Morning Top News: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Morning Top News:
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఈ రోజు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఓ జాతీయ మీడియా నిర్వహించనున్న లీడర్‌షిప్ సదస్సులో బాబు పాల్గొంటారు. అయితే సీఎం ఈ ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరై మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి 1.30 గంటలకు ఢిల్లీకి ప్రయాణమవుతారు. ఈ పర్యటనలో కేంద్ర ఆర్థికమంత్రి సహా పలువురు మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
లగచర్ల దాడి ఘటనలో పోలీసులు తాను పేర్కొంటున్నట్లు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు పూర్తిగా తప్పని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జైలు నుంచి సంచలన లేఖ విడుదల చేశారు. నేను ఎవరి పేరూ చెప్పలేదు. కావాలనే అలా రిమాండ్ రిపోర్ట్ సృష్టించారన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతల స్వీకరణ
‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎంత సంచలనం సృష్టించిందో.. రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామ అంత సంచలనం సృష్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. తెలుగుబిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘురామ.. స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారు. కొత్త పదవిలో ఆయన్ని చూస్తే సంతోషంగా ఉందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం స్థానిక సంస్థల ఉప ఎన్నికను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు పేర్కొంది. ఈనెల 28వ తేదీ ఈ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? : కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన సొంత నియోజకవర్గంపై కూడా పట్టులేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొడంగల్ లో ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. తాము సీఎం నియోజకవర్గంలోనే కలెక్టర్ పై దాడి చేసేంత బలమైన వ్యక్తులమా? అని నిలదీశారు. ఫోర్త్ సిటీ, ఏఐ సీటి అని సీఎం రేవంత్ మాటలు చెబుతున్నారు.. కానీ అవి సాధ్యం కాదన్నారు. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన
సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితిని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్ - 18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్
కెనడాలో ఖలీస్థానీ సపోర్టులు ఇప్పుడు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. కెనడా మాదే అని, అక్కడ ఉంటున్న తెల్ల జాతీయులంతా యూరోప్‌కు..ఇజ్రాయిల్‌కు వెళ్లిపోవాలని అంటున్నారు. ఈ డిమాండ్‌తో ఖలీస్థానీలు నిర్వహించిన ఓ ర్యాలీలో చేసిన డిమాండ్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..