News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

ఖైరతాబాద్ గణపతి విగ్రహ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఈ సారి 52 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు.

FOLLOW US: 
Share:

Khairatabad Ganesh :   వినాయక చవితి దగ్గర పడుతున్నందన   ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణానికి  2023 మే 31 బుధవారం రోజున అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాటు కోసం కర్రపూజను సాయంత్రం 5 గంటలకు నిర్వహించారు. ఈ పూజతో గణనాథుడి విగ్రహ నిర్మాణ పని ప్రారంభమైంది. ఈ ఏడాది 51 అడుగుల ఎత్తైన మట్టి గణపతి విగ్రహాన్ని ప్తిష్టించనున్నారు. ఆలాగే వచ్చేవారం వినాయకుడికి సంబంధించిన పోస్టర్ ను  రిలీజ్ చేయనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. 

గత ఏడాది  పంచ‌ముఖ మ‌హాల‌క్ష్మి గ‌ణ‌ప‌తిగా భక్తులకు దర్శనమిచ్చారు.  ఎడ‌మ‌వైపున శ్రీ తిశ‌క్తి మ‌హా గాయ‌త్రి దేవి, కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి విగ్ర‌హాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది  50 అడుగుల ఎత్తులో నిర్మించారు.  ఖైర‌తాబాద్ గ‌ణేషుడిని గత ఏడాది తొలిసారి మ‌ట్టితో రూపొందించారు. ఈ సారి కూడా మట్టి విగ్రహమే ఏర్పాటు చేశారు.  వినాయక చవితి పండుగను తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తారు. గణేష్‌ చవితి అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడే. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహాగణపతి.. ఈ ఏడాది కూడా భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి మట్టితో తయారు చేయనున్నారు.       

మట్టి విగ్రహం కావడంతో  మొదట ఐరన్‌ ఫ్రేమ్‌తో అవుట్‌లైన్‌ తయారు చేస్తారు. అనంతరం దానిపై  గడ్డిని మట్టితో కలిపి నారలాగా తయారుచేసి ఐరన్‌ చుట్టూ ఔట్‌ లుక్‌ కోసం అంటిస్తారు. దానిపై టన్నుకు పైగా సుతిలి తాడును చుడతారు. దానిపై మట్టితో రూపు రేఖల్ని తీర్చి దిద్దుతారు.   ఆ తర్వాత గాడా క్లాత్‌పై పల్చటి మట్టిని పూసి ఫినిషింగ్‌ పనులు పూర్తి చేసి.. వాటర్‌ పెయింట్స్‌ వేయడంతో మట్టి వినాయకుడు పూర్తిస్థాయిలో పూర్తవుతుంది. విగ్రహాన్ని నిమజ్జనం చేయడంలోనూ ఇబ్బందులు తలెత్తవని నిర్వాహకులు చెబుతున్నారు.                                                                

1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైన గణేశుడి చరిత్ర 60 అడుగుల ఎత్తు వరకు కొనసాగింది. గడిచిన 67 సంవత్సరాల్లో ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ పీవోపీ గణపతిని విభిన్న రూపాల్లో ప్రతిష్టిస్తూ వస్తున్నారు.  67 సంవత్సరాలుగా ఖైరతాబాద్‌ మహా గణపతి పీవోపీ ద్వారా రూపుదిద్దుకుంటున్నాడు. గత ఏడాది మొట్ట మొదటిసారిగా మట్టితో శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిని ప్రతిష్టించారు. ఈ సారి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నారో  వచ్చే వారంలో ప్రకటించనున్నారు.                                                 

Published at : 31 May 2023 06:28 PM (IST) Tags: Hyderabad News Khairatabad Ganesh Khairatabad Ganpati

ఇవి కూడా చూడండి

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

TS TET 2023 Results: టీఎస్ టెట్‌-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు

TS TET 2023 Results: టీఎస్ టెట్‌-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

టాప్ స్టోరీస్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?

Salaar Release : డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?