలిగిన వ్యక్తి వంటి ఏవేవో కొన్ని స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం
జూన్ నెలలో కొన్ని రాశులవారికి మంచి ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి