Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
Chicken Dinner BGMI: బీజీఎంఐ గేమ్‌లో చికెన్ డిన్నర్ కొట్టాలని ఆటగాళ్లందరికీ ఉంటుంది. కానీ వంద మందిని దాటి విజేతగా నిలవడం అంత సులభం కాదు. మంచి గన్ కాంబినేషన్స్ కూడా చాలా ముఖ్యం.
BGMI Best Gun Combinations: బీజీఎంఐ (Battlegrounds Mobile India) గేమ్‌లో చికెన్ డిన్నర్ కొట్టాలంటే కోసం సరైన గన్ కాంబినేషన్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రతి తుపాకీకి కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. సరైన కాంబినేషన్‌ని సెట్ చేయడం గేమ్‌ప్లేలో అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది. విభిన్న పరిస్థితులలో మీకు సహాయపడే ఐదు బెస్ట్ గన్ కాంబినేషన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎం416, యూజెడ్ఐ (M416 and UZI)
దగ్గరిగా, కాస్త దూరంగా ఉన్న ఎనిమీస్ మీద కాల్పులు జరపాలనుకునే గేమర్‌లకు ఈ కాంబినేషన్ కరెక్ట్ అని చెప్పవచ్చు. ఎం416 రీకోయిల్‌ను నియంత్రిస్తుంది. ఇది మిడ్ రేంజ్‌లో కూడా లక్ష్యాలను సులభంగా ఛేదించడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు యూజెడ్ఐ క్లోజ్ రేంజ్‌లో డ్యామేజ్ ఎక్కువగా చేస్తుంది. ఎనిమీ దగ్గరగా వచ్చి మీరు త్వరగా కాల్పులు జరపాల్సి వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
2. ఏకేఎం, ఎం24 (AKM and M24)
పవర్‌ఫుల్, లాంగ్ రేంజ్ షాట్‌లను తీయడానికి ఇష్టపడే గేమర్‌లకు ఏకేఎం, ఎం24 కాంబినేషన్ చాలా బాగుంది. ఏకేఎం బుల్లెట్లు క్లోజ్ పరిధిలో చాలా పవర్‌ఫుల్. కానీ ఫైరింగ్ సమయంలో దీన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. మరోవైపు ఎం24 లాంగ్ రేంజ్ షాట్‌లలో బెస్ట్ స్నైపర్ గన్స్‌లో ఒకటి. లాంగ్ రేంజ్, క్లోజ్ రేంజ్ నుంచి కూడా బాగా ఫైర్ చేయగల ప్రో ప్లేయర్స్‌కి ఇది బెస్ట్ కాంబినేషన్.
Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
3.ఎం416, డీపీ-28 (M416 and DP-28)
ఎం416, డీపీ-28 కాంబినేషన్ మీకు లాంగ్ రేంజ్, మిడ్-రేంజ్ రెండింటిలోనూ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఎం416 తక్కువ రీకోయిల్ మిడ్ రేంజ్‌లో దీనిని బెస్ట్ గన్‌గా చేస్తుంది. డీపీ-28 అందించే 47 రౌండ్ మ్యాగజైన్ మీకు లాంగ్ రేంజ్‌లో స్థిరమైన షాట్‌లను అందించగల సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ కాంబినేషన్ గేమర్‌లకు బ్యాలెన్స్‌ని ఇస్తుంది.
4. స్కార్-ఎల్, కార్98కే (Scar-L and Kar98k)
మీరు స్నైపింగ్, మిడ్ రేంజ్‌ల్లో బాగా పని చేసే కాంబినేషన్ కోసం చూస్తున్నట్లయితే స్కార్-ఎల్, కార్98కే బెస్ట్ అని చెప్పవచ్చు. స్కార్-ఎల్ స్టెబిలిటీ, కార్98కే స్నైపింగ్ కెపాసిటీ కలిసి పెద్దగా ఉండే విశాల ప్రాంతాలలో మీకు ప్రయోజనాన్ని అందిస్తాయి. మిడ్ రేంజ్‌లో కంటిన్యుయస్ షాట్లకు స్కార్-ఎల్ బెస్ట్. అయితే కార్98కే సరిగ్గా కొడితే ఒక్క హెడ్ షాట్‌తో ఎనిమీని నాక్ అవుట్ చేస్తుంది.
5. గ్రోజా, ఏఎడబ్ల్యూఎం (Groza and AWM)
ఈ కాంబినేషన్ ఎయిర్‌డ్రాప్ ద్వారా మాత్రమే పొందగలిగే అత్యుత్తమ వెపన్స్‌లో ఒకటిగా. గ్రోజా షార్ట్ రేంజ్‌లో చాలా శక్తివంతమైన అసాల్ట్ రైఫిల్. ఇది చాలా ఎక్కువ ఫైరింగ్ రేటును కలిగి ఉంటుంది. అలాగే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అదే సమయంలో ఏడబ్ల్యూఎం అత్యంత శక్తివంతమైన స్నైపర్, దాని షాట్‌లు లాంగ్ శ్రేణిలో చాలా డెడ్లీగా ఉంటాయి. ఈ కాంబినేషన్ ప్రొఫెషనల్, అగ్రెసివ్ గేమర్‌లకు బెస్ట్ అని చెప్పవచ్చు.
బీజీఎంఐలో సరైన గన్ కాంబినేషన్‌ను ఎంచుకోవడం మీ గేమింగ్ స్థాయిని మెరుగుపరుస్తుంది. అయితే ఈ కథనంలో పేర్కొన్న గన్ కాంబినేషన్స్ మా వ్యక్తిగత అనుభవంపై ఆధారపడి ఉన్నాయి. ఒక్కొక్కరి గేమింగ్ స్టైల్‌కు ఒక్కో కాంబినేషన్ సెట్ అవుతుంది. కాబట్టి మీరు బిగినర్స్ అయితే ఈ కాంబినేషన్స్‌లో ఏదో ఒకటి ట్రై చేయండి. ఒకవేళ అడ్వాన్స్‌డ్ అయి ఉంటే ఈపాటికే ఏదో ఒక కాంబినేషన్‌ని సెట్ చేసుకుని ఉంటారుగా. దానితో కంటిన్యూ అయిపోండి.
Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!