అన్వేషించండి

APPSC Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ వెల్లడి, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

జనవరి 8న గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఉ.10 నుంచి మ.12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ప్రకటించింది. జనవరి 8న గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. మొత్తం 18 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి డిసెంబరు 31 నుంచి హాల్‌టికెట్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

APPSC Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ వెల్లడి, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

పరీక్ష విధానం..

ప్రిలిమినరీ పరీక్ష: 
మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 120 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.   ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 30 మార్కులు కేటాయించారు. అదేవిధంగా 120 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి 60 మార్కులు కేటాయించారు. 

* మెయిన్ పరీక్ష:
మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 75 మార్కులు పర్సనాలిటీ టెస్టుకు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. 
* పేపర్-1 (జనరల్ ఎస్సే): 150 మార్కులు
* పేపర్-2 (హిస్టరీ & కల్చర్ & జియోగ్రఫీ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-3 (పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు 
* పేపర్-4 (ఎకానమీ & డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు 
* తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలు కూడా ఉంటాయి కాని, ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే    

పరీక్ష స్వరూపం, సిలబస్ వివరాలు...

పోస్టుల వివరాలు...

మొత్తం ఖాళీల సంఖ్య: 92 (క్యారీడ్ ఫార్వర్డ్-02, కొత్తవి-90).

విభాగాలవారీగా ఖాళీలు:

1) డిప్యూటీ కలెక్టర్:10 పోస్టులు
విభాగం: ఏపీ సివిల్‌ సర్వీస్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్).
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-రూ.1,51,370.

2) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 12 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ టాక్స్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-రూ.1,51,370.

3) డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు (సివిల్) క్యాట్-2: 13 పోస్టులు
విభాగం: ఏపీ పోలీస్ సర్వీ్స్. 
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-రూ.1,51,370.

4) డిప్యూటీ సూపరింటెండెంట్ జైల్స్ (మెన్): 02 పోస్టులు
విభాగం: ఏపీ జైల్ సర్వీస్.
అర్హత:  బ్యాచిలర్స్ డిగ్రీ. 
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.

5) డివిజనల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్: 02 పోస్టులు
విభాగం: స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్&ఫైర్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్-ఫైర్)/బీఈ(ఫైర్)
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.

6) అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్: 08 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.

7) రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్: 02 పోస్టులు
విభాగం: ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్. 
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.  
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.

8) మండల్ పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 07 పోస్టులు
విభాగం: ఏపీ పంచాయత్ & రూరల్ డెవలప్‌మెంట్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.

9) డిస్ట్రిక్ట్ రిజిస్టార్స్: 03 పోస్టులు
విభాగం: ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.

10) డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫిసర్: 01పోస్టు
విభాగం: ఏపీ ట్రైబల్ వెల్ఫే్ర్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.

11) డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ బీసీ వెల్ఫే్ర్ సర్వీస్. 
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.

12) మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 06 పోస్టులు
విభాగం: ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.

13) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ లే సెక్రటరీ & ట్రెజరర్ గ్రేడ్-II: 18 పోస్టులు.
విభాగం: ఏపీ మెడికల్ అండ్ హెల్త్ (అడ్మినిస్ట్రేషన్) సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.

14) డిప్యూటీ రిజిస్ట్రార్: 01 పోస్టు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.

15) అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 04 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్. 
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.

గ్రూప్-1 నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

తెలంగాణలో 783 పోస్టుల‌తో గ్రూప్ – 2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌
తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం కానుక‌ను అందించింది. 783 పోస్టుల‌తో గ్రూప్ -2 నోటిఫికేష‌న్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. జ‌న‌వ‌రి 18 నుంచి అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. గ‌తంలో 1032 పోస్టుల‌ను గ్రూప్-2 కింద భ‌ర్తీ చేసిన సంగ‌తి తెలిసిందే.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Embed widget