News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

TSPSC Paper Leak Case: పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన వారిలో 13 మందిని డీబార్ చేస్తూ టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో వారు టీఎస్ పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలు రాసేందుకు అనర్హులు అవుతారు.

FOLLOW US: 
Share:

TSPSC Paper Leak Case: పేపర్ లీకేజీ కేసును సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. వరుస అరెస్టులు కొనసాగుతుండగా కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన వారిలో 13 మందిని డీబార్ చేస్తూ టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో వారు టీఎస్ పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలు రాసేందుకు అనర్హులు అవుతారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన వారిలో 37 మందిని మంగళవారం కమిషన్ డీబార్ చేయడం తెలిసిందే. తాజాగా బుధవారం మరో 13 మందిని జీవితంలో ఏ టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ రాయకుండా అనర్హత వేటు వేసింది కమిషన్. ఏమైనా అభ్యంతరాలుంటే నిందితులకు వివరణకు 2 రోజులు గడువు ఇచ్చినట్లు నోటీసులలో పేర్కొంది టీఎస్ పీఎస్సీ. 

ఉద్యోగ నియామకాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, 2, 3, గ్రూప్ 4 తో పాటు ప్రభుత్వ శాఖలకు ఎగ్జామ్స్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. గత ఏడాది గ్రూప్ 1, 2, 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు రాగా, ఒక్కొక్కటిగా పరీక్షలు నిర్వహించారు. అయితే గత ఏడాది అక్టోబర్ నెలలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలైన కొన్ని రోజులకు ఆ ఫలితాలను టీఎస్ పీఎస్సీ రద్దు చేసింది. కారణం.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు, ఏఈ, ఏఈఈ, డీఏఓ ఎగ్జామ్ పేపర్లు లీకైనట్లు కమిషన్ అధికారులు గుర్తించారు. కొన్ని ఎగ్జామ్ లను నిర్వహించడానికి ముందే రద్దు చేయగా, గ్రూప్ 1, డీఏఓ, ఏఈ లాంటి ఎగ్జామ్స్ ను పరీక్ష నిర్వహించిన కొన్ని రోజులకు టీఎస్ పీఎస్సీ రద్దు చేసినట్లు ప్రకటించింది. 

ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్, ప్రభుత్వ ఉద్యోగి రేణుకల నుంచి ఒక్కొక్క పేపర్ లీకయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అరెస్టైన రేణుకకు బెయిల్ రావడంతో విడుదలైంది. ఇప్పటివరకూ దాదాపు 50 మంది పేపర్ లీక్ కేసులో అరెస్ట్ కాగా, మరికొందరి వివరాలను సిట్ సేకరిస్తోంది. అయితే సిట్ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. ప్రవీణ్, రేణుకలు వేర్వేరుగా కొంత మందిని ఎగ్జామ్ పేపర్లను విక్రయించగా.. వారి నుంచి పేపర్లు కొన్నవారు సైతం తమ డబ్బును రాబట్టుకునేందుకు విక్రయించడంతో ఇది చైన్ ప్రాసెస్ గా మారినట్లు అధికారులు తెలిపారు. 

ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. ఏఈఈ ఎగ్జామ్ పేపర్ లీకేజీలో సిట్ అధికారులు కీలక విషయాలు గుర్తించి షాకయ్యారు. ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ రాసిన ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ అయ్యారు. ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రమేష్ ద్వారా ఏఈఈ పేపర్ ను నిందితులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

ప్రత్యేక దర్యాప్తు టీమ్ (SIT) టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే 45 మందిని అరెస్టు చేయగా, సోమవారం మరో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు దాంతో TSPSC Paper Leak కేసులో మెుత్తం అరెస్టుల సంఖ్య 48కు చేరుకుంది. అరెస్టయిన వారిలో సైతం ఏఈఈ పేపర్ కొనుగోలు చేసిన వారే ఉన్నారు. ఆదివారం రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా, అతడు రవికిషోర్ నుంచి ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పేపర్లను కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించాడు.

Published at : 31 May 2023 08:53 PM (IST) Tags: ABP Desam breaking news

ఇవి కూడా చూడండి

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

TS TET 2023 Results: టీఎస్ టెట్‌-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు

TS TET 2023 Results: టీఎస్ టెట్‌-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

టాప్ స్టోరీస్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?

Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?