అన్వేషించండి

APPSC Group1: 'గ్రూప్-1' ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్, పోస్టుల సంఖ్య పెరిగిందోచ్! ఎన్ని పోస్టులంటే!

గ్రూప్-1 నోటిఫికేషన్‌లో పేర్కొన్న 92 పోస్టులకు అదనంగా మరో 19 పోస్టులను కలుపుతున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. మారిన పోస్టులతో సవరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

'గ్రూప్-1' ఉద్యోగార్థులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్ తెలిపింది. గ్రూప్-1 పోస్టుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 6న అధికారిక ప్రకటన విడుదల చేసింది. మారిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్‌లో పేర్కొన్న 92 పోస్టులకు అదనంగా మరో 19 పోస్టులను కలుపుతున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. 2018 నోటిఫికేషన్ అనుసరించి నియమించిన వారిలో కొందరు విధుల్లో చేరనందున మిగిలిన 17 పోస్టులకు, భర్తీకాని మరో రెండు పోస్టులను ప్రస్తుత నోటిపికేషన్‌కు కలిపినట్లు వెల్లడించింది.

Notification

ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి..

ఏపీలో జనవరి 8న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. గ్రూప్-1 పరీక్షకు 1,26,499 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను మూడు వారాల్లోనే వెల్లడించనున్నారు.  'గ్రూప్-1' ప్రిలిమినరీ ఫలితాలు వచ్చిన 90 రోజుల్లోగా మెయిన్స్ పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత ఇంటర్వ్యూలు పూర్తిచేసి ఆగస్టు నాటికి నియామకాలు పూర్తిచేయనున్నారు.

'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి.. 

పరీక్ష కేంద్రాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

రాష్ట్రంలో ఇప్పటికే 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి అక్టోబరు 1న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 13 నుంచి నవంబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు.  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 8న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.

గ్రూప్-1 నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి.. 

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
➥ అభ్యర్థులు తమకు ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే, సూచించిన ప్రకారం అన్ని ప్రశ్నలు ఉన్నాయో లేదో చెక్ చేకోవాలి.   

➥ ప్రశ్నపత్రంలో మొత్తం 4 (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి, పార్ట్-డి) విభాగాలుంటాయి. 'పార్ట్-ఎ'లో హిస్టరీ & కల్చర్, 'పార్ట్-బి'లో కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ & ఇంటర్నేషనల్ రిలేషన్స్, 'పార్ట్-సి'లో ఇండియన్ & ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్, 'పార్ట్-డి'లో జాగ్రఫీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగానికి 30 మార్కుల చొప్పున మొత్తం 120 మార్కులు ఉంటాయి.  

➥ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.

➥ ఓంఎఆర్ షీటులో సమాధానాలను బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతో మాత్రమే సమాధానాలు గుర్తించాలి (సర్కిల్ పూరించాలి). అనవసరపు  గుర్తులు పెట్టకూడదు. వైట్నర్ వాడకం నిషేధం.

➥ సమాధాన పత్రం నింపడానికి కూడా బ్లూ/బ్లాక్ పెన్ను మాత్రమే వాడాలి. జెల్ పెన్నులు, ఇంక్ పెన్నులు, పెన్సి్ల్స్ వాడకూడదు.

➥ సమాధాన పత్రం (ఓఎంఆర్ ఆన్సర్ షీటు)లో నిర్దేశించిన ప్రదేశంలో అభ్యర్థి సంతకంతోపాటు, ఇన్విజిలేటర్ సంతకం కూడా తప్పనిసరిగా ఉండాలి. సంతకాలు లేని సమాధానపత్రాలు పరిగణనలోకి తీసుకోరు. 

➥ ఓఎంఆర్ ఆన్సర్ షీటు మీద ఏదైనా రఫ్ వర్క్ గాని, గీతలు గీయడం గాని, చింపడం, పిన్ చేయడం లాంటివి చేయకూడదు.

➥ ఓఎంఆర్ షీటులో జవాబులు మార్చడానికి వైట్నర్, బ్లేడు, రబ్బరు లేదా ఏ విధమైన దిద్దుబాటు చర్యలు చేసినా సమాధానపత్రాలను పరిశీలించరు.  

➥ ఇచ్చిన ప్రశ్నలకు బుక్‌లెట్‌లో జవాబులు గుర్తించకూడదు. ఓఎంఆర్ షీటులో మాత్రమే సమాధానాలు రాయాలి. దీన్ని తీవ్రంగా పరిగణిస్తారు. 

➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు, మ్యాథ్స్/లాగ్ టేబుల్స్, మొబైల్‌ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఆభరణాలు కూడా వేసుకురాకపోవడం మంచిది.

➥ పరీక్ష సమయం ముగిసిన తర్వాతనే అభ్యర్థులను బయటకు పంపుతారు. పరీక్ష మధ్యాలో ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు అనుమతించరు.

➥ పరీక్షలో కాపీ/చీటింగ్‌కు పాల్పడినట్లయితే పరీక్ష నుంచి బహిష్కరిస్తారు. 

➥ రఫ్ వర్కును ప్రశ్నపత్రం చివరి పేజీలో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.

➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్న కారణంగా జవాబులు జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాకి 0.3 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
ACC Trophy Standoff: పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
Pulivendula Firing: పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?
FASTag బ్యాంక్ మీకు నచ్చలేదా? ఇక స్టిక్కర్ మార్చే పని లేకుండానే బ్యాంక్‌ను మార్చేయొచ్చు
Jai Jai Ram Song: రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
Trophy Celebrations Viral Video: పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
Embed widget