News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. మెయిన్స్ పరీక్షలకు 6,455 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.

FOLLOW US: 
Share:

➦ పరీక్షలకు హాజరుకానున్న 6,455 మంది అభ్యర్థులు

➦ ట్యాబ్‌ల ద్వారా కాకుండా అభ్యర్థులకు ప్రశ్నపత్రం 

➦ ఆగస్టులోగా నియామకాల ప్రక్రియ పూర్తి

➦ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన పది జిల్లాల్లోని 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 3 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ద్వారా మెయిన్స్ పరీక్షలు రాసేందుకు 6,455 మంది అర్హత సాధించారని గౌతమ్ సవాంగ్ తెలిపారు. 

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఏపీపీఎస్సీ కార్యాలయంలో బుధవారం (మే 31) ఆయన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు ప్రశ్నపత్రం అందిస్తామని, సాంకేతిక సమస్యలు ఉన్నందున గతంలోలా ట్యాబ్‌లలో ప్రశ్నపత్రాలు ఇవ్వట్లేదని తెలిపారు. పరీక్షలు జరిగే తీరును ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి చూసేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సవాంగ్ వెల్డలించారు. కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌కు దూరంగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సవాంగ్ తెలిపారు. 

గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ..
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ 3 నుంచి 10 నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు తీస్తారు. ఉదయం 9.30 గంటల్లోగా అభ్యర్థులు తమ తమ గదులకు వెళ్లాలి. ఆ తర్వాత 15 నిమిషాల వరకు వెసులుబాటు ఉంటుందన్నారు. 9.45 నిమిషాలు దాటితే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించరని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. జులై నెలాఖరునాటికి ఫలితాలు ప్రకటించి, ఆగస్టులోగా మౌఖిక పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు.

పరీక్షల షెడ్యూలు ఇలా..


* మెయిన్ పరీక్ష విధానం:

మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 75 మార్కులు పర్సనాలిటీ టెస్టుకు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. 

పేపర్-1 (జనరల్ ఎస్సే): 150 మార్కులు

* పేపర్-2 (హిస్టరీ & కల్చర్ & జియోగ్రఫీ ఇండియా/ఏపీ): 150 మార్కులు

పేపర్-3 (పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు 

* పేపర్-4 (ఎకానమీ & డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా/ఏపీ): 150 మార్కులు

పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు 

తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలు కూడా ఉంటాయి కాని, ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే.

ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష జనవరి 8న నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా.. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి జనవరి 8న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ జనవరి 27న విడుదల చేసింది. ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.  ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఎంపికచేశారు. వాస్తవానికి గ్రూప్-1 కింద అన్ని రకాలు భర్తీ చేయాల్సిన పోస్టులు 111 ఉన్నాయి. దీని ప్రకారం 5,550 మందిని ప్రధాన పరీక్షలకు ఎంపిక చేయాలి. కానీ... ఒకరి కంటే ఎక్కువ మందికి ఒకే మార్కులు రావడం, సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలోనూ సంఖ్య పెరిగింది.

గ్రూప్-1 నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి.. 

'గ్రూప్-1' ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్, పోస్టుల సంఖ్య పెరిగిందోచ్! ఎన్ని పోస్టులంటే!

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 31 May 2023 11:50 PM (IST) Tags: APPSC Group1 Mains Schedule APPSC Group1 Mains Halltickets APPSC Group1 Mains dates APPSC Group1 Mains Exam Centers

ఇవి కూడా చూడండి

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

UPSC CAPF Result: యూపీఎస్సీ- సీఏపీఎఫ్‌ 2023 రాత పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

UPSC CAPF Result: యూపీఎస్సీ- సీఏపీఎఫ్‌ 2023 రాత పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

UPSC NDA Results 2023: యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ-2 2023 రాతపరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!

UPSC NDA Results 2023: యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ-2 2023 రాతపరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!

CIPET: సీపెట్‌ భోపాల్‌లో లెక్చరర్ పోస్టులు, వివరాలు ఇలా

CIPET: సీపెట్‌ భోపాల్‌లో లెక్చరర్ పోస్టులు, వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?