Tirupati Fire Accident: టపాసుల గోడౌన్ లో అగ్నిప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
Tirupati Fire Accident: తిరుపతి జిల్లాలో విషాదం. వరదయ్యపాలెం మండలం, ఎల్లకట్టవా గ్రామ శివారులో టపాకాయల గోడౌన్ లో ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చేందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Tirupati Fire Accident: తిరుపతి జిల్లాలో విషాదం.. టపాసుల గోడౌన్ లో అగ్నిప్రమాదం..
సంఘటన స్థలంలోనే ముగ్గురు మృతి.. మరో ఇద్దరికి గాయాలు..
తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరదయ్యపాలెం మండలం, ఎల్లకట్టవా గ్రామ శివారులో టపాకాయల గోడౌన్ లో ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చేందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న వరదయ్యపాలెం పోలీసులు అగ్నిమాపక యంత్రంతో మంటల అదుపు చేసి మృతదేహాలను వెలికి తీశారు. టపాకాయలను సర్దుతుండగా ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదంలో నాగేంద్ర (26), శంకరయ్య (56), ఏడుకొండలు (41) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించగా, కళ్యాణ్ అనే వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతుండగా, టపాసుల గోడౌన్ యజమాని వీరయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. గోడౌన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలైన వారిని బుచ్చి నాయుడు కండ్రిగ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఎల్లకట్టవా గ్రామ శివారులో మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల ప్రాంతంలో టాపాసుల గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసు అక్కడికి చేరుకోవడంతో పాటు అగ్నిమాపక సిబ్బందికి అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వీర రాఘవులుకు క్రాకర్స్ సైలెన్స్ ఉందని, వచ్చే ఏడాదికి లైసెన్స్ రెన్యూవల్ చేసుకున్నారు. తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా.. బయటి నుంచి కొందరు వ్యక్తులు, స్థానికులు ఒకరిద్దరితో కలిసి అక్కడ ఇల్లీగల్ గా క్రాకర్స్ తయారు చేస్తున్నారని గుర్తించినట్లు చెప్పారు. బయటి నుంచి మందుగుండు తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ఎల్లకట్టవా సమీపంలోని గోడౌన్ లో అగ్నిప్రమాదం జరగడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరికి కాలిన గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, ఘటనకు కారణాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.